గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని పై అరెస్ట్ వారెంట్ జారీ

arrest warrant on ex minister kodali

గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని పై అరెస్ట్ వారెంట్ జారీ

మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ పెండింగ్ పై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. కొడాలి నాని తీరుపై, ఆయన కోర్టుకి రాకపోవడంపై ఆగ్రహం చేసిన వ్యక్తం చేసిన ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం కొడాలి నానిపై అరెస్టు వారెంట్ ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ పేట సీఐ కి న్యాయమూర్తి గాయత్రీ దేవి ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు. కోర్టు ధిక్కారం కింద కొడాలి నాని పై జారీ అయిన అరెస్ట్ వారెంట్ ను అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా అంశంపై కొడాలి నాని ర్యాలీ నిర్వహించారు. 2016 మే 10వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారధితో పాటు మరికొందరితో కలిసి కొడాలి నాని అముమతి లేకున్నా వన్ వేలో ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఉత్తర్వులను ఉల్లంఘించి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారని ఆరోపణలతో, అప్పుడు కొడాలి నాని పై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.

ఈ కేసు విచారణకు కొడాలి నాని హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2023 జనవరి 5వ తేదీ నుంచి ఈ కేసు పెండింగ్లో ఉంది. కేసు వాయిదాలకు కోర్టుకు కొడాలి నాని హాజరు కావడం లేదు. దీంతో కొడాలి నాని తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ పేట సిఐ సురేష్ కుమార్ ఈ మేరకు కోర్టుకు హాజరై ధర్మాసనం ముందు వివరణ ఇచ్చారు. దీంతో గుడివాడ ఎమ్మెల్యే నాని పై అరెస్టు వారెంట్ పెండింగ్లో ఉందని, దానిని తక్షణమే అమలు చేయాలని న్యాయమూర్తి గాయత్రి దేవి సిఐని ఆదేశించారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh