Congress తో పొత్తు ఎవరు అడిగారు రాహుల్

Congress తో పొత్తు ఎవరు అడిగారు రాహుల్

భారత్ జోడో యాత్రపై, టీఆర్ఎస్‌తో పొత్తు లేదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ చేయాల్సింది భారత్ జోడో యాత్ర కాదని, కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలని కేటీఆర్ సూచించారు. నేతలు ఇప్పటికే కాంగ్రెస్ చోడో అని పారిపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్యాకుమారి నుంచి మొదలుపెట్టిన రాహుల్ గాంధీ నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో ఎందుకు యాత్ర చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది, రాహుల్ గాంధీ ఇంకా భ్రమల్లోనే ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత జానారెడ్డిని మించిన వ్యక్తిని లేరని కేటీఆర్ అన్నారు. 7 పర్యాయాలు ఎన్నికల్లో నెగ్గిన జానారెడ్డిని టీఆర్ఎస్ యువ నేత నోముల భగత్ ఓడించారని టీ న్యూస్‌తో మాట్లాడుతూ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు నేతలు పార్టీని వీడుతున్నారని, మరోవైపు ఎన్నికల్లో ఓట్లు సంపాదించలేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కడుందో చెప్పాలని రాహుల్ ను ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీలు, ప్రచారం, హంగామా కోట్ల రూపాయలు ఖర్చు చేసినా చివరికి ఆ పార్టీ సాధించింది కేవలం 3 వేల ఓట్లు అని కేటీఆర్ గుర్తు చేశారు.

 

2. ఏపీలో ఆ జిల్లాల్లో దంచికొడుతున్న వానలు :

ఏపీలో నవంబర్ 4 వరకు భారీ వర్షాలు కురవనుండగా, తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయిని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం కదలిక వల్ల గాలులు మార్చుకుంటున్నాయి. చెన్నైలో వర్షాలు తగ్గి నేరుగా ఏపీలోని తిరుపతి జిల్లా సూళూరుపేట – గూడూరు వైపు, సత్యవేడు, నాయుడూపేట, గూడూరులలో భారీ వర్షాలు మొదలయ్యాయి. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తాయి. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 3 రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలపగా, వాతావరణ కేంద్రం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. 2015 లో నెల్లూరు జిల్లాలో 200 – 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈసారి అలాంటి వర్షాలున్నాయని జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు, తిరుపతి జిల్లా ప్రజలను హెచ్చరించారు.

3. ఆ ముగ్గురికి దేశాన్ని దోచి పెడుతున్నారు.

ప్రధాని మోదీపై సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. యావత్ దేశ సంపదను ఆ ముగ్గురికే దోచిపెడుతున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల సొమ్ము మోదీ స్నేహితుల జేబుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించారు రాహుల్. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కీలక ప్రసంగం చేశారు రాహుల్. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టారు. కేసీఆర్, నరేంద్ర మోదీ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. ఇక్కడ దొరల పాలన.. అక్కడ మతతత్వ శక్తుల దౌర్జన్యాలతో ప్రజల జీవనం అస్తవ్యస్థంగా మారిందన్నారు. సమైక్యవాద దేశాన్ని విభజిస్తున్న బీజేపీ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణలో దొర కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు రాహుల్.

4. ఇంటి తాళాలు స్వయంగా అందజేయనున్న ప్రధాని మోదీ :

అందరికీ సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే తాజాగా ఢిల్లీలో పేదల కోసం కొత్తగా నిర్మించిన 3,024 ఫ్లాట్స్‌ను పేదలకు అందిస్తున్నారు. బుధవారం సాయంత్రం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఫ్లాట్స్‌ను అందించనున్నారు. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఇన్‌-సీతు రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఫ్లాట్స్‌ను నిర్మించారు. అధునాతన సౌకర్యాలతో ప్రైవేటు కంపెనీలకు ధీటుగా ఈ ఫ్లాట్స్‌ను నిర్మించడం విశేషం.

మొదటి దశలో భాగంగా మొత్తం 3024 ఫ్లాట్ల నిర్మానం పూర్తయింది. ఈ ఫ్లాట్ల నిర్మాణానికి మొత్తం రూ. 345 కోట్ల ఖర్చు అయింది. ఫ్లోర్‌ టైల్స్‌, సెరామిక్‌ టైల్స్‌, వంట గదిలో ఉదయ్‌పూర్‌ గ్రీన్‌ మార్బల్స్‌ వంటి అధునాత సౌకర్యాలను అందించారు. అంతేకాకుండా ఫ్లాట్స్‌ చుట్టూ కమ్యూనిటీ పార్క్‌లు, ఎలక్ట్రిక్‌ సబ్‌ స్టేషన్స్‌, మురిగి నీటి శుద్ధి కేంద్రం, లిఫ్ట్స్‌, మంచినీటి సరఫరా వంటి అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు.

5. రాహుల్ జోడో యాత్రలో తోపులాట.. మాజీ మంత్రికి తీవ్రగాయాలు.

నగరంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర ఉత్సాహంగా సాగుతుంది. మార్నింగ్ గాంధీయన్‌ ఐడియాలజీ సెంటర్‌ నుంచి యాత్ర ప్రారంభమైంది. నాయకులు, కార్యకర్తలు, యువతీ యువకులు పెద్ద ఎత్తన రాహుల్‌తో పాదం కలుపుతున్నారు. జనంతో మమేకమవుతూ, వారి కష్టాలు వింటూ ముందుకు సాగుతున్నారు.

కూకట్‌పల్లిలోని ఓ కేఫ్‌‌లో టీ తాగారు. కరాటే విద్యార్ధులతో సరదాగా మాట్లాడారు. మదీనాగూడలో లంచ్ విరామం ఇచ్చారు. రాత్రికి ముత్తంగిలో రాహుల్‌గాంధీ బసచేయనున్నారు. కాగా రాహుల్‌ను కలిసేందుకు జనం పోటెత్తుతున్నారు. దీంతో తోపులాటలు కామన్ అయిపోయాయి. ఈ క్రమంలోనే పాదయాత్రలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి నితిన్ రౌత్‌కి గాయం అయ్యింది. రాహుల్‌తో కలిసి నడుస్తుండగా తోపులాట జరిగింది. కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొనిరావడంతో.. రౌత్ కంటికి తీవ్ర గాయం అయ్యింది. చేతులు, కాళ్లకు కూడా గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు.

6. సామ్‌ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన చైతూ !నాగచైతన్య, సమంత.

కాపురంలో కలతలు వచ్చాయి. కలిసి నడవలేం అని ఫిక్స్ అయ్యారు. దీంతో విడాకులు తీసుకున్నారు. అంతమాత్రాన వారి మధ్య ప్రెండ్షిప్ ఏం పోదు కదా..! ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. చాలాకాలం కలసి ట్రావెల్ చేశారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెల్సు కూడా. విడిపోతే మాత్రం.. ఏదైనా సమస్య వస్తే.. ఒకరికి మరొకరు తోడు నిలవకుండా ఉంటారా.. యస్.. అదే జరిగింది. సామ్ మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్నే ఆమే సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచంతో పంచుకుంది. ఈ క్రమంలో సామ్ ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే సామ్ ఇంత పెద్ద సమస్యలో ఉంటే ఆమె ఎక్స్ హస్బెండ్.. నాగ చైతన్య స్పందించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కర్టసీ కోసం అయినా ఒక ట్వీట్ వేస్తే బాగుండేదని చెబుతున్నారు.

అయితే జీవితం అంటే సోషల్ మీడియా కాదు. అక్కడ స్పందిస్తేనే.. పట్టించుకున్నట్లు కాదు. సామ్ హెల్త్ ఇష్యూ గురించి తెలిసిన వెంటనే నాగచైతన్య రెస్సాండ్ అయ్యారట. ఆమె అప్పుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి మరీ ధైర్యం నూరిపోశారట. అంతేకాదు.. ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయమని సూచించారట. రిలేషన్ వర్కువుట్ అవ్వలేదు అంతే. అంతమాత్రాన బద్ద శత్రువులు అయిపోరు కదా. ఏది ఏమైనా కష్టాల్లో ఉన్న సామ్‌కు చైయ్ ఓదార్పు.. నిజంగా చాలా బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి.

7. మొసలిని భయపెట్టి.. కుక్క చెప్పిన పాఠం.

మొసళ్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు అవి నీటిలోనూ నేల మీద కూడా ఉండగలవు. వాటి పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి. నోటితో ఒకసారి ఏదైనా జంతువుని పట్టాయి అంటే వదలవు. పైగా నేలపై ఉన్నా అవి ఎంతో వేగంగా కదలగలవు. అలాంటి మొసలికీ, ఓ కుక్క పిల్లకీ మధ్య జరిగిన ఎత్తుకు పై ఎత్తుకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొసలిని తక్కువ అంచనా వేసిన కుక్క పిల్ల ఎలా చిక్కుల్లో పడింది అన్నదే ఆ వీడియోలో ఆశ్చర్యకరమైన అంశం. ఆ ట్విస్ట్ నెటిజన్లను ఆలోచనలో పడేస్తోంది.

వీడియోలో ఓ ఇంటి పక్కనే ఉన్న చెరువు నుంచి తరచూ ఓ మొసలి ఒడ్డుకి వస్తోంది. దాన్ని చూసిన ఆ ఇంటి కుక్కపిల్ల.. ఓ రోజు దాని దగ్గరకు వెళ్లి అరిచింది. కుక్కపిల్లను చూసి కంగారుపడిన మొసలి నీటిలోకి వెళ్లిపోయింది. దాంతో ఆ ఇంటివారు సంబరపడ్డారు. తమ పప్పీ సూపర్ అని దాని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. మరో సందర్భంలో మొసలి అలాగే రాగే.. అప్పుడు కూడా పప్పీ దాన్ని తరిమేసింది. మొసలి వెళ్లిపోతున్నప్పుడు దాని తోకను కరిచేందుకు కుక్కపిల్ల ప్రయత్నించింది. అప్పుడు కూడా ఆ ఇంటి సభ్యులు పప్పీని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. మూడోసారి అదే విధంగా వచ్చిన మొసలి.. చాలా తెలివిగా ప్లాన్ చేసింది. ఈసారి మాత్రం పప్పీ ఆటలు దాని దగ్గర సాగలేదు. ఆ మొసలి ఏం చేసిందన్నది అందర్నీ ఆలోచనలో పడేస్తోంది.

 

8. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.

టీ20 ప్రపంచకప్‌లో అతిథ్య దేశానికి భారీ షాక్ తగలనుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదే నిజమైన ఆఫ్గానిస్తాన్‌తో కీలక మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైన ఆ జట్టుకు.. గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లే. ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ గాయం కారణంగా ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి, విజయంతో కీలకపాత్ర పోషించాడు.

అయితే ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌ అఖరిలో ఫించ్‌ తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ బాధను భరిస్తూనే ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అనంతరం సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఫించ్‌ ఫీల్డ్‌లోకి వచ్చినా.. బాధ మరింత ఎక్కువ కావడంతో 6వ ఓవర్‌లో బయటకు వచ్చేశాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న ఫించ్‌.. 5 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 63 పరుగులు సాధించాడు.అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా ఈ టోర్నీకి వైస్ కెప్టెన్‌గా ఎవరిని ఎంచుకోకపోవడంతో.. ఫించ్ స్థానంలో కీపర్ మాథ్యూ వేడ్ తాత్కాలిక సారథ్య బాధ్యతలు స్వీకరించాడు.

ఇక తన గాయానికి సంబంధించిన అప్‌డేట్‌ను మ్యాచ్‌ అనంతరం ఫించ్‌ వెల్లడించాడు. ప్రస్తుతం చాలా నొప్పిగా ఉందని.. స్కాన్‌ రిపోర్ట్స్‌ బట్టి విశ్రాంతి తీసుకోవాలా వద్ద అన్నది ఆలోచిస్తానని ఫించ్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 42 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. ఇక నవంబర్‌ 4న ఆడిలైడ్‌ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది.

9. టీమిండియా పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా.

టీమ్ ఇండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో బిజీగా ఉంది. ఈలోగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి కోరినట్లు భారత శిబిరం నుంచి వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ తర్వాత 3 టీ20ఐ, 3 వన్డేల సిరీస్ కోసం టీమ్ ఇండియా న్యూజిలాండ్‌కు బయలుదేరుతుంది. ఈ పర్యటనలో రోహిత్, కోహ్లీ కనిపించరని వార్తలు వచ్చాయి.

మీడియా కథనాల ప్రకారం, న్యూజిలాండ్ టూర్‌లో ఇద్దరికీ విశ్రాంతి ఇస్తే, హార్దిక్ పాండ్యా లేదా కేఎల్ రాహుల్ కెప్టెన్సీని పొందవచ్చని భావిస్తున్నారు.నవంబర్ 18 నుంచి న్యూజిలాండ్‌లో భారత పర్యటన ప్రారంభం కానుంది. తొలుత 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ ఆడనుంది.రోహిత్, కోహ్లి గురించి మాట్లాడితే, గత కొంతకాలంగా వీరిద్దరు నిరంతరాయంగా ఆడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రోహిత్ దాదాపు 26 అంతర్జాతీయ టీ20లు, 6 వన్డేలు ఆడాడు. దీంతో పాటు ఐపీఎల్ కూడా ఆడాడు. రోహిత్ విరామం లేకుండా నిరంతరం ఆడుతున్నాడు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh