Balakrishna వంద కోట్ల బడ్జెట్ తో బాలయ్య పాన్ ఇండియాపై దండయాత్ర.

Balakrishna వంద కోట్ల బడ్జెట్ తో బాలయ్య పాన్ ఇండియాపై దండయాత్ర.

బడా బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా చెలామణీ అవుతున్నారు నటిసింహా నందమూరి బాలకృష్ణ. ఇలా దాదాపు నలభై ఏళ్లుగా టాలీవుడ్‌లో తన మార్కును చూపిస్తూ దూసుకెళ్తోన్న ఆయన.. ఇప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ఇక, ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న బాలయ్య.. ఇప్పటికే రెండు సినిమాలను ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్‌తో సినిమాను చేయబోతున్నారు.2021లో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా భారీ అంచనాలతో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.

దీంతో బాలయ్య మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. అంతేకాదు, ఈ చిత్రంతో కలెక్షన్ల పరంగానూ ఈ నందమూరి హీరో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి హవాను చూపించారు.నటసింహా బాలకృష్ణ ‘అఖండ’ తర్వాత మరింత ఉత్సాహంతో దూసుకెళ్తోన్నారు. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్నారు. ఇందులో ‘క్రాక్’ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమా చేస్తున్నారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది.

ఇప్పటికే చేతిలో రెండు సినిమాలను పెట్టుకున్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే మరో భారీ సినిమాలో నటించబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన మరింత సమాచారం లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. బాలయ్య.. వందకోట్ల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో భారీ ప్రాజెక్టును చేయబోతున్నారట.

తమ బ్యానర్‌లో ‘గీత గోవిందం’ వంటి వంద కోట్ల రూపాయల సినిమాను తెరకెక్కించిన పరశురాంతో అల్లు అరవింద్ మరో క్రేజీ ప్రాజెక్టును చేయబోతున్నారు. అందులోనే బాలయ్య హీరోగా నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ఫంక్షన్‌లో పరోక్షంగా వెల్లడించారు. ఇక, దీన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని టాక్ .

పరశురాం – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో అల్లు అరవింద్ నిర్మించబోయే సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతలా అన్ని వర్గాల వాళ్లకు చేరువయ్యేలా దీన్ని యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందించబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ కూడా చాలా వరకూ పూర్తైనట్లు తెలిసింది.

పవన్ ను నమ్మించి ముంచేసిన హరిష్ శంకర్..!

వాట్ “భవదీయుడు భగత్ సింగ్” సినిమా నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకున్నాడా ..? ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ యాడ్ అయ్యారా..? ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ..మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. కాగా కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ పై హత్యకుట్ర జరుగుతుందని ..అందుకే ఆయనకు భారీ భద్రతను ఏర్పాటు చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ తాను నటించబోయే సినిమాలు అన్నిటికీ బ్రేక్ వేసినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న హరీష్ శంకర్ తన కోసం రాసుకున్న భవదీయుడు భగత్ సింగ్ స్టోరీ ను ఇప్పుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో తీయ్యడానికి డిసైడ్ అయ్యారట . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

నిజానికి పవన్ కళ్యాణ్ – హరిశంకర్ కాంబో పై బోలెడన్ని ఆశలు పెట్టుకుని ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.అయితే పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్ పరంగా బిజీగా ఉండడంతో హరీశంకర్ ని అవాయిడ్ చేశారు . ఈ క్రమంలోనే హరిశంకర్ ఇప్పటివరకు వేరే ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. ఇలా పవన్ నమ్ముకుంటే ఇక లాభం లేదనుకున్న హరీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ గారి సహాయంతో సల్మాన్ ఖాన్ కు ఈ స్టోరీని వివరించారట . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చేయడానికి సల్లు భాయ్ ఒప్పుకున్నారట .

వన్స్ పవన్ ఈ సినిమా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే ఇక సల్మాన్ ఖాన్ తో ఈ సినిమాను తెరకెక్కించే విధంగా రెడీ అయ్యారట హరీష్ శంకర్ .ఏది ఏమైనా సరే ఈ న్యూస్ పవన అభిమానులు తీవ్రంగా బాధపడుతుంది. ఓవైపు పవన్ కళ్యాణ్ ప్రాణానికి హాని ఉందన్న న్యూస్ ..మరోవైపు ఆయనతో కమిట్ అయిన సినిమాలు అన్ని వేరే హీరోలకి వెళ్ళిపోతున్న బాధ ..పవన అభిమానుల్లో విపరీతంగా పెరిగిపోతుంది ..!!

ఒక్క సినిమాతో ఆ లిస్ట్ లో చేరిపోయిన రిషబ్.

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్యాన్ ఇండియా లెవల్‌కు పెంచిన దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి. అంతకు ముందు ఒకరిద్దరు దక్షిణాది దర్శకులు ఇలాంటి ప్రయత్నం చేసిన పూర్తి సక్సెస్ అయిన దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి. బాహుబలితో ప్రభాస్‌ను ప్యాన్ ఇండియా స్టార్‌గా చేసిన జక్కన్న.. ఈ యేడాది RRR మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ప్యాన్ ఇండియా హీరో అనే ఇమేజ్‌ను తీసుకొచ్చారు. ఆ తర్వాత కార్తికేయ 2తో నిఖిల్ సిద్ధార్ధ్.. తాజాగా కాంతారా మూవీతో రిషబ్ శెట్టి ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో హిందీతో పాటు మిగతా దక్షిణాది ప్రేక్షకులను పలకరించారు. అంతకు ముందు రామ్ చరణ్.. జంజీర్ మూవీ రీమేక్‌తో పలకరించినా..

ఆ సినిమాతో విమర్శల పాలయ్యారు. అపుడు తిట్టిన నోళ్లతోనే ఇపుడు పొగడ్తలను వింటున్నాడు. ఈ సినిమాతో వీళ్లిద్దరు ప్యాన్ ఇండియా స్టార్స్‌ అయిపోయారు.నిఖిల్ సిద్ధార్ధ్ | అటు కార్తికేయ 2 మూవీతో నిఖిల్ బాలీవుడ్‌లో సత్తా చాటాడు. ఈ సినిమా మౌత్ పబ్లిసిటీతో హిందీలో కూడా సత్తా చాటింది ఈ సినిమా ఇప్పటి వరకు హిందీలో మంచి వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా రూ. 100 కోట్ల గ్రాస్‌కు పైగా కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మొత్తంగా కార్తికేయ 2తో నిఖిల్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.రిషబ్ శెట్టి | కాంతారా మూవీతో రిషబ్ శెట్టి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించించి ఔరా అనిపించింది. ఈ సినిమాతో రిషబ్ శెట్టి ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.దర్శకుల విషయానికొస్తే.. రాజమౌళి పూర్తి స్థాయిలో ప్యాన్ ఇండియా దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించారు. బాహుబలితో వచ్చిన ఇమేజ్‌ను ఈ యేడాది ఆర్ఆర్ఆర్‌తో కంటిన్యూ చేసి బాక్సాఫీస్ దగ్గర తన మాయ ఏంటో చూపించారు.దర్శకుడు శంకర్‌కు కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈయన సినిమాలు ఒకప్పుడు తెలుగులోనూ అద్భుతమైన విజయం సాధించాయి.

ఇంకా చెప్పాలంటే బాయ్స్, అపరిచితుడు లాంటి సినిమాలు తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయం అందుకున్నాయి. దానికి ముందు ఒకే ఒక్కడు, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, జెంటిల్‌మెన్ లాంటి సినిమాలు కూడా సంచలన విజయం సాధించాయి. రాజమౌళి కంటే ముందు ఈయన ప్యాన్ ఇండియా దర్శకుడిగా నార్త్‌లో సత్తా చాటాడు.

అటు రజినీకాంత్‌తో తెరకెక్కించిన ‘రోబో’ , 2.O’ చిత్రాలు దర్శకుడిగా శంకర్ సత్తా ఏంటో చూపించాయి. అటు మణిరత్నం కూడా ప్యాన్ ఇండియా లెవల్లో రోజా వంటి కొన్ని చిత్రాలతో అలరించారు. ప్రభాస్.. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో ఆల్ ఇండియా అదేనండి ప్యాన్ ఇండియా లెవల్లో అలరించారు. ఆ తర్వాత సాహో మూవీతో హిందీ రీజియన్‌లో మంచి వసూళ్లతో అదరగొట్టారు. ఈ ఇయర్ ‘రాధే శ్యామ్’ మూవీ అన్ని భాషలకు చెందిన ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది.

రానా దగ్గుబాటి బాహుబలి కంటే ముందు పలు హిందీ చిత్రాలతో అక్కడి ప్రేక్షుకులకు చేరువయ్యారు. ఇటు తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో నటిస్తూ ప్యాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.కేజీఎఫ్ అనే ఒక్క సినిమా ఒక్క సినిమాతో కెరీర్ పూర్తిగా మారిపోవడానికి. అదే యశ్ విషయంలో జరిగింది. మూడేళ్ల కింది వరకు ఈయన కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో. రాఖీ భాయ్ గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో..? కెజియఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో ఈయన రేంజ్ మారిపోయింది.

పాన్ ఇండియన్ రేంజ్‌లో తన మార్కెట్ పెంచుకున్నాడు యశ్. తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ వచ్చింది. ఈ యేడాది కేజీఎఫ్ 2 మూవీతో ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. మొత్తంగా ప్రభాస్ తర్వాత రెండో ప్యాన్ ఇండియా స్టార్‌గా యశ్ పేరును ప్రస్తావించవచ్చు.అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘పుష్ప’ (Puspa) మూవీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. 2021లో రూ. 350పైగా కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

తాజాగా అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 15 మిలియన్ ఫాలోయర్స్ ఉన్న దక్షిణాది నటుడిగా రికార్డు క్రియేట్ చేసారు. ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 167 కోట్ల షేర్‌తో పాటు రూ. 320 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి 2021లో మన దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.అటు ఎపుడో రజినీకాాంత్, కమల్ హాసన్ వంటి హీరోలు తమిళంతో పాటు తెలుగు, హిందీలో నటించి ప్యాన్ ఇండియా స్టార్స్‌గా సత్తా చాటారు. తొలి ప్యాన్ ఇండియా స్టార్స్ అని కమల్ హాసన్, రజినీకాంత్ లనే చెప్పుకోవాలి.

సినిమాల్లోకి అల్లు అర్జున్ భార్య!

అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ రోల్ పోషిస్తుందనేది మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ సంగతులను అభిమానుల ముందుకు తీసుకొస్తుంటుంది స్నేహా రెడ్డి. ముఖ్యంగా ఫ్యామిలీ టూర్స్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది.అలా అలా స్నేహా రెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

అప్పుడప్పుడు మోడ్రన్ దుస్తుల్లో స్టైలిష్ గా ఫోటో షూట్స్ చేసి సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటుంది స్నేహారెడ్డి. దీంతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమెకు నెట్టింట డిమాండ్ చేకూరింది.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అంటూ ఓ వార్త బయటకు రావడం హాట్ టాపిక్ అయింది. నెట్టింట వైరల్ గా మారిన ఈ వార్త సారాంశం చూస్తే.. బన్నీ సతీమణి అయిన స్నేహారెడ్డి త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందని చెబుతున్నారు.అంతేకాదు ఓ స్టార్ హీరో సినిమాతో స్నేహా రెడ్డి తెరంగేట్రం చేస్తోందని.. ఇందుకోసం అల్లు టీమ్ పక్కాగా ప్లాన్ చేసిందనే వార్తలు తెగ షికారు చేస్తున్నాయి.

ఇందులో నిజానిజాలపై క్లారిటీ లేకపోవడంతో.. హీరోయిన్లను మించిన అందంతో ఇన్‌స్టాలో ఆమె షేర్ చేస్తున్న ఫొటోలే ఈ వార్తలు పుట్టడానికి కారణం అని కొందరు అభిప్రాయపడుతున్నారు.మలయాళ సినిమాతో అల్లు స్నేహారెడ్డి సినీ ఎంట్రీ ఉండబోతోందనే టాక్ అయితే వినిపిస్తోంది. అక్కడ బన్నీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన సతీమణి స్నేహ రెడ్డికి అవకాశం ఇచ్చారని చెబుతున్నారు. సో.. చూడాలి మరి ఇలాంటి వార్తలపై అల్లు టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందనేది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh