ఆస్కార్ వేడుకల్లో హాట్ బ్యూటీ దీపికా పదుకొనే

Deepika Padukone at The Oscars

ఆస్కార్ వేడుకల్లో హాట్ బ్యూటీ దీపికా పదుకొనే

సినీ ప్రపంచంలో అత్యుత్తమ అవార్డు ఏది అంటే ఆస్కార్. ఈ అవార్డు దక్కించుకోవడం అనేది ఎంతో అరుదైన గుర్తింపు. 2023 ఆస్కార్ అవార్డుల వేడుక కోసం భారతీయులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి దృష్టి RRR సినిమాపై ఉంది. మార్చి 12న లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ వేడుక జరగనుంది. అయితే 95వ ఆస్కార్ అవార్డులు ప్రెజెంట్ చేస్తున్న సెలబ్రిటీల పేర్లు బయటకు రాగా అందులో దీపికా పదుకొనే కూడా ఒకరుగా ఉన్నారు. భారత్ నుంచి దీపికకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఆస్కార్ 2023లో ప్రెజెంటర్‌ గా వ్యవహరించనున్న దీపికా పదుకొనే ఈ విషయాన్ని దీపిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ప్రెజెంటర్ల జాబితాను పంచుకుంది. ఈ లిస్టులో రిజ్ అహ్మద్ఎ ,మిలీ బ్లంట్, గ్లెన్ క్లోజ్, ట్రాయ్ కొట్సూర్, డ్వేన్ జాన్సన్, జెన్నిఫర్ కన్నెల్లీ తదితరులు ఉన్నారు. దీంతో ఆస్కార్ వేదికపై మిమ్మల్ని చూడాలని ఉంది మేడం అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు కంగ్రాట్స్ అని చెబుతుండగా దీపికకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం  బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ మూవీ పఠాన్ లో నటించింది దీపికా పదుకొనే. ఈ చిత్రంలోని మొదటిపాట బేషారమ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి పలు వివాదాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. దీపికా డ్రెస్సింగ్ పై కొందరు విమర్శలు గుప్పించారు.

ఇకపోతే బాలీవుడ్ తెరపై రాణిస్తూనే టాలీవుడ్ గడప కూడా తొక్కబోతోంది దీపికా పదుకొనే. ప్రభాస్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మూవీ ప్రాజెక్టు Kలో ఆమె భాగం కాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ భారీ సినిమా రూపొందుతోంది. ఇది పాన్ ఇండియా మూవీ కాదు పాన్ వ‌రల్డ్ మూవీ అని ఇప్పటికే నాగ్ అశ్విన్ చెప్పడం ప్రభాస్ అభిమానుల్లో ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. ఈ మూవీ  కోసం డార్లింగ్  ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh