NTR: మళ్ళీ రికార్డ్స్ కొట్టడానికి వచ్చేస్తున్నాడు.
NTR- టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది . గతంలో బ్లాక్బస్టర్ హిట్స్ అందుకున్న స్టార్ హీరోల చిత్రాలను ప్రస్తుతం థియేటర్లో ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే .
అయితే ఆయా హీరోల స్పెషల్ డేస్ ను పురస్కరించుకున్న భారీ విజయం సొంతం చేసుకున్న ఆనాటి ఎవరిన్ చిత్రాలను మళ్లీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ చేత ఈళలు వేయిస్తున్నారు .
ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు పోకిరి , పవన్ కల్యాణ్ జాల్సా , రీసెంట్గా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి చిత్రాలను రీరిలీజ్ చేయగా వాటికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చాయి
కలెక్షన్స్ పరంగా పోకిరి , జాల్సా చిత్రాలు అదుర్స్ అనిపించాయి . ఇప్పుడు ఈ జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ చిత్రం కూడా రాబోతోంది .
NTR కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం , ఆయనకు స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఫ్యాక్షన్ డ్రామా మూవీ ‘ ఆది ‘ . వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు .
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రీరిలీజ్కు నవంబర్లో భారీ ఎత్తున సన్నాహాలు రాయలసీమ జరుగుతున్నట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి .
జూనియర్ NTR ఇండస్ట్రీకి వచ్చి 22 న ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నవంబర్లో సినిమాను మళ్లీ థియేటర్లో ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు ‘ ఆది ‘ చిత్ర బృందం పేర్కొన్నట్లు సమాచారం .
కాగా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి రీరిలీజ్ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేశ్ నవంబర్ 3 వ వారంలో ఆది రీరిలీజ్ ఉండోచ్చని చెప్పారు. . ఇక ఈ విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్ , సంబరాలు చేసుకుంటున్నారు .
ఎన్టీఆర్ లా నటించడం నావల్ల కాదు..
సాధారణంగా ఎన్టీఆర్ సినిమా వస్తోందంటేనే పూనకాలు వచ్చినట్టు ప్రేక్షకులు ఊగిపోతారు. ఇక థియేటర్లో ఆయన చెప్పే డైలాగుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఎన్టీఆర్ సీన్ లోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచి ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ థియేటర్లో విజిల్స్ తో దద్దరిల్లేలా చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఆయన లాగా డైలాగులు చెప్పడం తన వల్ల కాదు అంటూ ఒక కోలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో శుక్రవారం జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ఐశ్వర్యరాయ్, త్రిష, విక్రం , కార్తీ, జయం రవి, ఏఆర్ రెహమాన్ , తనికెళ్ల భరణి, దిల్ రాజు, శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇకపోతే ఈ వేడుకలో హీరో కార్తీ మాట్లాడుతూ.. ఎన్నో విషయాలను తెలియజేశారు. పొన్నియన్ సెల్వన్ లాంటి గొప్ప సినిమా చేసినప్పుడు చాలా విషయాలు గుర్తుకొస్తున్నాయి.
కులం , మతం అనే విషయాలను పక్కన పెట్టినప్పుడు సినిమా ఎంత గొప్పదో అర్థమవుతోంది. మనందరిని కలిపే సాధనమే సినిమా.. ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను..
అని తెలియజేశారు.ఇక అంతే కాదు పొన్నియన్ సెల్వన్ సినిమాలో డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎన్టీఆర్ ను గుర్తుకు చేసుకొని మరి డైలాగులు చెప్పాను. ఇక అలా డైలాగులు చెప్పడం అంత ఈజీ కాదు ..
ఎన్నో చారిత్రక సినిమాలు ఆయన చేశారు.. ఆయన డైలాగ్ డెలివరీ విషయంలో ఎవరు పోటీ పడలేము ..అందుకే మేము జాగ్రత్తగా డైలాగ్స్ చెప్పే ప్రయత్నం చేసాము అంటూ కార్తి తెలిపారు.
ఇక ఎన్టీఆర్ లాగా డైలాగులు చెప్పేవారు ఇంకా పుట్టలేదేమో అంటూ కూడా ఆయన పరోక్షంగా కామెంట్లు చేయడం గమనార్హం . ఏది ఏమైనా ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎన్టీఆర్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.