కల్కి రిలీజ్ విషయంలో కన్ ఫ్యూజన్ ఏంటి.. ప్రభాస్ ఎందుకు జాగ్రత్త పడుతున్నాడంటే..!

Prabhas Kalki Release Confusion Nag Aswin

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898AD సినిమా రీసెంట్ గా వచ్చిన టీజర్ తో సినిమా ఓ అద్భుతం అనిపించేలా చేసింది. ముందు రోజు రిలీజ్ చేసిన పోస్టర్ కామెడీగా అనిపించినా టీజర్ తో నవ్విన నోళ్లన్నీ మూయించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి పెంచాలనే ప్రయత్నంలో సినిమాలు చేస్తుంటే ఆ ప్రోత్సాహంతో ప్రభాస్ కల్కిని హాలీవుడ్ సినిమా రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా సినిమా చేస్తున్నాడు నాగ్ అశ్విన్.

కల్కి టీజర్ చూస్తేనే ఇది తెలుగు సినిమానా కాదా అన్న డౌట్ వస్తుంది. సినిమా అవుట్ పుట్ విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. ఇదిలాఉంటే ఈ సినిమా బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని తెలుస్తుంది. అయితే రిలీజ్ డేట్ విషయంలోనే దర్శక నిర్మాతలు ఒక నిర్ణయానికి రాలేదు. అసలైతే 2024 జనవరి 12న రిలీజ్ అనుకున్నా ఆ టైం లో రిలీజ్ కష్టమని టాక్. అందుకే వైజయంతి బ్యానర్ లక్కీ డేట్ అయిన మే 9న ప్రభాస్ కల్కిని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ప్రభాస్ మాత్రం కల్కి రిలీజ్ విషయంలో చాలా ఫోకస్డ్ గా ఉన్నాడని తెలుస్తుంది. బాహుబలి తర్వాత చేసిన సినిమాలన్నీ ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు ఈ టైం లో ఎన్నో అంచనాలతో చేసిన కల్కి కూడా నిరాశ పరచేలా చేస్తే అసలకే మోసం వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే కల్కి రిలీజ్ కోసం ఒక మంచి డేట్ చూస్తున్నారు. వైజయంతి సెంటిమెంట్ ప్రకారం మే 9 దాదాపు ఫిక్స్ అని అంటున్నా ఇంకా ఏదైనా మంచి డేట్ దొరుకుతుందేమో చూస్తున్నారు. త్వరలోనే ప్రాజెక్ట్ కె అదే కల్కి సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh