NTR జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో అతి పెద్ద డిజ‌ప్పాయింట్మెంట్ ఇదే.

NTR జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో అతి పెద్ద డిజ‌ప్పాయింట్మెంట్ ఇదే..

జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ స్టార్ట్ చేసి 20 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్టీఆర్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఎన్నో సంచ‌ల‌నాలు త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇటీవ‌ల జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆరు వ‌రుస హిట్లు కొట్టినా కూడా ఫ్యాన్స్‌కు ఎందుకో మ‌జా రావ‌డం లేదు. ఫ్యాన్స్‌ను బాగా ఊసూరు మ‌నిపిస్తున్నాడు.

ఇందుకు కార‌ణం గ‌త కొన్నేళ్ల‌లో ఎన్టీఆర్ సినిమాలు స్పీడ్‌గా రావ‌డం లేదు.2018 చివ‌ర్లో అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఆ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ డైరీలో 2019 – 2020 – 2021 సంవత్స‌రాలు ఒక్క సినిమా కూడా రాకుండా ఖాళీగా ఉన్నాయి. గ‌తంలో ఎన్టీఆర్ కెరీర్ స్టార్ట్ అయ్యాక ఒక్క 2009 క్యాలెండ‌ర్ ఈయ‌ర్ మాత్ర‌మే ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఖాళీగా ఉంది.ఇక త్రిబుల్ ఆర్ కోసం రాజ‌మౌళి మూడేళ్ల పాటు ఎన్టీఆర్‌ను బ్లాక్ చేసేయ‌డం ఒక మైన‌స్ అయితే.. మ‌ధ్య‌లో క‌రోనా రావ‌డం కూడా ఎన్టీఆర్ కెరీర్‌లో ఏకంగా వ‌రుస‌గా మూడేళ్లు ఖాళీగా ఉండేలా చేసింది.

ఎన్టీఆర్ అదుర్స్ 2009లో రావాలి… అయితే ఆ యేడాది ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉండ‌డంతో అదుర్స్ 2010 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.ఆ త‌ర్వాత రీసెంట్‌గా వ‌రుస‌గా మూడేళ్లు త‌న క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌ను ఖాళీగా ఉంచేశాడు. స‌రే ఈ యేడాది ట్రిపుల్ ఆర్ త‌ర్వాత అయినా వ‌రుస‌గా సినిమాలు చేస్తాడా ? అనుకుంటే ఇప్ప‌టికే ఆరు నెల‌ల‌కు పైగా ఖాళీగా ఉన్నాడు. కొర‌టాల సినిమా ఎప్పుడు ప‌ట్టాలు ఎక్కుతుందో తెలియ‌డం లేదు. ఇలా అయితే వ‌చ్చే యేడాది ప్రారంభంలో కూడా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యే అవ‌కాశాలు లేవు. ఇంత లాంగ్ గ్యాప్ తీసుకుని… ఫ్యాన్స్‌ను ఊసూరుమ‌నిపించ‌డం ఎన్టీఆర్ కెరీర్‌లో ఇదే ఫ‌స్ట్ టైం.

ఇక గతంలో 2007 నుంచి 2010 వరకు మహేష్ బాబు లాంగ్ గ్యాప్ తీసుకుని ఫ్యాన్స్‌ను డిజ‌ప్పాయింట్‌మెంట్ చేశాడు. రామ్‌చ‌ర‌ణ్ కూడా 2019లో సంక్రాంతికి వ‌చ్చిన విన‌య‌విధేయ రామ త‌ర్వాత 2020 – 2021 ఖాళీ త‌ర్వాత 2022లో మాత్ర‌మే త్రిబుల్ ఆర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ప‌వ‌న్ కూడా 2001లో ఖుషీ త‌ర్వాత 2003లో జానీతో మాత్ర‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇక 2009లో జ‌ల్సా త‌ర్వాత మ‌ళ్లీ 2010లో కొమ‌రంపులి వ‌ర‌కు ఖాళీగానే ఉన్నాడు.

25 ఏళ్ల రష్మిక అంటే బాలయ్యకు ఎందుకు అంత ఇష్టము.

ప్రజెంట్ సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. దానికి కారణం బాలయ్య ను తన క్రష్ ఎవరు అనగానే రష్మిక మందన పేరు చెప్పడం. మనకు తెలిసిందే బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 2 గత వారమే ప్రారంభమైంది . ఫస్ట్ ఎపిసోడ్లో భాగంగా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ వచ్చి సందడి చేసారు. .

ఇక సెకండ్ ఎపిసోడ్లో టాలీవుడ్ యంగ్ హీరోస్ విశ్వక్ సేన్.. సిద్దు జొన్నలగడ్డ అన్ స్టాపబుల్ షో కి వచ్చి బాలయ్యతో సరదాగా అల్లరి చేసారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా వాళ్లు అఫీషియల్ గా రిలీజ్ చేశారు.కాగా ఈ షోలో ఇద్దరు యంగ్ హిరోస్ తో పోటీపడుతూ బాలయ్య చేసిన డాన్స్ అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు ఏమాత్రం తీసిపోని విధంగా బాలయ్య వేసిన పంచెస్ చెప్పిన డైలాగ్స్ నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే షోలో భాగంగా వాళ్ళు బాలయ్యను ..

”మీ ప్రజెంట్ క్రష్ ఎవ్వరు అని అడగక ఆయన రష్మిక మందన్నా” అంటూ చెప్పుకొచ్చారు . దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాలు చప్పట్లు కొట్టారు. దీంతో ప్రజెంట్ దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన్నా-బాలకృష్ణ పేర్లు వైరల్ గా మారాయి.కాగా ఇంతమంది హీరోయిన్స్ ఉండగా బాలయ్య ఎందుకు రష్మిక మందన్నా పేరే చెప్పాడు అని కొందరు చర్చించుకుంటున్నారు. దానికి మెయిన్ రీజన్ రష్మిక మందన్నా మంచితనం అంటూ తెలుస్తుంది.

మనకు తెలిసిందే రష్మిక మందన్నా సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయింది . అయితే అంతకుమించిన గొప్ప మనసు ఆమెకి ఉంది . రష్మిక మందన ప్రతి సినిమాకు వచ్చే రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని అనాధ పిల్లలకి చారిటబుల్ ట్రస్ట్ కి డొనేట్ చేస్తుందట . అంతేకాదు గతంలో ఓసారి బాలకృష్ణ గారికి సంబంధించిన బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ కి కూడా రష్మిక తన స్దాయి సహాయం చేసినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా అనాధ పిల్లల్ని చేరదీసి రష్మిక హెల్ప్ చేస్తుంది . ఈ క్రమంలోని రష్మిక గురించి తెలుసుకున్న బాలయ్య ఇండస్ట్రీలో ఇలాంటి హీరోయిన్స్ నే ఉండాలని ..రష్మిక మందన లాంటి మంచి మనసు అందరికీ ఉండదని ..గతంలో సీజన్ వన్ కి వచ్చినప్పుడు ఆమెతోనే చెప్పారట . కోపం వస్తే అరిచే బాలయ్య..మంచి పని చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు.

నా సినిమాలో ఆ అమ్మాయి వద్దు అంటే వద్దు.. మహేశ్ సంచలన నిర్ణయం ..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని జంటలు తెరపై భళే ముద్దుగా ఉంటాయి . నిజంగా ఎవరైనా సరే రిలేషన్ షిప్ తెలియని వాళ్ళు చూస్తే నిజం లవర్స్ అని లేదా భార్యాభర్తలను అనుకుంటారు . అంతలా వాళ్ళ కెమిస్ట్రీ తెరపై సూపర్ గా వర్కౌట్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటి చూడ చక్కని రియల్ కపుల్స్ బోలెడు మంది ఉన్నారు .

వాళ్ళల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యూట్ రియల్ కపుల్ మహేష్ బాబు-భూమిక. వీళ్ళిద్దరి కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు చూడ చక్కగా ముచ్చటగా ఉంటారు.తెర పై ఈ జంట కనిపిస్తే చాలు ఆడియన్స్ విజిల్స్ తీ కేకలు వేస్తూ రచ్చ రంబోలా చేస్తారు. వీళ్లిద్దరు కలిసి నటించిన సినిమా ఒక్కడు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు కొల్లగొట్టింది, అప్పటివరకు మహేష్ బాబు సైలెంట్ హీరో అని అంతా అనుకున్నారు. కానీ మహేష్ బాబును జనాలకు దగ్గర చేసిన సినిమా ఒక్కడునే. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమా సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది . గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా..

భూమిక హీరోయిన్గా నటించింది . అంతేకాదు ప్రధాన పాత్రలో ప్రకాష్ రాజ్ ఇరగదీసాడు . ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మణిశర్మ సంగీతం .ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు మన ప్లే లిస్ట్ లో ప్లే అవుతూనే ఉంటాయి.ఇదే సినిమా తమిళం,కన్నడ, హిందీ ,బెంగాలీ భాషల్లో పునర్మితమైంది. కాగా నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా మొదట అనుకునింది గుణశేఖర్ సోనాలి బింద్రే నట. మహేష్ బాబు సరసన అప్పటికే మురారి సినిమాలో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సోనాలి ..

ఈ సినిమాలో నటిస్తే మరీ అందంగా ఉంటుందని సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని అనుకున్నారట. అయితే మహేష్ బాబు మాత్రం తన సినిమాలో సోనాలి వద్దు అంటే వద్దు అని మొండి చేశాడట. దానికి కారణం “మురారి సినిమాలో ఆల్రెడీ ఒకసారి మా ఇద్దరి జంటని తెరపై చూసేసారు ..మళ్ళీ అదే హీరోయిన్ ని రిపీట్ చేస్తే జనాలకి బోర్ కొడుతుంది. ఎవరైనా కొత్త అమ్మాయి పడితే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. జనాలకు ఇంట్రెస్ట్ కలుగుతుంది ” అంటూ చెప్పాడట.అయినా కానీ గుణశేఖర్ వినకుండా సోనాలి అయితే బాగుంటుందని రెండు మూడు సార్లు ఆమె పేరు సజీష్ట్ చేశారట. దీంతో కోప్పడిన మహేష్ బాబు “నా సినిమాలో సోనాలి బింద్రే వద్దు.

ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకోరండి “అంటూ ఘాటుగా ఆన్సర్ ఇచ్చాడట . అప్పుడు ఒక్కసారిగా భూమిక పేరు హైలెట్ గా మారడం ఆమెని సినిమాలోఖి తీసుకోవడం జరిగింది. సినిమాలో ఆమె నటించిన నటనకు అందరూ ఫిదా అయ్యారు . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే జనాలు ఫ్యామిలీ మొత్తం ఒక్క దగ్గర కలిసి కూర్చొని చూస్తారు. అంతలా జనాలకు ఎక్కేసింది ఈ సినిమా.

హ్యూజ్ హిట్ కి కారణం అదే.. టాప్ సీక్రెట్ ను బయట పెట్టేసిన కాంతారా కన్నడ బ్యూటీ ..

ప్రజెంట్ ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది . అదే రిషబ్ శెట్టి నటించిన “కాంతారా”. ఎటువంటి అంచనాలు లేకుండా సదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొడుతుంది . ఇప్పటివరకు హైయెస్ట్ ఐఎండిబి రేటింగ్ సంపాదించుకున్న ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 రికార్డును కొల్లగొడుతూ..

ఏకంగా కాంతారావు మూవీ 9.5 రేటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉంది. దీంతో ఒక్కసారి అందరి దృష్టి కాంతారా సినిమా పైనే పడింది.రిషిప్ శెట్టి నటించిన కాంతారా సినిమా కన్నడలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని అందుకుంటున్న కాంతారా సినిమా త్వరలోనే 200కోట్ల క్లబ్ లోకి చేరిపోతుంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . ఈ క్రమంలోనే తెలుగులో రిలీజ్ అయిన కాంతారా ..ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను దక్కించుకున్నింది.

అంతేకాదు భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో జోడిగా నటించిన హీరోయిన్ సప్తమి గౌడ పేరు ఈ సినిమా ద్వారా బాగా పాపులారిటీ లోకి వచ్చింది.అంతకముందు సప్తమి కొన్ని సినిమాల్లో నటించినా.. ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయింది . కానీ సినిమా ద్వారా ఒక్కసారి ఫామ్ లోకి వచ్చిన సప్తమి క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తుంది . కాగా ఈ సినిమా కోసం సప్తమి చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో న్యాచురల్ లుక్స్ లో అదరగొట్టిన సప్తమి కాంతారా సినిమా కోసం రెండు వైపులా ముక్కు కుట్టించుకున్నిందట. అంతేకాదు ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డామని,, ప్రతి సీన్ ని చాలా కేర్ ఫుల్ గా గా నేచురాలిటీగా అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించాలని ఈ సినిమా కోసం టీం మొత్తం చాలా చాలా కష్టపడ్డామని దానికి తగ్గ ఫలితం అందుకున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది .

కథలో కంటెంట్ ఉంటే కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని జనాలు ఆ సినిమాను ఆదరిస్తారని మరోసారి కాంతారా మూవీ ద్వార ప్రూవ్ అయిందని సప్తమి గౌడ చెప్పుకోరావడం సంచలనంగా మారింది. అంతేకాదు సప్తమి గౌడ ఇప్పటికే మూడు క్రేజీ ప్రాజెక్టులలో సైన్ చేసినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh