JR NTR ఎన్టీఆర్‌ను న‌మ్మించి నిండా ముంచేసిన బెస్ట్ ఫ్రెండ్‌.

JR NTRఎన్టీఆర్‌ను న‌మ్మించి నిండా ముంచేసిన బెస్ట్ ఫ్రెండ్‌.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సొంత ట్యాలెంట్ తో ఈ స్థాయికి వ‌చ్చాడ‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. ఎంత నంద‌మూరి వార‌సుడు అయినా స‌రే త‌న సొంత ట్యాలెంట్ తోనే ఆయ‌న ఈ స్థాయికి ఎదిగాడు. డ్యాన్స్‌, న‌ట‌న‌లో ఎన్టీఆర్‌ను కొట్టే వాడే లేడు. ఈ విష‌యంలో ఎవ‌రూ కాద‌న‌లేరు. కాగా ఎన్టీఆర్ ఫ్రెండ్స్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అంద‌రికీ తెలుసు.కాగా ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ ఒక‌రు న‌మ్మించి నిండా ముంచేశాడు. ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ఈ హీరోతో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేశాడు. ఇద్ద‌రూ క‌లిసి చాలానే ఎంజాయ్ చేసేవారు. అయితే సింహాద్రి మూవీతో ఒక్క‌సారిగా ఎన్టీఆర్ పెద్ద హీరో అయిపోయాడు. దాంతో ఇదే అవ‌కాశం అనుకుని స‌ద‌రు హీరో ఎన్టీఆర్ పేరు చెప్పి కొంద‌రి ద‌గ్గ‌ర కోట్ల డ‌బ్బులు తీసుకున్నాడంట‌.

ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ కాబ‌ట్టి వారు కూడా కాద‌న‌లేక ఆయ‌న అడిగినంత ఇచ్చేశారు. కానీ సింహాద్రి త‌ర్వాత ఎన్టీఆర్‌కు కొన్ని ప్లాపులు కూడా వ‌చ్చాయి. ఆంధ్రావాలా, సాంబ , నా అల్లుడు లాంటి ప్లాపులు వ‌రుస‌గా వ‌చ్చాయి. దాంతో ఎన్టీఆర్ ఫ్రెండ్‌కు అప్పులు ఇచ్చిన వారంతా ఎన్టీఆర్ ఇంటి మీద ప‌డ్డారు. నీ ఫ్రెండ్ మా ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకున్నాడు.ఇప్పుడు నీ ఇమేజ్ ప‌డిపోయింది. నీ మీద మాకు న‌మ్మ‌కం లేదంటూ వారు చెప్పారు. దాంతో విస్తుపోయిన ఎన్టీఆర్ తాను అప్ప‌టి వ‌ర‌కు సంపాదించిన మొత్తం తిరిగి ఇచ్చేశాడు.

స‌ద‌రు హీరో వ‌చ్చి ఎన్టీఆర్‌కు సారీ చెప్పినా స‌రే ఎన్టీఆర్ మాత్రం అస్స‌లు క్ష‌మించ‌లేదు. నిన్ను న‌మ్మితే ఇంత మోసం చేస్తావా అంటూ ఆయ‌న‌పై సీరియ‌స్ అయ్యాడంట‌. విశేషం ఏంటంటే ఇప్ప‌టికీ స‌ద‌రు హీరోను ఎన్టీఆర్ దూరం పెట్టాడ‌ని టాక్‌.

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న బాలయ్య చిన్నకూతురు!

నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు అన్‌స్టాపబుల్‌ షోతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ షో టీఆర్పీ రేటింగులోనూ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని త్వరలోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే అన్‌స్టాపబుల్‌ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తేజస్విని.. బాలయ్య స్ట్రిప్ట్‌ వర్క్‌కి సంబంధించి కీలక వ్యవహారాలనూ కూడా చూసుకుంటుందట.అన్‌స్టాపబుల్‌ షో అంత పెద్ద హిట్‌ కావడం వెనుక ఆమె పాత్ర కూడా ఎంతో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆమె నిర్మాతగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు సమాచారం. బాలయ్య హీరోగా నటించే ఓ సినిమాకు ఆమె నిర్మాత బాధ్యతలు స్వీకరించబోతున్నారట. పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. మరి తేజస్విని నిర్మాతగా సక్సెస్‌ అవుతారా లేదా అన్నది చూడాలి.

మహేష్‌–త్రివిక్రమ్ చిత్రం.. ఈసారి రెండు ‘అ’లు వచ్చేలా టైటిల్!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వచ్చిన ‘అతడు’ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ‘ఖలేజా’ చిత్రం కమర్షియల్ గా ఆ స్థాయిలో హిట్ అవకపోయినా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. దీనికి ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్‌కి ‘అ’ సెంటిమెంట్‌ ఉంది. తన చిత్రాలకు ‘అ’ అక్షరంతో మొదలయ్యే పేర్లు పెడుతుంటారు. మహేష్ తో ‘అతడు’, జూనియర్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’, నితిన్ తో ‘అ ఆ’, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురము’ తీసి భారీ హిట్స్ సాధించి పెట్టాడు త్రివిక్రమ్. ఇప్పుడు కూడా తన సెంటిమెంట్ ప్రకారం మహేష్ తాజా చిత్రం కోసం అ అక్షరం సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఒకటి కాకుండా రెండు ‘అ’ లు వచ్చేలా ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా త్రివిక్రమ్ మార్క్‌తో ఉండే యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌ అని సమాచారం. ఇందులో మహేష్‌ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా కనిపిస్తాడరట. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే తో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. మహేష్ తల్లి ఇందిరా దేవి చనిపోవడంతో రెండో షెడ్యూల్ ఆసల్యం అవుతోంది. ప్రస్తుతం విదేశాలకు వెళ్తున్న మహేష్ తిరిగొచ్చిన తర్వాత తొందర్లోనే రెండో షెడ్యూల్ మొదలు పెట్టాలని చూస్తున్నారు.

మరో ప్రయోగానికి సిద్ధమైన నాని..

శ్యామ్‌ సింగరాయ్‌, అంటే సుందరానికి వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌లను ఖాతాలో వేసుకున్న నాని జోష్‌ మీదున్నారు. ప్రస్తుతం ఈ న్యాచురల్‌ స్టార్‌ దసరా సినిమాలో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదల్వక ముందే మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టే పనిలో పడినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నాని ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నాడని ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ నడుస్తోంది.దసరా చిత్రంతో నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని, ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని లాంచ్‌ చేయనున్నాడని సమాచారం. మోహన్‌ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నాని వెంటనే సినిమాకు ఓకే చెప్పాడని, నాని కెరీర్‌లో మునుపెన్నడూ రాని డిఫ్రెంట్‌ స్టోరీ లైనప్‌తో ఈ సినిమా ఉండనుందని టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం దసరా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా తదనంతర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేశ్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh