భోళా శంకరుడితో లెజెండరీ డైరెక్టర్

raghavendrarao meets bolashankar team

భోళా శంకరుడితో లెజెండరీ డైరెక్టర్

ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రాకెట్ లాగా దూసుకుపోతున్న మెగా హీరో మెగాస్టార్ చిరంజీవి గారు . ఈ మధ్య కాలంలోనే ఆయన ఎన్నో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ రేంజ్‌లో అలరించాయో మనం చూస్తూనే వున్నాం.  అయితే గత ఏడాది వరుసగా రెండు పరాజయాలను చవి చూసిన చిరు. బాబి డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టి సంచలన విజయాన్ని సొతంం చేసుకుంది. మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటించడంతో భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేయడమే కాకుండా వింటేజ్ చిరుని కూడా ఈ మూవీలో పరిచయం చేయడంతో మెగా అభిమానులు ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు

అయితే మెగాస్టార్ ఇప్పటికే పలు చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కనున్న ‘భోళా శంకర్’ ఒకటి  దీన్ని ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరున్న మెహర్ రమేశ్ తీస్తుండడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా వుంది.  ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ (‘భోళా శంకర్’) షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు రెండు మూడు పాటలను కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ మూవీ కోసం వేసిన కోల్‌కత్తా  సెట్‌లో ప్రస్తుతం దాదాపు వంద మందితో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సందర్శించారు.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేసి ‘భోళా శంకర్ మూవీ సెట్స్ నుంచి అద్భుతమైన ఫ్రేమ్. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు సెట్స్‌ను సందర్శించి  యూనిట్‌కు తన  శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గతంలో మెగస్టార్ చూడాలని ఉంది మూవీ సమయంలోనూ కూడా ఆయన వచ్చారట. ఆ మూవీ సూపర్ హిట్ అయింది మరి ఇప్పుడు రాఘవేంద్రరావు సెంటిమెంట్ ప్రకారం ఇది హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.ఇక ఈ మూవీలో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh