సుప్రీంకోర్టులో ఏపీప్రభుత్వానికి చుక్కెదురు

Supreme Court leaves GO, issue to high court, AP Political News, AP GO NO 1 Issue, AP Political News, Supreme Court News, AP High Court News

ఏపీలో రాజకీయంగా వివాదాస్పదమైన జీవో నెంబర్ 1 పై సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో తొక్కిసలాటతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఆ సమయంలో ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీని ద్వారా రోడ్ల పైన సభలు – ర్యాలీల నిర్వహణ పైన ఆంక్షలు విధించింది. కానీ ఏపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది జీవో నంబర్‌ 1 విషయంలో జోక్యం చేసుకోలేమని సుంప్రీకోర్టు స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై సభలు, రోడ్డుషోలు, సమావేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1 విషయంలో ప్రస్తుత పరిస్థితిలో జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది. అయితే హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.   హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినా మళ్లీ హైకోర్టు విచారణకే సూచించింది సుప్రీంకోర్టు. దీంతో ఈ నెల 23న హైకోర్టులో విచారణ ఎలా వుటుందో, ఎలాంటి నిర్ణయాన్ని ఇస్తుందో  అనేది ఇప్పడు  ఉత్కంఠగా మారింది.

ఇవి కూడా చదవండి: 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh