భారత క్రికెట్ టీమ్‌పై సంచలన కామెంట్ చేసిన సెహ్వాగ్‌

cricket :భారత క్రికెట్ టీమ్‌పై సంచలన కామెంట్ చేసిన సెహ్వాగ్‌

భారత క్రికెట్ టీమ్‌లోకి రావడం ఎంత కష్టమో, జట్టులోకి వచ్చిన తర్వాత ప్లేస్‌ను కాపాడుకోవడం అంతకంటే కష్టం. భారత మాజీ క్రికెటర్లు చాలా మంది విషయంలో ఇది నిజమైంది. భారత క్రికెట్‌ మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సెహ్వాగ్‌ రిటైర్మెంట్ తర్వాత అతడి లాంటి డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ ఓపెనర్‌ను టీమిండియా తాయారు చేసుకోలేకపోయింది.

ప్రస్తుత టీమిండియాలో తన శైలిలో ఆడే ఆటగాడే లేడని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అయితే  తాజాగా ఇదే విషయంపై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న బ్యాటర్లలో తనలా ఆడేవాళ్లు ఎవరూ లేరని వీరూ సృష్టం చేశాడు.

ముల్తాన్ టెస్టులో నేను సెంచరీ చేయడానికి ఆరు సిక్సర్లు కొట్టాను. ఆ సమయంలో సచిన్ బ్యాటింగ్‌కు వచ్చాడు  అప్పుడు సచిన్ నాతో నువ్వు మళ్లీ సిక్సర్ కొడితే బ్యాట్ తో కొడతా అని హెచ్చరించాడు.  ప్రస్తుత భారత జట్టులో నా మాదిరి బ్యాటింగ్ చేసే బ్యాటర్ లేడు. కాకపోతే రిషభ్ పంత్, పృథ్వీ షాల బ్యాటింగ్ శైలి కొంచెం బ్యాటింగ్ తీరు దూకుడుగా ఆడే స్వభావం కాస్త నా ఆటను పోలి ఉంటుంది. కానీ అతను 90, 100 పరుగులతోనే సంతృప్తి పడతాడు. నేను మాత్రం అలా కాదు బరిలోకి దిగితే డబుల్ సెంచరీ, 250, 300 బాదాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతా. రిషభ్ పంత్ కూడా నాలాగే ఆలోచిస్తే అభిమానులను మరింత అలరించినవాడవుతాడని సెహ్వాగ్‌ కామెంట్స్‌ చేశాడు.

ఇక స్కోర్ 90కి చేరిన తర్వాత తనకు సింగిల్స్ తీయడం కంటే ఫోర్, సిక్సర్ బాదితేనే త్వరగా పని అయిపోయేదని, తాను ఆ మైండ్ సెట్ తోనే ఉంటానని వీరూ చెప్పుకొచ్చాడు. ‘చిన్న వయసులో నేను టెన్నిస్ బాల్ క్రికెట్ బాగా ఆడేవాడిని అప్పుడు నేను ఎక్కువగా బౌండరీలు బాదడానికే ఇష్టపడేవాడిని. అదే అలవాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా కొనసాగింది. సెంచరీ వేయడానికి ఎన్ని బౌండరీలు కావాలో అని లెక్కలు వేసుకునే వాడిని. 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు 10 సింగిల్స్ తీయడం కంటే రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ బాదితే సరిపోతుందని ఆలోచించేవాడిని’ అని తన మనసులో మాటను బయటపెట్టాడు సెహ్వాగ్‌. ముల్తాన్ టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసినప్పుడు కూడా ఇదే ఆలోచనతో ఆడాను.

అయితే అలా ఆడటం వల్ల రిస్క్ కూడా తగ్గుతుందన్నాడు. దీంతో నేను 120 నుంచి 295 పరుగుల మధ్యలో ఒక్క సిక్సర్ కూడా బాదలేదు. కానీ 295 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్సర్ కొడతానని సచిన్‌తో అన్నాను. అప్పుడు సచిన్ సీరియస్‌గా ‘నీకేమైనా పిచ్చా?’అని బండ బూతులు తిట్టాడు. భారత్ తరఫున ఎవరూ ట్రిపుల్ సెంచరీ చేయలేదని, నీకు ఆ అవకాశం దక్కిందని తెలిపాడు. బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకుంటావా?అని హెచ్చరించాడు . అప్పుడు నేను ఎవరూ 295 కూడా కొట్టలేదు కదా? అని బదులిచ్చాను. ఆ మరుసటి బంతికే సక్లయిన్ ముస్తాక్ బౌలింగ్‌లో సిక్సర్ బాది ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాను. నా ట్రిపుల్ సెంచరీని నా కన్నా సచిన్ ఎక్కువగా సంతోషించాడు.’అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh