బాలయ్య భగవంత్ కేసరి.. బాక్సులు బద్ధలవ్వాల్సిందే..!

Balakrishna Bhagavanth Kesari Record Business

అఖండ, వీర సింహా రెడ్డి రెండు వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న నందమూరి నట సిం హం బాలకృష్ణ లేటెస్ట్ గా భగవంత్ కేసరి సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాను అనీల్ రావిపుడి డైరెక్ట్ చేస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కన్నడ భామ శ్రీలీల మేనకోడలి పాత్రలో నటిస్తుంది.

భగవంత్ కేసరి టీజర్ తోనే సిం హం గర్జన ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించింది. ఇక సినిమా ఫుల్ మాస్ మసాలా ట్రీట్ అందించడం పక్కా అని అంటున్నారు. అనీల్ రావిపుడి కూడా స్వతహాగా బాలయ్య అభిమాని కావడంతో ఒక అభిమాని తమ హీరోని ఎలా చూడాలని అనుకుంటాడో అలా ఈ సినిమాలో బాలయ్య బాబుని చూపించాడని తెలుస్తుంది. టీజర్ లో బాలయ్య మిడిల్ ఏజ్ లుక్ అదిరిపోయింది. ఇక బాలయ్య సినిమా అంటే చాలు పూనకాలు వచ్చినట్టే మ్యూజిక్ ఇచ్చే థమన్ భగవంత్ కేసరి సినిమాకు కూడా నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడని తెలుస్తుంది.

దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న భగవంత్ కేసరి సినిమా బిజినెస్ విషయంలో బాలకృష్ణ కెరీర్ లో హయ్యెస్ట్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా విషయంలో బాలయ్య బాబు సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది. నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దసరాకి బాలయ్య మాస్ మేనియాతో పండుగ శోభ మరింత వైభవంగా ఉండబోతుందని చెప్పొచ్చు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh