నెహ్రూ జూ పార్క్ సేవ‌లు ఇక ఆన్ లైన్ లో

telangana governmentstarts online ticket

నెహ్రూ జూ పార్క్ సేవ‌లు ఇక  ఆన్ లైన్ లో

హైదరాబాద్ లో ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో  నెహ్రూ జూలాజికల్ పార్క్  ఒకటి.  ఇది బహదుర్ పురాలోసుమారుగా  380 ఎకరాల విస్తీర్ణంలో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంది. 1959, అక్టోబర్ 26న నిర్మాణం ప్రారంభించి 1963, అక్టోబర్ 6 నుంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఇందులో 1500 రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి.ఈ జూ పార్కులో లయన్, టైగర్ సఫారీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం పార్క్ ని తిరిగిరవడానికి కనీసం  6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. సందర్శన సమయం ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు ఉంటుంది. గతంలో జూ పార్క్ కి సందర్శన వచ్చిన తర్వాత నేరుగా కౌంటర్ లో టికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది.

కానీ ఇప్పుడు ఆన్ లైన్ సర్వీసెస్ కూడా అందుబాటులోకి వచ్చినందున. వెళ్లాలి అనుకున్న రోజుకి సంబంధించి ఫోన్ ద్వారా ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కలిగింది . జూ పార్క్ లో ఉన్న బ్యాటిరీ వెహికల్స్ ను కూడా యాప్, వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక టూర్ ప్యాకేజీల్లో భాగంగా  జూ పార్క్ కి తీసుకొచ్చి వివిధ జంతువులు, పర్యావరణ సమతుల్యం, వన్య ప్రాణి సంరక్షణపై అవగాహన కల్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో సందర్శనకు వచ్చే వారికి మరింత మెరుగైన సర్వీసెస్ అందించడంపై దృష్టి సారించిన ప్రభుత్వం టికెట్ బుకింగ్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను రూపొందించింది. జూ పార్క్ సమస్త సమాచారాన్ని తెలియజేస్తూ వెబ్ సైట్ ను తీర్చిదిద్దింది. ఈ మేరకు సోమవారం అరణ్య భవన్ లో నెహ్రూ జూ పార్క్, కొత్త వెబ్ సైట్, మొబైల్ యాప్ ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ వెబ్ సైట్ ను రూపొందించింది. సోమవారం మినహా మిగిలిన అన్ని రోజులు జూ పార్క్ ఓపెన్ ఉంటుంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh