మియాపూర్ మాతృశ్రీ నగర్ పార్కు స్థలంలో నిర్మించిన సోసైటీ ఆఫీస్ బిల్డింగ్ కూల్చివేత.

మియాపూర్ మాతృశ్రీ నగర్ పార్కు స్థలంలో నిర్మించిన సోసైటీ ఆఫీస్ బిల్డింగ్ కూల్చివేత.

మియాపూర్ మాతృశ్రీ నగర్ పార్కు స్థలంలో నిర్మించిన కాలనికి సంబందించిన సోసైటీ ఆఫీస్ బిల్డింగ్ పై కొందరు కాలనీ వాసుల సహకారం తో వంగల వినయ్ అనే వ్యక్తి హైకోర్టు లో పిటీషన్ వేయగా శుక్రవారం సొసైటీ ఆఫీస్ ని GHMC వాళ్ళు కూల్చివేయడం జరిగింది. వంగల వినయ్ అనే వ్యక్తి కోర్ట్ ని ఆశ్రయించి పిటిషన్ వేసి పార్కు లో నిర్మించిన షెడ్డు మరియు సొసైటీ బిల్డింగ్ లను అక్రమంగా నిర్మించారు అని కోర్ట్ దగ్గర స్టే తో గత నెల 20 వ తారీకునా పార్క్ లో వున్న షెడ్డును GHMC వారు కూల్చివెయ్యగా. దీంతో కాలనీ అసోసియేషన్ హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అమలులో ఉన్న కూల్చివేత ఆదేశాల పై ఎటువంటి జోక్యం చేసుకోబోమని తేల్చేసింది.

గురువారం ఈ కేసు విచారణ జరుగగా పిటిషనర్ వాదన వైపే మొగ్గు చూపిన ధర్మాసనం పార్కుస్థలం లో ఉన్న నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది రంగంలోకి దిగారు. మాతృశ్రీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయానికి చేరుకొని వెంటనే కూల్చివేత మొదలు పెట్టాల్సి ఉందని భవనాన్ని ఖాళీ చేయాలని సొసైటీ ఆఫీస్ సిబ్బంది కి మరియు అడాక్ కమిటీకి సూచించారు. గత నెలలో షెడ్డును కూల్చేసిన జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సిబ్బంది శుక్రవారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh