YSRCP : జగన్ సర్కార్ కు జనసేన సపోర్ట్

Janasena Chief Sends His Wishes To AP Government Over Visakha Global Investors Summit

YSRCP :జగన్ సర్కార్ కు జనసేన సపోర్ట్….

YSRCP : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌కు ముహూర్తం దగ్గర రికీ వచ్చింది.  శుక్రవారం (మార్చి 3) ఉదయం విశాఖపట్నం వేదికగా ఈ పెట్టుబడి దారుల సదస్సు ప్రారంభం కానుంది.

ఇందుకోసం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి దేశ విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతుంది

శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నామన్నారు. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు..

మన యువతకు ఉపాధిని అందించే అవకాశం వస్తుందని భావిస్తున్నామని జనసేనాని పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నామన్నారు.

ఏపీలో ఆర్థిక వృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించాలని వైసీపీ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా విన్నవించారు.

రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడి దారుల్లో నమ్మకాన్ని కలిగించాలన్నారు. ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం విశాఖకే పరిమితం చేయవద్దన్నారు.

తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపల్లో కూడా పెట్టుబడులకున్న అవకాశాలు వివరించాలని సూచించారు. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లాగా మార్చాలని సూచనలు చేశారు.

ఇక చివరిగా- రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదన్నారు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వంపై ఎటువంటి రాజకీయ విమర్శలు చేయమన్నారు.

పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సహకారం అందిస్తుందన్నారు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి జనసేన  శుభాకాంక్షలు తెలియజేస్తోందన్నారు. రాజకీయం కంటే రాష్ట్ర శ్రేయస్సు మిన్న అని  వరుస ట్వీట్లు చేశారు పవన్‌ కల్యాణ్‌ గారు .

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh