Andhra Pradesh: ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే

Andhra Pradesh

Andhra Pradesh: ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే…వాతావరణ శాఖ

Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కొద్ది రోజులు ఎండ తీవ్రత..వడ గాలులతో అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే రాష్ట్రంలో నేడు వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీ అంతటా ఈ రోజు, రేపు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.  అయితే గత పది రోజులు అకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. ఇప్పుడు తుఫాను ముప్పు ఏపీ తీర ప్రాంతం పైన ఉంటుందని అంచనా వేసినా అది తప్పిపోయింది. ఇదే సమయంలో రాయలసమీ ప్రాంతంలో రికార్డు ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందంటూ అప్రమత్తం చేసింది.

Also Watch

Telangana 10th Results: పది ఫలితాల్లో కూడా బాలికలదే పైచేయి

రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఎండ, వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో భూ ఉపరితలం నుంచి గాలులు వాయుగుండం దిశగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో ఎండలు పెరిగాయి. సత్యసాయి జిల్లా మడకశిరలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం రాయలసీమలో పలు చోట్ల అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40-44 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని హెచ్చరించింది. కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో వైపు తెలంగాణలోనూ ఉష్ణోగత్రలు గరిష్టంగా నమోదువుతున్నాయి. హైదరాబాద్ తో పాటుగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిసాయి. ఇప్పుడు హైదరాబాద్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అయితే ఉష్ణోగ్రతతో  పాటు ఎండల తీవ్రత ఎక్కువగా వుండటం వల్ల ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలి అని . అవసరం వుంటే తప్ప బయటకు వెళ్లారాదు అని ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్దులు తీసుకోవాలి అని చెబుతున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh