విదేశాలకు వెళ్లనున్న ఏపీ సీఎం

Jagan family tour:విదేశీ పర్యటనకు వెళ్లనున్నఏపీ  సీఎం ఫ్యామిలీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఫ్యామిలీతో కలిసి ఆయన ఈ పర్యటనకు ప్లాన్ చేశారు. ఈ నెల 21న సీఎం జగన్ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనలో ఉండనున్నారు. అయితే పూర్తిగా పర్సనల్ టూర్ అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతీ రెడ్డి, వారి కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలు ఈ పర్యటనలో ఉండనున్నారు. అయితే సీఎం జగన్ విదేశీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

అయితే  ఒక వైపు వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, వాలంటీర్లు, గృహసారధులుఇలా అందరూ భుజనా సంచి వేసుకుని ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తున్న సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.

వారం రోజుల పాటు విదేశాల్లో వేసవి విడిది చేయనున్నారు. కుటుంబంతో వెళ్లనున్న ఈ పర్యటన కోసం ఇప్పటికే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ పాస్ పోర్టుకోర్టు అధీనంలో ఉంటుంది. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా, జెరూసలెం, దావోస్‌ లలలోజగన్ పర్యటించారు. అన్నీ కుటుంబ పర్యటనలే దావోస్ లో మాత్రం రెండు రోజులు పెట్టుబడుల సదస్సులో పాల్గొన్నారు.

ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై మరోసారి సమీక్ష చేపట్టిన సీఎం జగన్.. విపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్నందున.. ప్రజల్లో ఎక్కువ సమయం ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.

స్టిక్కర్లు అంటించే ప్రోగ్రాం 20వ తేదీ వరకే అనుకున్నారు. కానీ ఎండా కాలం కారణంగా ఈ కార్యక్రమం చాలా స్లోగా సాగుతోంది. అందుకే మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉందని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. పార్టీ నేతలంతా ఇలా ప్రత్యేకమైన కార్యక్రమంలో ఉండగా సీఎం జగన్ మాత్రం ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లడం వైసీపీ క్యాడర్‌లో కాస్త విచిత్రమైన చర్చలు జరుగుతున్నాయి.

ఎన్నికలకు ఇంకా  ఏడాది సమయం వున్నా తరుణంలో వచ్చే ఏడాది  వరకూ ఎన్నికల కోసం పూర్తి బిజీగా ఉండాల్సి ఉంటున్నందున ఇప్పుడే అలా టూర్‌కు వెళ్లి రావాలని అనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.

 

 

 

Leave a Reply