NTR బాలీవుడ్‌ నుంచి కష్టమే.. సౌత్‌కే ఫిక్సయ్యారా?

NTR బాలీవుడ్‌ నుంచి కష్టమే.. సౌత్‌కే ఫిక్సయ్యారా?

కొరటాల శివ కాంబినేషన్‌‌లో తెరకెక్కాల్సిన ‘NTR30’పై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా ఎన్ని రూమర్స్.. వార్తలుగా వైరల్ అయ్యాయో.. అవుతున్నాయో తెలియంది కాదు. సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే విషయంలోనూ, హీరోయిన్ విషయంలోనూ ఇంకా రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. చిత్రబృందం మాత్రం ఆ రూమర్స్‌కు బ్రేక్ వేయడం లేదు..

అప్‌డేట్ వదలడం లేదు. ఇప్పుడు హీరోయిన్ విషయంలో మరో వార్త.. సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఇప్పటి వరకు ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో బాలీవుడ్ భామ కోసం ప్రయత్నాలు చేసిన మేకర్స్.. ఇప్పుడు నిర్ణయం మార్చుకుని, సౌత్ హీరోయిన్‌కే ఫిక్స్ అయినట్లుగా టాక్ నడుస్తోంది. బాలీవుడ్‌లోని ఏ భామా.. ఈ సినిమాలో చేసేందుకు ముందుకు రావడంలేదో.. లేదంటే వారికి భారీ పారితోషికం సమర్పించుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ..

హీరోయిన్‌గా అయితే సౌత్ భామని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.ముందుగా ఈ సినిమాలో ఆలియా భట్ అనుకున్నారు. ఆమె కూడా ఈ సినిమాలో చేస్తున్నట్లుగా కన్ఫర్మ్ కూడా చేసింది. కానీ, ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కావడంతో.. ఈ సినిమా నుంచి ఆలియా తప్పుకుంది. ఆమె, ఎప్పుడైతే సైడ్ అయిందో..

హీరోయిన్‌గా అనేకానేక పేర్లు వినిపించాయి. కానీ ఏ ఒక్కరూ ఫైనల్ కాలేదు. చివరికి ఇటీవల ‘సీతా రామం’ చిత్రంతో అందరి మనసులు దోచేసిన మృణాల్ ఠాకూర్‌ పేరు కూడా వినిపించింది. ఇప్పుడు మాత్రం సౌత్ భామ, ‘మహానటి’ కీర్తి సురేష్ పేరు వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, ముఖ్యంగా నటనకు ఆస్కారమున్న పాత్ర కావడంతో.. అందుకు కీర్తి సురేష్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని.. మేకర్స్ భావిస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. అయితే, మేకర్స్ మాత్రం ఈ విషయం కన్ఫర్మ్ చేయలేదు.

ఈ విషయమే కాదు.. అసలే విషయం కూడా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన గ్లింప్స్ అలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది మరి.

 

బాబీ తో బాలయ్య కొత్త సినిమా …. దబిడి దిబిడే.

నందమూరి బాలకృష్ణ `అఖండ` సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య రవితేజతో `క్రాక్` లాంటి ఊర మాస్ హిట్ సినిమా తెరకెక్కించిన మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `అఖండ` బాలయ్య కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఉత్సాహంతో బాలయ్య వరుసగా క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్‌తో పాటు.. కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న‌ ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత బాలయ్య 108వ ప్రాజెక్ట్ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుంది. సాహు గార‌పాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌ను లైన్లో పెడుతూ దూసుకుపోతున్న బాలయ్య అనిల్ రావిపూడి సినిమా తర్వాత కూడా రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది.

పూరి జగన్నాథ్ బాలయ్య కోసం అదిరిపోయే కథ రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తండ్రీ, కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ గా ఈ సినిమా కథ ఉంటుందని అంటున్నారు.అలాగే బోయపాటితో మరో సినిమా చేసే ప్లానింగ్ లో కూడా బాలయ్య ఉన్నాడు. ఈ క్రమంలోనే మరో దర్శకుడు పేరు కూడా బాలయ్య లైన్లో వినిపిస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు కెఎస్ రవీంద్ర ( బాబి). ఎన్టీఆర్ తో `జై లవకుశ` లాంటి హిట్ సినిమా తెరకెక్కించిన బాబి మాస్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం బాబి మెగాస్టార్ చిరంజీవితో `వాల్తేరు వీరయ్య` సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఈ సినిమా పూర్తైన‌ వెంటనే బాబి.. బాలయ్యతో తెరకెక్కించే సినిమా కథపై కసరత్తులు చేస్తాడని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో బాలయ్య ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు బాబి చేసే సినిమా ఆ బ్యానర్ లోనే రూపొందుతుందని తెలుస్తోంది. ఇక బాబీ సైతం కథ మెయిన్ లైను బాలయ్యకు చెప్పాడని.. పూర్తి కథ డెవలప్ చేసి త్వరలోనే వినిపిస్తాడని తెలుస్తోంది. ఏదేమైనా బాబి లాంటి మాస్ డైరెక్టర్ బాలయ్య కాంబోలో సినిమా అనగానే సహజంగానే అంచనాలు ఉన్నాయి.

ప్రభుదేవ డైరక్షన్ లో చిరు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సినిమాల మీద ఫుల్ ఫోకస్ గా ఉన్నారు.గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉండగా మరోపక్క వాల్తేర్ వీరయ్య.భోళాశంకర్ సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి.ఈ సినిమాలతో పాటుగా వెంకీ కుడుముల డైరక్షన్ లో సినిమాని లైన్ లో పెట్టారు

చిరంజీవి.ఇక ఇదిలాఉంటే మెగాస్టార్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.చిరు హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ డైరక్షన్ లో సినిమా రాబోతుందని టాక్.అది కూడా ఓ సూపర్ హిట్ మూవీ రీమేక్ అని టాక్.నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన స్పానిష్ థ్రిల్లర్ మూవీ ని చిరు రీమేక్ చేస్తే బాగుంటుందని ప్రభుదేవ చెప్పారట.ఓ రెటైర్ డాన్ కథతో ఈ మూవీ నడుస్తుంది.

సినిమా కథ చిరుకి నచ్చడంతో ప్రభుదేవ డైరక్షన్ లో అతను సినిమా చేసేందుకు ఓకే చెప్పారట.ఇదివరకు ఆల్రెడీ ప్రభుదేవ చిరుతో శంకర్ దాదా జిందాబాద్ సినిమా చేశారు.ఆ సినిమా తర్వాత ఇన్నాళ్లకు ఈ ఇద్దరు కలిసి సినిమా చేయనున్నారు.మరి ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకు రానున్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh