JR NTR సినిమా అప్డేట్-నవంబర్‌లో లాంఛింగ్, డిసెంబర్‌లో షూటింగ్.

JR NTR సినిమా అప్డేట్ – నవంబర్‌లో లాంఛింగ్, డిసెంబర్‌లో షూటింగ్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తరువాత ఇప్పటివరకు మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారు. ముందుగా కొరటాల శివ సినిమాను మొదలుపెట్టాల్సివుంది. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ తన లుక్ ని మార్చుకున్నారు.చాలా వరకు బరువు తగ్గారు ఎన్టీఆర్.

ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ కుమార్ గైడన్స్ లో ట్రైనింగ్ తీసుకొని ఫిట్ గా తయారయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బరువు 75 కేజీలు. ఇప్పుడు ఆయన కొరటాల శివ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి కొరటాల స్క్రిప్ట్ లాక్ చేస్తే షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే.. నవంబర్ రెండో వారంలో సినిమాను ఫార్మల్ గా లాంచ్ చేసి.

 

డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట. రాబోయే రోజుల్లో దీనిపై అధికార ప్రకటన రానుంది. ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’తో డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ కారణంగానే సినిమా ఆలస్యమవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. బాలీవుడ్ అమ్మాయిని తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ కి పనికొస్తుందని ఆలోచిస్తున్నారు. స్టార్ హీరోయిన్లతో పాటు మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లను కూడా పరిశీలిస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి..!

ఈ సినిమాలో పవర్ ఫుల్ మహిళ క్యారెక్టర్ ఒకటి ఉందట. దానికోసం ఒకప్పటి హీరోయిన్, టాలీవుడ్ తొలి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanthi)ని సంప్రదించినట్లు సమాచారం. ఆమెని కలిసి కొరటాల కథ వినిపించారట. అయితే దీనికి ఆమె ఒప్పుకుందా..? లేదా..?

అనే విషయంలో క్లారిటీ రాలేదు.చాలా ఏళ్లుగా విజయశాంతి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో తన పాత్ర నచ్చడం వలనే సినిమా చేశానని.. ఇకపై అలాంటి రోల్ వస్తుందనే నమ్మకం లేదని చెప్పారు. మరి ఆ రేంజ్ లో కొరటాల శివ.. విజయశాంతి కోసం క్యారెక్టర్ రాస్తే మాత్రం ఆమె నటించే అవకాశాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.మరోపక్క ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు సానా ఎదురుచూస్తున్నారు. మరి ఆయనతో సినిమా ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి!

RRR చిత్రానికి ప్రతిష్టాత్మక అవార్డ్.

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ”ఆర్.ఆర్.ఆర్” సినిమా గ్లోబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ వంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ.. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికీ ఏదొక విధంగా అద్భుతాలు చేస్తూనే ఉంది.RRR (రైజ్ – రోర్ – రివోల్ట్) సినిమా తాజాగా సాటర్న్ అవార్డును అందుకుంది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో అవార్డు లభించినట్లు జ్యూరీ అధికారికంగా ప్రకటించింది.

ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సాటర్న్.. ఈసారి ట్రిపుల్ ఆర్ ను బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీగా ఎంపిక చేసింది. ప్రతిష్టాత్మక అమెరికా అవార్డ్స్ లో తన చిత్రాన్ని విజేతగా ఎంపిక చేసినందుకు జ్యూరీకి రాజమౌళి కృతజ్ఞతలు తెలియజేసారు.ఆర్.ఆర్.ఆర్’ సినిమా ఈ అవార్డును గెలుచుకున్నందుకు చాలా ఉప్పొంగిపోతున్నానని..

ఇది తనకు రెండో సాటర్న్ అవార్డు అని జక్కన్న పేర్కొన్నాడు. ఈ సందర్భంగా RRR టీమ్ తరపున ఇతర విజేతలను కూడా అభినందించారు. రాజమౌళి గతంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన ‘బాహుబలి: ది కన్క్లూజన్’ సినిమాకు గాను మొదటి సాటర్న్ అవార్డును అందుకున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తర్వాత ఇటీవల జపాన్ దేశంలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అక్కడ కూడా ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.

మూవీ ప్రమోషన్స్ కోసం RRR త్రయం రాజమౌళి – జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ప్రస్తుతం తమ ఫ్యామిలీలతో కలిసి జపాన్ లో ఉన్నారు.గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు దక్కిన తర్వాత RRR సినిమా కచ్చితంగా ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం మన దేశం తరపున అకాడమీ అవార్డ్స్ పరిశీలనకు అఫిషియల్ ఎంట్రీగా ఈ చిత్రాన్ని ఎంపిక చేయలేదు. అయినప్పటికీ రాజమౌళి అండ్ టీమ్ ఆస్కార్ ప్రయత్నాలు వదిలిపెట్టలేదు.

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని ఫర్ యువర్ కన్సిడరేషన్ (FYC) కింద ఆస్కార్ జ్యూరీ పరిశీలనకు పంపించారు. మొత్తం పదిహేను క్యాటగిరీలలో నామినేషన్స్ కోసం క్యాంపెయిన్ స్టార్ట్ చేసారు. మరి ఈ సినిమా ఫైనల్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంటుందో లేదో చూడాలి.కాగా 1920స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన RRR చిత్రంలో రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అజయ్ దేవగన్ – శ్రియా శరన్ – అలియా భట్ – ఒలివియా మోరీస్ కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

జపాన్ లోని తన అతిపెద్ద అభిమానిని కలిసిన రాంచరణ్.

జపాన్ లో మన దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కు అశేష అభిమానులున్నారు. రజినీ నటించిన ‘నరసింహా’ నుంచి చంద్రముఖి వరకూ సినిమాలన్నీ అక్కడ బాగా ఆడుతున్నాయి. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి అభిమానులు మన రాంచరణ్ కు ఉన్నారని తెలుస్తోంది. జపాన్ లో రాంచరణ్ కు డైహార్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న విషయం తాజాగా బయటపడింది.

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత రాంచరణ్ సినిమాలను అమితంగా ఇష్టపడే అభిమానులు ఆ దేశంలో ఉన్నారని తెలిసింది.తాజాగా ‘మగధీర ’ సినిమా నుంచే తనను అభిమానిస్తున్న ఒక వృద్ధురాలిని రాంచరణ్ కలుసుకున్నారు. ‘మగధీర’ రోజుల నుంచి తను రాంచరణ్ ను ఫాలో అవుతోందని.. రాంచరణ్ పై గీసిన స్కెచ్చులు, ఫొటోలు, చిత్ర విశేషాలపై ఆమె తయారు చేసిన బుక్ ను రాంచరణ్ కు చూపించింది. ఆమె అభిమానాన్ని చూసి రాంచరణ్ ఫిదా అయిపోయారు. రాంచరణ్ అంటే తనకు ఎంతో ఇష్టం అన్న ఆ బామ్మను హత్తుకొని ఆమె అభిమానికి రాంచరణ్ కృతజ్ఞతలు తెలిపారు.

రాంచరణ్ స్కెచ్ తో కూడిన టీషర్ట్ ను కూడా ఆమె ధరించి తన అభిమానాన్ని చాటుకుంది.రాంచరణ్ ను నిజంగా ‘ఒక గ్లోబల్ సూపర్ స్టార్’గా ఆ బామ్మ అభివర్ణించింది. మగధీరలో రామ్‌చరణ్ అద్భుతంగా నటించాడని.. ఆయన అద్భుతమైన నటన.. ఆ చారిత్రాత్మక అవతార్‌లో లీనమైపోయాడని ఆమె కొనియాడింది. రాంచరణ్ నటించిన సినిమాల్లో తనకు మగధీర బాగా నచ్చిన సినిమా అని ఆమె పేర్కొంది.ఇక రాంచరణ్ కు అక్కడి జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. గ్లోబల్ స్టార్ అంటూ రాంచరణ్ ఫొటోలను జపాన్ అభిమానులు ట్వీట్లు చేస్తూ కొనియాడుతున్నారు.

రజినీకాంత్ తర్వాత జపనీస్ ప్రేక్షకులలో అన్ని వయసుల వారి నుండి ఏకపక్షంగా ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్న ఏకైక హీరో మన రాంచరణ్ అని చెప్పకతప్పదు. ఇంతటి అభిమానం సంపాదించుకున్న రాంచరణ్ ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో వారిని కలుస్తూ సంతోషాన్ని పంచుతున్నారు.

‘పుష్ప 2’లో మరో కొత్త క్యారెక్టర్.. ‘పుష్ప 3’కి లీడ్ అట !

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం ‘పుష్ప 2’. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకెండ్ హాఫ్ లో వచ్చే ఓ కొత్త క్యారెక్టర్ ద్వారా.. ఈ సినిమా క్లైమాక్స్ లో ఓ భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందట.

ఈ ట్విస్ట్ ‘ పుష్ప 3’ కి లీడ్ అవుతుందని తెలుస్తోంది. మరీ ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, ఈ వార్త మాత్రం బన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తోంది.ఇక ‘పుష్ప ద రూల్’ వర్క్ ప్రస్తుతం ఫుల్ ఫ్లో లో ఉంది. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను ఓ స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్.

బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. అందుకే, పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. పైగా పుష్ప 2 కి ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 3 పై కూడా రూమర్ వైరల్ అవుతుంది. మరీ పుష్ప 3 ఉంటుందో లేదో చూడాలి.

అప్పుడు శివుడు, ఇప్పుడు అయ్యప్ప.. బోయపాటి హిట్ ఫార్ములా !

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. అయితే, అఖండ లో శివుడ్ని, శివ భక్తిని బాగా వాడుకున్నాడు. ఇక బోయపాటి ప్రస్తుతం హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బోయపాటి ఈ సినిమాలో అయ్యప్ప స్వామిని, అయ్యప్ప భక్తిని హైలైట్ చేస్తూ..

అఖండ హిట్ ఫార్ములాని మరోసారి ఘనంగా ఎలివేట్ చేయబోతున్నాడు. ఇదొక ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అయినా.. సినిమాలో అయ్యప్ప తాలూకు ఎపిసోడ్ ఒకటి ఉందట. ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుందని తెలుస్తోంది.పైగా ఈ సినిమాలో చాలా భాగం కేరళ నేపథ్యంలో సాగుతుందట. అయ్యప్ప భక్తుడిగా ఈ సినిమాలో రామ్ కనిపించబోతున్నాడు. అన్నట్టు ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమాచదరంగంలో ఆ ఇద్దరు దర్శకులు తాడో పేడో!

పరిశ్రమలో స్నేహం శత్రుత్వం చాలా సహజం. ఇక్కడ అప్పటివరకూ స్నేహితులుగా ఉన్నా కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఇద్దరినీ విడదీస్తుంటాయి. ఇంతకుముందే సల్మాన్ ఖాన్ – సాజిద్ నడియా వాలా మిత్రద్వయం క్రియేటివిటీ డిఫరెన్సెస్ కారణంగా ఒకరికొకరు విడిపోయారు. ఈ ఇద్దరి అనుబంధం దశాబ్ధాల నాటిది. కానీ ఎవరి దారిలో వారు వెళ్లారు.

అయితే ఇది కొద్దిరోజులు లేదా సంవత్సరాల వరకే. మళ్లీ ఏదైనా సినిమా కోసం కలిసేందుకు ఆస్కారం లేకపోలేదు.ఇకపోతే ఇలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ తో చాలా జోడీలు టాలీవుడ్ లోను విడిపోయాయి. ఇంతకుముందు శ్రీనువైట్ల- కోన వెంకట్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ గురించి బ్రేకప్ గురించి తెలిసిన వ్యవహారమే. అలాగే మాస్ డైరెక్టర్ బోయపాటితో రచయిత కొరటాల శివ విభేధాలు విధితమే. సింహా సమయంలో సృజనాత్మక విభేదాల కారణంగా ఆ ఇద్దరు స్నేహితులు విడిపోయారు.

అప్పటి నుండి ఇరు శిబిరాల మధ్య ఒక రకమైన పోరు కనిపిస్తోంది. ఎవరికి వారు ఎత్తుకు ఎదిగేందుకు ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు.కొరటాల శివకు కెరీర్ లో రెండు బిగ్గెస్ట్ హిట్ లు ఉన్నాయి. ఇది అతనికి అగ్ర దర్శకుడిగా ట్యాగ్ ని తెచ్చిపెట్టింది. ఇది వైరి (లేదా స్నేహితుడు) వర్గానికి ఇబ్బందికరం. అయితే ఆచార్య పరిశ్రమలో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిపోవడంతో కొరటాల వెనకంజలో ఉన్నాడు. ఇక అఖండ వంటి బంపర్ హిట్ చిత్రంతో బోయపాటి రేసులో ముందుకు దూసుకొచ్చాడు.

ఇప్పటికే అఖండ సూపర్ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం రామ్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు కొరటాల కెరీర్ లో అత్యల్ప దశలో ఉండగా బోయపాటి బెస్ట్ లో ఉన్నాడు. కొరటాలను తనదైన ఆటలో ఓడించేందుకు బోయపాటికి ఇదే సరైన సమయం. ఈ చిత్రం పాన్-ఇండియన్ చిత్రమని టాక్ వినిపిస్తోంది. తాత్కాలికంగా #Rapo20 అని పేరు పెట్టారు. బోయపాటి సినిమాని సెన్సేషనల్ హిట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు.అయితే కొరటాల శివ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అంతకుమించి ప్లాన్ చేస్తున్నాడు.

ఇది కూడా పాన్ ఇండియన్ సినిమా అన్న టాక్ ఉంది. ఇప్పుడు తారక్ కోసం అతడు అమాంతం కాన్వాస్ మార్చేశాడు. ఆర్.ఆర్.ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ లో నటించిన ఎన్టీఆర్ ని మళ్లీ అదే రేంజులో ఆవిష్కరించేందుకు కొరటాల తీవ్రంగా శ్రమిస్తున్నాడని టాక్ ఉంది. అంటే బోయపాటికి కౌంటర్ వేసేందుకు కొరటాలకు కూడా ఆస్కారం ఉంది.

ఇక్కడ ఎవరి ఆట ఎప్పుడు ఎలా సాగుతుందో ఊహించలేం. చదరంగంలో పావులు ఎట్నుంచి ఎటు కదులుతాయో కూడా గ్రహించలేం. నిచ్చెనలన్నీ ఎక్కేసినా చివరిలో పాము మింగితే కిందికి దిగిపోవాలి. లేదా పాము మింగేసిన తర్వాత కూడా ఒకే దెబ్బకు పది నిచ్చెనలు ఎక్కి గోల్ ని చేరుకున్న అదృష్టవంతులు ఉంటారు. మరి ఆ ఇద్దరూ ఏ జాబితాలో నిలుస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh