Ntr 30: లో రష్మిక మందన??

rashmika mandanna యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. వీరి కాంబో సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త మరింత ఆసక్తికరంగా మారుతుందనడంలో సందేహం లేదు.

ఇది కేవలం తెలుగు సినిమాగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ ఇమేజ్ ని పెంచుతుందని కొరటాల శివ సన్నిహితులు అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 

ఎన్టీఆర్‌ 30వ సినిమా హీరోయిన్‌ గురించి మీడియాలో ప్రచారం జరగడం కొత్తేమీ కాదు, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించబోతోందని గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించబోతోందని ప్రచారం జరిగింది.

తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమాతో ఆమెకు జాతీయ స్థాయిలో ఓ రేంజ్ లో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఆమెను ఈ సినిమాలో నటింపజేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆమెను అక్కడ చేయడం వల్ల మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉందని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇక ఈ సినిమాలో నటించేందుకు రష్మిక మందన్న ఐదు కోట్ల రూపాయలు తీసుకోనుంది.

ఈ మధ్య కాలంలో రష్మిక మందన ఈ స్థాయి రెమ్యునరేషన్ అందుకోలేదు. దర్శకుడు కొరటాల శివ ఆమె నుండి ఎక్కువ డేట్స్ డిమాండ్ చేసి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా ఆమె ఓకే చెప్పిందట. హీరోయిన్ కే రూ. 5 కోట్లు కాస్త ఎక్కువే అని ఇండస్ట్రీకి చెందిన కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh