మెగాస్టార్ తో సూపర్ స్టార్ పోటీ.. గెలుపెవరి సొంతం అవుతుంది..?

Megastar Chiranjeevi Bhola Shankar vs Super star Rajinikanth

మెగాస్టార్ చిరంజీవి ఈ ఇయర్ మొదట్లో వాల్తేరు వీరయ్యతో మెగా హిట్ అందుకోగా ఎనిమిది నెలల్లోనే మరో సినిమాతో ఆయన ఫ్యాన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా భోళా శంకర్. షాడో తర్వాత డైరెక్షన్ జోలికే వెల్లని మెహర్ రమేష్ కి చిరు పిలిచి మరీ ఛాన్స్ ఇవ్వడం గొప్ప విషయమే. అయితే బిల్లా తీసిన డైరెక్టర్ గా మెహర్ రమేష్ డైరెక్షన్ టాలెంట్ మీద నమ్మకం ఉన్న మెగా ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నా అతని మిగతా సినిమాల ఫలితాలు చూసిన ఫ్యాన్స్ మాత్రం భోళా శంకర్ పై నిరుత్సాహంగా ఉన్నారు.

తమిళ వేదాళం సినిమా రీమేక్ గా వస్తున్న భోళా శంకర్ కి ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని జోడించి ఈ సినిమా తీశారని తెలుస్తుంది. ఆగష్టు 11న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా సోలోగా రిలీజైతే మెగా మేనియాతో ఆడేస్తుందిలే అనుకోవచ్చు. కానీ ఈసారి రేసులో చిరుతో పాటు తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ పోటీ పడుతున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజిని చేసిన జైలర్ సినిమా భోళా శంకర్ సినిమాకు ఒకరోజు ముందే రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా విషయంలో మొన్నటివరకు చడి చప్పుడు లేదు అన్నట్టు ఉన్నా ఎప్పుడైతే జైలర్ ట్రైలర్ రిలీజైందో అప్పటి నుంచి సినిమాపై అంచనాలు పెరిగాయి. జైలర్ అసలు భోళా శంకర్ కు పోటీనే కాదు అనుకున్న టాక్ కాస్త జైలర్ ముందు భోళా నిలబడతాడా లేదా అన్నట్టుగా మారింది. జైలర్ సినిమా ట్రైలర్ చూస్తే చాలా కాలం తర్వాత రజినిని పర్ఫెక్ట్ గా వాడుకున్నారని అనిపిస్తుంది. మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ ఈ క్రేజీ ఫైట్ లో ఎవరు గెలుస్తారు. ఎవరు విజయ పతాకం ఎగురవేస్తారన్నది చూడాలి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh