Tollywood తారక్ సినిమా కోసం కొరటాల కసరత్తులు.

Tollywood తారక్ సినిమా కోసం కొరటాల కసరత్తులు..

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు కొరటాల శివ. అప్పటివరకు రచయితగా ఉన్న కొరటాల ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు. మిర్చి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కొరటాల పేరు మారుమ్రోగింది. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో సినిమాలు చేశారు కొరటాల శివ. మిర్చి సినిమా తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మరోసారి మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలు చేశారు కొరటాల శివ.

ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేశారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అసలు ఇది కొరటాల శివ సినిమానేనా అనేలా తీశారు అంటూ కామెంట్స్ కూడా వినిపింవచ్చాయి. ఇక ఇప్పుడు కొరటాల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఆచార్య ఎఫెక్ట్ ఏమాత్రం పడకుండా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట కొరటాల. అందుకోసమే ఎక్కువ టైం తీసుకుంటున్నారట. అయితే ఇక ఈ సినిమాను కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. కొరటాల మాత్రం ఈసారి సాలిడ్ హిట్ కొట్టి.. గట్టి కామ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఈ మేరకు ఓ అదిరిపోయే కథను సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. తారక్ పవర్ఫుల్ డైలాగ్ తో ఈ మోషన్ పోస్టర్ ను డిజైన్ చేశారు.

అయితే ఆ తర్వాత ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. అటు ఈ సినిమాకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తారక్ అభిమానులు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ముందుగా ఈ సినిమాకోసం కొరటాల అనుకున్న కథను ఇప్పుడు పక్కకు పెట్టి. మరో కథను సిద్ధం చేస్తున్నారట కొరటాల. ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథను మార్చినట్టు తెలుస్తోంది. తాను ముందుగా అనుకున్న కథ కంటే ఇప్పుడు పవర్ ఫుల్ కథను రెడీ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో రష్మిక కానీ కీర్తి సురేష్ కానీ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ప్రభాస్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ బిల్లా రీరిలీజ్ ప్రెస్ మీట్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిల్లా సినిమా ఇప్పుడు నయా టెక్నాలజీ 4కే తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం టాలీవుడ్బ్ లో నయా ట్రాండ్ చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యింది సందడి చేస్తున్నాయి. ఈ హంగామాకు నాంది పలికింది సూపర్ స్టార్ మహేష్ బాబు.

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ‘పోకిరి’ 4కే ను భారీగా రిలీజ్ చేశారు .. అంతేకాదు ఆ సినిమా మంచి ఆదరణ పొందింది. ఇక పోకిరి సినిమా తర్వాత సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా జల్సా సినిమాను రిలీజ్ చేశారు. అలాగే బాలయ్య నటించిన చెన్నకేశవ రెడ్డి సినిమా కూడా రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన బిల్లా సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను ఈ నెల 23న రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు చిత్రయూనిట్.

సినిమాటాలీవుడ్ లో మల్టీస్టారర్ ల హంగామా!

టాలీవుడ్ లో చాలా ఏళ్ల తరువాత మళ్లీ మల్టీస్టారర్ ల హంగామా మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి సాయి ధరమ్ తేజ్ వరకు అంతా మల్టీస్టారర్ సినిమాలపై పడ్డారు. ఇప్పటికే `RRR` భీమ్లానాయక్ బంగార్రాజు ఆచార్య వంటి మల్టీస్టారర్ సినిమాలొచ్చిన విషయం తెలిసిందే. వీటి తరువాత కూడా బ్యాక్ టు బ్యాక్ బంజ్ ఆఫ్ మల్టీస్టారర్ మూవీస్ సెట్స్ పై వున్నాయి. మెగాస్టార్ నుంచి విశ్వక్ సేన్ వరకు మల్టీస్టార్ సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి `గాడ్ ఫాదర్` తరువాత బాబి డైరెక్షన్ లో 154వ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే.

`వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ ఖరారు చేయనున్న ఈ మూవీలో చిరుతో కలిసి మాస్ రాజా రవితేజ కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదందులో ఇద్దరు బ్రదర్స్ గా కనిపించనున్నారు. `అన్నయ్య` మూవీలో చిరుతో కలిసి రవితేజ నటించిన విషయం తెలిసిందే. దాదాపు ఇరవై రెండేళ్ల తరువాత ఈ మూవీలో కలిసి నటిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలే వున్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.ఇక సల్మాన్ ఖాన్ నటిస్తున్న క్రేజీ మూవీ కిసీకీ భాయ్ కిసీకీ జాన్`.

ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ బ్లాక్ బస్టర్ `వీరం` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ ముగ్గురు స్క్రీన్ పై కనిపిస్తూ ఫ్యాన్స్ కి పూనకాలే. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రంజాన్ సందర్భంగా రిలీజ్ కాబోతోంది.ఈ ఏడాది ప్రారంభంలో నాగచైతన్యతో కలిసి నాగార్జున `బంగార్రాజు` మూవీలో నటించాడు. దీని తరువాత కింగ్ నాగ్ ..

అఖిల్ తో కలిసి నటించబోతున్నాడు. దీనికి `గాడ్ ఫాదర్` ఫేమ్ మోహన్ రాజా డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. `మనం`లో అఖిల్ గెస్ట్ క్యారెక్టర్ లో కనిపించి అదరగొట్టిన విషయం తెలిసిందే. వీరితో పాటే మంచు వారు కూడా మల్టీస్టారర్ మూవీకి రెడీ అవుతున్నారు.

అగ్నినక్షత్రం` కోసం మంచు లక్ష్మితో మోహన్ బాబు కలిసి నటిస్తున్నారు. దీని తరువాత మలయాళంలో సూపర్ హిట్ అనిపించుకున్న `ఆండ్రాయిడ్ కుంజప్పన్ 5. 25` ని తెలుగులో మంచు విష్ణు రీమేక్ చేయబోతున్నరు. ఇందులో తండ్రి పాత్రలో మోహన్ బాబు నటించనుండగా తనయుడి పాత్రలో మంచు విష్ణు కనిపించబోతున్నాడు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించబోతున్నారు. తమిళంలో హిట్ అయిన `వినోదాయ సితం`ని వీరి కాంబినేషన్ లో పీపుల్ మీడియా వారు రీమేక్ చేయబోతున్నారు..

సినిమా’కార్తికేయ 3′ పై నిఖిల్ ఆసక్తికర కామెంట్స్!

సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్న హీరో నిఖిల్. `హ్యాపీడేస్`తో పరిచయమైన నిఖిల్ తనదైన పంథాలో సినిమాలని ఎంచుకుంటూ హీరోగా వరుస విజయాల్ని దక్కించుకుంటూ తన ప్రత్యేకతని చాటుకుంటున్నాడు. రీసెంట్ గా `కార్తికేయ 2`తో ఊహించని విధంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని దక్కించుకుని ఆశర్యపరిచాడు.

చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రూ. 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ఔరా అనిపించింది.చందూ మొండేటి డైరెక్షన్ లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఉత్తరాదిలో రూ. 30 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి నిఖిల్ సినిమాల్లో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుని ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ సినిమాలో అఖిల్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఈ మూవీకి సీక్వెల్ గా `కార్తికేయ 3`ని కూడా చేయబోతున్నారట. దీనిపై ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ హీరో నిఖిల్ తాజాగా ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. `కార్తికేయ` తీస్తున్నప్పుడు దానికి సీక్వెల్ చేయాలనుకోలదన్నాడు. అంతే కాకుండా తాను ఎక్కడికి వెళ్లినా `కార్తికేయ 2` ఎప్పుడు తీస్తున్నారని అడిగే వారట. ఇప్పడు `కార్తికేయ 3` గురించి కూడా అలాగే అడుతున్నారని నిఖిల్ స్పష్టం చేశాడు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కానుందని తెలియజేశాడు.

ఒక వేళ నేను `కార్తికుయ 3` చేయకపోతే అభిమానులు ఏమంటారో తెలియదు కానీ మా అమ్మా మాత్రం నన్ను వదలదు`. అన్నాడు నిఖిల్. ఇదే సందర్భంగా `RRR` ఆస్కార్ పై స్పందించాడు. ఇటీవల విడుదలైన `RRR` `ది కశ్మీర్ ఫైల్స్` నా మనసుకు బాగా దగ్గరయ్యాయి. ఆ సినిమాలకు ఆస్కార్ వస్తే సంతోషమే. కానీ అదే ముఖ్యమైంది కాదు. ఎందుకంటే ప్రేక్షకుల ప్రేమాభిమానాలు గొప్పవి` అని వివరించాడు నిఖిల్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh