వార్ 2.. ఎన్టీఆర్ తో హృతిక్.. వార్ వన్ సైడే..!

What happened within the shooting of NTR Devara

బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ యశ్ రాజ్ ఫిలింస్ 2019లో తీసిన సినిమా వార్. హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన ఆ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సీక్వల్ గా వార్ 2 చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అయితే యశ్ రాజ్ ఫిలింస్ తాము తీసే సీక్వల్ సినిమాలకు డైరెక్టర్ ని మార్చడం చేస్తుంటారు. అందుకే వార్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ని పక్కన పెట్టి వార్ 2 కోసం బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీని తీసుకున్నారు.

ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే వార్ 2 లో హృతిక్ తో పాటు మన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. తారక్ బర్త్ డే రోజు యుద్ధభూమిలో నీ కోసం ఎదురుచూస్తుంటా మిత్రమా అని హృతిక్ మెసేజ్ పెట్టడం వార్ 2 కాంబో ఓ రేంజ్ లో ఉండబోతుందని హింట్ ఇచ్చారు. అయితే వార్ 2 లో హృతిక్ రోషన్ హీరోగా ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్. అయితే హీరో హృతిక్ అయినా కూడా సౌత్ లో ఆ సినిమా రిలీజైతే.. విలన్ అయిన తారక్ ఇక్కడ హీరో అవుతాడు.

వార్ 2లో ఎన్.టి.ఆర్ నెగటివ్ రోల్ అయినా ఓకే చెప్పాడు అంటే ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్య అది అని అర్ధమవుతుంది. వార్ 2లో ఎన్.టి.ఆర్ తో హృతిక్ చేసే వార్ ఏమో కానీ సౌత్ లో ముఖ్యంగా తెలుగులో మాత్రం నందమూరి ఫ్యాన్స్ వార్ వన్ సైడ్ చేసేస్తారని చెప్పొచ్చు. వార్ 2 నెక్స్ట్ ఇయర్ మొదట్లో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. 2024 డిసెంబర్ లో యష్ రాజ్ ఫిలింస్ వార్ 2 రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh