Junior NTR ఎన్టీఆర్ మూవీ కోసం…రంగంలోకి దిగిన ఇద్దరు స్టార్లు

Junior NTR ఎన్టీఆర్ మూవీ కోసం…రంగంలోకి దిగిన ఇద్దరు స్టార్లు

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. హీరోగా పరిచయమైన కొత్తలోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతోన్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌తో కనిపిస్తోన్న తారక్..

కొద్ది రోజుల క్రితమే RRR (రౌద్రం రణం రుధిరం) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకోవడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులను లైన్‌లోకి తీసుకు వస్తున్నాడు.జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. దీంతో ఈ సినిమాపై అనుమానాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు. కానీ, ఆ తర్వాత కూడా ఈ సినిమా ప్రారంభంపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఇది మరింత ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఢీలా పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.చిత్ర యూనిట్ ద్వారా అందిన సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కే సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను వేగవంతం చేశారట.

అంతేకాదు, ఈ మూవీ కోసం టాప్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఫేమస్ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ పని చేస్తున్నారని తెలిసింది. వీళ్లంతా కలిసి ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న పట్టుదలతో కష్టపడుతున్నారట. ఇక, ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను కంప్లీట్ చేసిన వెంటనే.. అంటే మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీని పట్టాలెక్కించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

ఆ స్టార్ డైరెక్టర్ శిష్యుడితో… శంకర్ సినిమా తరువాత రాంచరణ్ మరో పాన్ ఇండియా సినిమా ప్లాన్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సక్సెస్ అనంతరం పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత అదే తరహాలో మరో మంచి విజయం అందుకోవాలని రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాడు. మధ్యలో ఆచార్యతో డిజాస్టర్ వచ్చినప్పటికీ కూడా చరణ్ క్రేజ్ అయితే తగ్గలేదు. ఇక ఇటీవల రామ్ చరణ్ తేజ్ ఒక స్టార్ డైరెక్టర్ శిష్యుడు చెప్పిన కథ గురించి చర్చలు జరిపినట్లు సమాచారం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తదుపరి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. మంచి సందేశాత్మక కథలతో యాక్షన్ సినిమాలను తెరపైకి తీసుకువచ్చే దర్శకుడు శంకర్ మొదటిసారి రాంచరణ్ తో చేస్తున్న సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ ప్రాజెక్టు షూటింగ్ కూడా ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. 2023 సమ్మర్ చివరలో RC 15 ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక రామ్ చరణ్ – గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు.

జెర్సీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత అదే కథను హిందీలో రీమేక్ చేసి సక్సెస్ అవ్వాలని అనుకున్నాడు. కానీ అక్కడ అది డిజాస్టర్ అయ్యింది. ఇక అంతకుముందే గౌతమ్ – రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలి అని అనుకున్నప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు ఆ దర్శకుడు విజయ్ దేవరకొండ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇక రామ్ చరణ్ తేజ్ లిస్టులో అయితే అగ్ర దర్శకుల సంఖ్య గట్టిగానే ఉంది. సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. కానీ సుకుమార్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు రెండు ఉన్నాయి.

ముందుగా అయితే పుష్ప సెకండ్ పార్ట్ ని ఫినిష్ చేసి ఆ తర్వాత విజయ్ దేవరకొండ చేయాలని అనుకుంటున్నాడు. ఆ తర్వాత రాంచరణ్ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.అయితే రీసెంట్ గా రామ్ చరణ్ తేజ్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుతో కూడా ఒక కథ గురించి చర్చలు జరిపినట్లు సమాచారం. రంగస్థలం సినిమా స్క్రిప్ట్ విషయంలో బుచ్చిబాబు పాత్ర కూడా ఎంతో ఉంది.

ఇక ఈ దర్శకుడు ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవడంతో ఎన్టీఆర్ తో కూడా చర్చలు జరుపుతున్నాడు. అయితే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆలస్యం నయ్యే అవకాశం ఉంది కాబట్టి రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

బాలయ్య బన్‌గయా బ్రాండ్ అంబాసిడర్..

చూడు ఒకవైపే చూడు.. రెండోవైపు చూడకు అంటూ సింహా సినిమాలోని డైలాగులో చెప్పినట్టు.. ఇన్నేళ్లు బాలయ్య అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ బాలకృష్ణలోని ఒక యాంగిల్‌ని మాత్రమే చూపారు. ఇక అన్‌స్టాపబుల్ షోతో ఈయనలోని రెండో యాంగిల్‌ ఏంటో తెలిసొచ్చింది. తాజాగా ఇప్పటి వరకు ఏ కమర్షియల్ యాడ్ చేయని ఈయన ఇపుడు 60 యేళ్ల పై బడిన వయసులో చేయడం విశేషమనే చెప్పాలి.

అవును బాలయ్య కూడా ఇపుడు ట్రెండ్‌కు తగ్గట్టు తనను తాను ఫుల్లుగా అప్‌డేట్ చేసుకుంటున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఓటీటీ వేదికగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేసాడు. తాజాగా ఇపుడు కమర్షియల్ యాడ్స్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి అదుర్స్ అనిపిస్తున్నారు. సాధారణంగా 60 యేళ్లు దాటిన వాళ్లు రిటైర్మెంట్‌ తర్వాత కృష్ణ, రామ అంటూ ఏదో ఇంటికే పరిమితమవుతారు. కానీ బాలయ్య మాత్రం 62 యేళ్ల వయసులో బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తాడు. బహుశా ప్రపంచ సినీ చరిత్రలో ఏ హీరో కూడా 60 యేళ్లు పై పడిన వయసులో కమర్షియల్ యాడ్‌లో నటించలేదనే చెప్పాలి.

ఇది ఒక రకంగా రికార్డు అనే చెప్పాలి. అది బాలయ్యకు మాత్రమే సొంతం అని చెప్పాలేమో.తాజాగా బాలయ్య ఫస్ట్ కమర్షియల్ యాడ్‌కు సంబంధించిన ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.మొత్తంగా సినిమాల్లో ఓటీటీల్లో సత్తా చూపెట్టిన బాలయ్య.. ఇపుడు కమర్షియల్ యాడ్‌లో ఎలా మెప్పిస్తాడనేది చూడాలి. ఏది ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎన్నడు ఏ కమర్షియల్ యాడ్ చేయని బాలయ్య ఇపుడు బ్రాండింగ్‌లో దిగడం నిజంగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అనే చెప్పాలి.ప్పటికే బాలయ్య వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్‌స్టాపబుల్ టాక్‌షోకు ఒకే చెప్పిన ఈయన తాజాగా ట్రెండ్‌కు తగ్గట్టు కమర్షియల్ యాడ్‌లో యాక్ట్ చేయడానికీ ఓకే చెప్పారు. సాయి ప్రియ కన‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన 116 Praramount కు ఈయన ప్రకటన చేసారు.

బాలకృష్ణ తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కమర్షియల్ యాడ్స్ చేసినా.. బాలయ్య మాత్రం ఇప్పటి వరకు ఒక్క ప్రకటనలో నటించలేదు. ఇపుడు ఆ పని చేసారు. అవును బాలయ్య ప్రస్తుతం ఫుల్ అప్‌డేట్ అవుతున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు కొన్ని కోట్లు ఇస్తామన్నా కమర్షియల్ యాడ్స్ చేయని నందమూరి హీరో.. ఇపుడు ఓ కమర్షియల్ యాడ్ చేసారు.సాయి ప్రియ రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన యాడ్‌ చేసారు.

ఒళ్లు గగుర్పొడిచేలా నరమాంస భక్షకులతో ..మహేష్ ఫైట్.

అదేంటో రీసెంట్ డేస్లో తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్‌ లోనే తెరకెక్కతున్నాయి. త్రూ అవుట్ ఇండియా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాయి. ఇక జక్కన్న క్రియేట్ చేసిన ఇదే పాత్ లో ఇప్పటికే చాలా మంది స్టార్ అండ్ నాన్ స్టార్ డైరెక్టర్స్ నడిచారు.. నడుస్తూనే ఉన్నారు. అయితే వీరందరికి కాస్త దూరంగా…

ఈ సారి కాస్త ఢిఫరెంట్గా తన నెక్ట్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారు మన జక్కన్న. ఎస్ ! మహేష్ బాబుతో తను చేయబోయే సినిమాను లార్జెన్ దెన్ లైఫ్‌లా… హెవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఎపిసోడ్‌లతో స్టఫ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మన జక్కన్న. అందులో భాగంగానే.. ఆఫ్రికా మ్యానీటర్స్‌ను తన సినిమాలో విలన్స్‌ గా చూపించబోతున్నారట.

మరోవైపు సినిమా కాన్సెప్ట్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఇదొక అడ్వెంచర్ యాక్షన్ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించే యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని స్పష్టం చేశారు జక్కన్న. అంతే కాకుండా ఈ మూవీలోని కీలక యాక్షన్ ఘట్టాల్లో ఒక దాన్ని జపాన్ లో చిత్రీకరించాలనుకుంటున్నానని స్పష్టం చేయడం విశేషం.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh