నాగార్జున గారు ఏంటండీ ఇది..!

Nagarjuna Next Movie Late for Announcement

కింగ్ నాగార్జున నవ యువ మన్మధుడిగా అక్కినేని ఫ్యాన్స్ ని అలరిస్తూ ఏయన్నార్ తర్వాత ఆయన స్థానంలో దాదాపు 3 దశాబ్ధాలుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అక్కినేని వారసుడిగా నాగార్జున ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూ తన మార్క్ చూపించడానికి ప్రయత్నించారు. టాలీవుడ్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తీయడంలో తన తర్వాతే ఎవరైనా అనేలా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు నాగార్జున.

ఇక సిల్వర్ స్క్రీన్ పై ఉన్న స్టార్స్ బుల్లితెర మీదకు వస్తే ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుంది అన్న సెంటిమెంట్ కి క్రాస్ చేసి కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడు షో హోస్ట్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 నుంచి సీజన్ 6 వరకు చేశారు. త్వరలో మొదలు కాబోతున్న సీజన్ 7 కి కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారని తెలిసిందే.

ఇదంతా బాగానే ఉంది కానీ నాగార్జున తన నెక్స్ట్ సినిమా విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు. రైటర్ ప్రసన్న కుమార్ తో సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తున్నా అది ఎంతవరకు వచ్చిందో తెలియదు.. నాగ్ మాత్రం సినిమాలు తర్వాత బిగ్ బాస్ చేసేద్దాం అని రెడీ అయిపోయాడు. ఓ పక్క అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ మొదలైంది అంటే 3 నెలలు వరకు సినిమాలకు దాదాపు గ్యాప్ ఇచ్చినట్టే లెక్క. సో ఈ ఏడాది నాగార్జున సినిమా కనీసం సెట్స్ మీదకు కూడా వెళ్లే అవకాశం లేదని తెలుస్తుంది. మరి నాగార్జున తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎందుకు లేట్ చేస్తున్నారు అన్నది ఆయనకే తెలియాల్సి ఉంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh