నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య కు  క్యాన్సర్‌ – జైలు లో వున్నా  భర్తకు లేఖ

Punjab: నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య కు  క్యాన్సర్‌ – జైలు లో వున్నా  భర్తకు లేఖ

సీనియర్ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్​ నవజ్యోత్ గ్ సిద్ధూ  భార్య క్యాన్సర్ బారిన పడ్డారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్యకు స్టేజ్ 2 ఇన్వేసివ్ క్యాన్సర్ సోకింది. నవజ్యోత్ కౌర్ ట్విట్టర్‌లో ఈ వార్తను పంచుకున్నారు,

ఈ విషయాన్ని స్వయంగా నవ్​జ్యోత్ కౌర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. త్వరలో తనకు సర్జరీ జరగనున్నట్లు ఆమె వెల్లడించారు. కాగా,  సిద్ధూ చేయని నేరానికి జైలులో ఉన్నాడు.సిద్ధూ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి విదితమే.

1988 డిసెంబర్‌ 27న సిద్ధూ, అతని స్నేహితుడు రూపీందర్‌ సింగ్‌ సంధూ వాహనాల పార్కింగ్‌ విషయంలో గుర్నమ్‌ సింగ్‌ అనే వ్యక్తితో గొడవపడ్డారు. ఈ ఘర్షణ సమయంలో గుర్నమ్‌ను కారులోంచి బయటకు లాగి మరీ దాడి చేశారు. దాంతో అతను చనిపోయారు. ఈ ఘటన పాటియాలాలో చోటుచేసుకుంది. అయితే మొదట్లో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సిద్ధూని నిర్దోషిగా తేల్చింది. కానీ 2006లో పంజాబ్, హర్యాణా కోర్టు మాత్రమే దోషిగా తేల్చింది. దాంతో సిద్ధూకి మూడేళ్ల జైలు శిక్ష కూడా వేసింది.

అయితే ఈ తీర్పుపై సిద్ధూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయడమే కాకుండా సిద్ధూకి బెయిల్ కూడా మంజూరు చేసింది. తర్వాత ఇదే కేసులో 2018లో సుప్రీంకోర్టు మరో తీర్పు ఇచ్చింది. గొడవలో వృద్ధుడిని తీవ్రంగా గాయపరిచారనే కారణంతో సిద్ధూకి, అతడి ఫ్రెండ్‌కి వెయ్యి రూపాయల జరిమానా విధించింది. పైగా ఒక దెబ్బకే వ్యక్తి చనిపోయాడనే దానికి సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. కానీ ఆ తీర్పును సమీక్షించాలని బాధిత కుటుంబం మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

 దీంతో జైలులో ఉన్న భర్తకు నవ్​జ్యోత్ కౌర్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగ లేఖ రాశారు. తన భర్త చేయని నేరానికి జైలులో ఉన్నారన్న నవ్​జ్యోత్ కౌర్ ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. సిద్ధూ కంటే తానే ఎంతో బాధపడుతున్నానని ట్వీట్​లో ఆమె రాసుకొచ్చారు.

‘మీ కోసం ఎంతో ఎదురుచూశా. మీకు న్యాయం జరగట్లేదు నిజం చాలా శక్తిమంతమైంది. కానీ, ఆ నిజం మీకు పదే పదే పరీక్షలు పెడుతోంది. నన్ను క్షమించండి. నేను మీ కోసం ఇంకా వేచి ఉండలేను ఎందుకంటే, ఇది స్టేజ్-2 ఇన్వేసివ్ క్యాన్సర్. ఈ రోజే నేను సర్జరీకి వెళ్తున్నా దీనికి ఎవరినీ నిందించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇదంతా ఆ దేవుడి ప్లాన్’ అని నవ్​జ్యోత్ కౌర్ భావోద్వేగ పోస్టు చేశారు. కాగా, 34 ఏళ్ల కింద జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్ష వేసింది. సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో సిద్ధూను పాటియాలాలోని సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పుడు ఆయన అక్కడే శిక్షను అనుభవిస్తున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh