TRS MLA ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే

TRS MLA ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.తనకు అవకాశమిచ్చి తన విజయానికి కారణమైనందుకు సిఎం కెసిఆర్‌కు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కృతజ్జతలు తెలిపారు.కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్ శాలువాతో ఆయనను సత్కరించి దీవించారు.మునుగోడు అభ్యర్థి విజయం కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను సిఎం కెసిఆర్ అభినందించారు.పార్టీ మీద, నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని సిఎం పేర్కొన్నారు.

2.నోట్ల రద్దు తప్పని ఒప్పుకుని, దేశ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలి – మంత్రి కేటీఆర్.

దేశంలోని ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రధానమంత్రి మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణమని మంత్రి కేటీఆర్ అన్నారు.
భారత దేశ ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోదీ నోట్ల రద్దు నిర్ణయంతో దారుణంగా దెబ్బతీశారని విమర్శించారు. నవంబర్ 8, 2016న 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు.నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థను కుంగదీసిందని, ప్రధాని చెప్పిన ఒక్క లక్ష్యం కూడా నెరవేరలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

3. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న హైకోర్టు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ఇవాళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సమర్పించాలని ఆదేశించింది.కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టనుంది.

4. నవంబరు 15న అతిపెద్ద ప్రకటన చోయబోతున్నా..డొనాల్డ్ ట్రంప్.

వచ్చే వారం చాలా ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నట్టు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. ట్రంప్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. గత ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరించడానికి ట్రంప్ ససేమిరా అన్నారు. శ్వేతసౌథం నుంచి బయటకు రావడానికి ఒక దశలో ఆయన ఒప్పుకోలేదు. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తూ ట్రంప్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే, ఆయనకు అక్కడ చుక్కెదురయ్యింది. దీంతో చివరకు అధ్యక్షభవనం వీడి జో బైడెన్‌‌కు పగ్గాలను అప్పగించారు. 2024 ఎన్నికల్లో తాను పోటీచేస్తానని ట్రంప్ సంకేతాలిచ్చారు.

సోమవారం ఓహియోలో జరిగిన మధ్యంతర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ‘‘చాలా ముఖ్యమైన, కీలకమైన ఎన్నికల నుంచి తప్పుకోకుండా… నేను నవంబర్ 15 మంగళవారం ఫ్లోరిడా పామ్ బీచ్‌లోని మార్-ఎ-లాగోలో చాలా పెద్ద ప్రకటన చేయబోతున్నాను. ’’ అని వెల్లడించారు.

5.రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఆ రోజే ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బు జమ.

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది.వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాలతో పాటు పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని నవంబర్ 29వ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు పేర్కొంది.ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని స్పష్టం చేశారు.రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలని.. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

6. దక్షిణ చైనా సముద్రంలో విషాదం.

ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో పనిలేక, బతకలేక, కనీసం బతికి ఉండేందుకు తిండిలేక నానా అవస్థలు పడుతున్నారు జనం.దేశం దాటి వెళ్లి ఏ తీరానికి చేరుకున్నా ఫర్వాలేదని బయల్దేరారు అంతా.కానీ సముద్రంలో పరిస్థితులు సహకరించక వియత్నా, ఫిలిప్పీన్స్‌ మధ్య చిక్కుకున్నారు.కాపాడాలంటూ తమిళనాడులోని బంధువులకు ఫోన్‌ చేసి వేడుకుంటున్నారు.శ్రీలంక నుంచి వలస వెళ్తు సముద్రంలో చిక్కుకున్నారు 306 మంది ప్రయాణికులు. గల్లంతైన వారిలో 30 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

7. Senior IAS Y Srilakshmi కి బిగ్ రిలీఫ్.. OMC కేసులో అభియోగాలను కొట్టేసిన హైకోర్టు :

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ( Y Srilakshmi)కి ఊరట లభించింది. ఓఎంసీ కేసు నుంచి శ్రీలక్ష్మి (IAS Srilakshmi)కి విముక్తి లభించింది.. ఓఎంసీ కేసులో ఉన్న అభియోగాలను హైకోర్టు కొట్టేసింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారని ఆమెపై అభియోగాలు ఉన్నాయి. 2004-2009 మధ్య శ్రీలక్ష్మి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కి మైనింగ్ లీస్ విషయం లో శ్రీలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఏడాదిపాటు జైల్లో ఉన్న శ్రీలక్ష్మి.. న్యాయస్థానం లో పోరాటం చేస్తున్నారు. 2022 జనవరిలో హైకోర్టు లో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అభియోగాలు అవాస్తవం అని వాదనలు వినిపించారు. సరైన ఆధారాలు చూపలేక పోయిందని వాదించగా.. శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై తీర్పు ప్రకటించింది.

8. ప్రభాస్ ఫ్యాన్స్‏కు మరో షాక్.. ఆ సినిమా కూడా వాయిదా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఆదిపురుష్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా ఈ చిత్రాన్ని జూన్ 16న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో డార్లింగ్ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చారు.

ఇక ఇప్పుడు మరోసారి డార్లింగ్ అభిమానులకు షాక్ తగిలేలా ఉంది. ఇప్పుడు ఫ్యాన్స్‏ను మరో వార్త కలవరపెడుతుంది. ఆదిపురుష్ బాటలోనే సలార్ కూడా వాయిదా పడనున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ దాదాపు

9.విడాకుల బాటలో మరో ప్రముఖ జంట?..12 ఏళ్ల వివాహ బంధాన్ని గుడ్ బై చెప్పనున్నారని క్రీడాప్రపంచంలో టాక్ :

టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్ మాలిక్ సెలబ్రిటీ స్టార్ కపుల్. వీరి ప్రేమ దేశ సరిహద్దులు దాటి గెలిచింది. 2010లో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2018లో ఈ జంటకు ఓ మగబిడ్డ కూడా పుట్టాడు. అయితే ఇప్పుడు వీరి వైవాహిక జీవితం ప్రమాదంలో పడిందా? గతకొన్నాళ్లుగా సానియా, షోయబ్ వేర్వేరుగా ఉంటున్నారా ? 12 ఏళ్ల వైవాహిక బంధానికి త్వరలోనే డైవోర్స్‌ తో గుడ్ బై చెప్పనున్నారా ? ఇవే అంశాలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇండియన్‌ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్తాన్‌ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ ఈ రెండు పేర్లు 2010లో క్రీడాలోకంలో సంచలనం సృష్టించాయి. భారతీయ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్‌ పై మనసుపడి పెళ్ళి చేసుకోవడం అప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఇద్దరి పేర్లూ మరోసారి క్రీడాప్రపంచంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. విడిపోతోన్న సెలబ్రిటీల లిస్ట్‌లో ఇప్పుడు సానియా, మాలిక్‌లు చేరిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. అదే ఇప్పుడు అటు పాకిస్తాన్‌ క్రీడా ప్రపంచంలోనూ, ఇటు భారతీయ క్రీడాకారుల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి మధ్య గ్యాప్‌ ఒచ్చిందా? ఈ ఇద్దరి మధ్యా మనస్పర్థలు విడాకుల వరకూ వెళ్ళాయా? ఒకనాటి యువతరం కలల రాణి సానియా లైఫ్‌లో అసలేం జరుగుతోందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh