ఎయిం ఫర్ ద టార్గెట్.. కొడితే దిమ్మ తిరిగి పోవాలి.. బిజినెస్ మ్యాన్ లెక్క తేలుస్తాడా..?

Mahesh Businessman Target Puri Jagannath Superstar Mahesh

పూరీ మహేష్ కాంబోలో పోకిరి తర్వాత ఆ కాంబినేషన్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చిన సినిమా బిజినెస్ మ్యాన్. సూర్య భాయ్ గా మహేష్ చూపించిన తెగింపు.. చేసిన యాక్టింగ్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కేలా చేసింది. సమాజం మీద.. రాజకీయాల మీద తన యాంగిల్ లో ఉరికి ఆరేశాడు పూరీ. అసలే ఆయన పెన్నుకి పదును ఎక్కువ.. ఇక హ్యాండ్సం హీరో మహేష్ తో ఎయిం ఫర్ ది ఎవెంత్ మెయిన్ అంటూ.. కొడితే దిమ్మ తిరిగిపోవాలి అని పూరీ రాసిన డైలాగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి.

అసలే పోకిరి కాంబో ఇక బిజినెస్ మ్యాన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 2012 జనవరికి రిలీజైన ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా చేసింది. పూరీ మార్క్ డైలాగ్స్ తో సినిమా అంతా పరుగెత్తించాడు. ప్రత్యేకంగా మహేష్ నటించిన బిజినెస్ మ్యాన్ సినిమాకు అభిమానులు ఉన్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ సినిమా రీ రిలీజ్ కి రంగం సిద్ధమైంది. ఈమధ్య స్టార్ సినిమాలన్నీ కూడా రీ రిలీజ్ లు చేస్తూ హడావిడి చేస్తున్నారు.

మహేష్ ఒక్కడు, పోకిరి సినిమాతో మొదలైన ఈ రీ రిలీజ్ హంగామా మిగతా హీరోల సినిమాలతో కూడా కొనసాగుతుంది. ఇక ఆగష్టు 9 మహేష్ బర్త్ డే కానుకగా బిజినెస్ మ్యాన్ 4కె మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రీ రిలీజ్ బుకింగ్స్ అదిరిపోయాయి. చూస్తుంటే మహేష్ రీ రిలీజ్ సినిమాల కన్నా కూడా ఈ సినిమా హయ్యెస్ట్ కలెక్ట్ చేసేలా ఉంది. మహేష్ సరసన కాజల్ నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా వచ్చి 10 ఏళ్లు దాటుతున్నా సినిమాలో పూరీ రాసిన డైలాగ్స్ ఇప్పటికీ ఆడియన్స్ మనసుల్లో నిలిచిపోయాయి. మరి ఈసారి కూడా బిజినెస్ మ్యాన్ రికార్డులు కొడతాడా లేదా అన్నది చూడాలి.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh