నైనిటాల్ షెడ్యూల్ పై సమంత ఎమోషనల్ కామెంట్స్

Samantha's emotional comments on Nainital schedule

SAMANTHA: నైనిటాల్ షెడ్యూల్ పై సమంత ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. సినిమాల పరంగా, వ్యక్తిగతంగా సమంతకు సంబంధించిన ఇష్యూస్ నెట్టింట డిస్కషన్ పాయింట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకేతో కలిసి సిటాడెల్ సినిమా చేస్తున్న సమంత ప్రస్తుతం ఆ షూటింగ్‌లో పాల్గొంటోంది. రీసెంట్ గా మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్నాక వెంటనే షూటింగ్ సెట్స్ పైకి వచ్చేసింది సామ్. తన ప్రాజెక్టుల కోసం విపరీతంగా కష్టపడుతూ పూర్తి ఫోకస్ కెరీర్ పైనే పెట్టింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా రక్తంతో కూడిన తన చేతుల పిక్స్ పంచుకున్న సామ్. ఇప్పుడు తాజాగా మరోసారి షూటింగ్ కి సంబంధించి తన కష్టాలు తెలిసేలా పోస్ట్ పెట్టింది ప్రస్తుతం నైనిటాల్‌లో షెడ్యూల్ చేస్తోంది సమంత. ఈ షెడ్యూల్ షూటింగ్ అంత సులభంగా ఉంటుందని ఏ ఒక్కరూ చెప్పలేదు. ముఖ్యంగా రాజ్ అండ్ డీకే అయితే చెప్పలేదు. అయినా నాకు వేరే దారి లేదు అంటూ నైనిటాల్ షెడ్యూల్ పై ఆమె కామెంట్స్ చేసింది. అంటే తీవ్రమైన చలిలో చాలా కష్టపడుతన్నా అని చెప్పింది సమంత ఇటీవలే మయోసైటిస్ బారినపడి కొన్ని నెలల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న సమంత  ఆ సమస్య నుంచి కోలుకొని తిరిగి తాను కమిటైన సినిమాల సెట్స్ మీదకొస్తోంది. వరుస పెట్టి షూటింగ్స్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకుంది. రాజ్- డీకే తెరకెక్కిస్తున్న సిడాటెల్ వెబ్ సిరీస్ చేస్తున్న సామ్. మరోవైపు విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా కోసం రెడీ అయింది. రేపటి  (మార్చి 8) నుంచి సమంత షూటింగ్ లో జాయిన్ అవుతుందని తెలిసింది. గతంలో మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించారు. ఇప్పుడు అదే జోడీ మళ్ళీ ఖుషీ సినిమాతో వస్తుండటం  అది కూడా ఫీల్ గుడ్ ప్రేమకథ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి నెలకొంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు అదే పేరుతో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh