Pawan Kalyan: సర్‌ప్రైజ్ ఇచ్చిన జనసైనికులు

Pawan Kalyan

Pawan Kalyan: పవన్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన జనసైనికులు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఒక వైపు సినిమాలు,  మరొక వైపు రాజకీయాలతో ఫుల్ బిజీ. చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. సినిమాలను, రాజకీయాలను బ్యాలెన్స్‌డ్‌గా నడిపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏమాత్రం కలిగి వున్నా తన సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తున్నారు. ఈ సారి పాలిటిక్స్‌లో సత్తా చాటాలని జనసేనాని గట్టి పట్టుదలగా వున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని ఆయన వదిలిపెట్టడం లేదు.

ఇదిలావుండగా.. పవన్ కల్యాణ్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు వున్నాయి. వీటన్నింటిని వేగంగా పూర్తి చేసి సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణ , సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారంతో పవన్ బిజీ కానున్నారు. దీనిని దృష్టిలో వుంచుకునే షూటింగ్‌లు త్వరగా ముగించాలని కూడా పవన్ నుంచి దర్శక నిర్మాతలకు ఆదేశాలు వెళ్లినట్లుగా ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.

Also Watch

Minister KTR: మోదీ ఎవరికి, ఎందుకు దేవుడు

ప్రస్తుతం OG సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందం మొత్తం గతవారం మహారాష్ట్ర వెళ్లిన విషయం తెల్సిందే. గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇక ఈ నేపథ్యంలోనే నేడు మహారాష్ట్రలోని వాయ్ లేక్ వద్ద షూటింగ్ జరుగుతుండగా అక్కడ ప్రత్యేక్షమయ్యారు జనసైనికులు.. పవన్ కోసం జనసేన ఫ్లెక్సీని పట్టుకొని ఎదురుచూస్తున్నారు. అది చూసిన పవన్ వెంటనే వారిదగ్గరకు వెళ్లి వివరాలు కనుక్కున్నారు. వారు రాజమండ్రి నుంచి వచ్చిన సింగిరి సాయి, సింగిరి రాజేష్, సన్నీ జాన్ అని తెలుస్తోంది. ఇక వారితో పవన్ ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇకపోతే ఈ ఫొటోలో పవన్ లుక్ మరోసారి హీట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ ఫోటోలో జపనీస్ సమురాయ్ లుక్ లో కనిపించాడు. గతంలో ఖుషి సినిమాలో ఆయన ఆ లుక్‌లో కనిపించారు. అలాగే తన కోసం వచ్చిన జనసైనికులతో పవన్ సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh