NTR-30మెడికల్ మాఫీయా నేపథ్యంలో ‘ఎన్టీఆర్-30’ మూవీ.

NTR-30మెడికల్ మాఫీయా నేపథ్యంలో ‘ఎన్టీఆర్-30’ మూవీ.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ‘ఎన్టీఆర్ 30’ సినిమాపై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మొన్నామధ్య కొరటాలతో ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మూవీ టీమ్ ఇటీవలే క్లారిటీ ఇవ్వడంతో సినిమా క్యాన్సిల్ అవ్వలేదని అర్థమైంది. స్క్రిప్ట్ విషయంలో ఇంకా మార్పు, చేర్పులు జరుగుతూనే ఉన్నాయని సినీ వర్గాల టాక్. ఇప్పుడీ సినిమాలో మెడికల్ మాఫియాకు సంబంధించిన అంశాన్ని పొడిగిస్తూ ఒక లైన్ ను ఎన్టీఆర్ కు చెప్పారట కొరటాల.

ఆ పాయింట్ ఎన్టీఆర్ కు నచ్చడంతో దానిపై కసరత్తు ప్రారంభించారట మూవీ టీమ్. ఇది దాదాపు మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా విషయంలో విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కొరటాల మళ్ళీ మూల కథను మార్చి చేస్తే సినిమా ఇంకెంత లేట్ అవుతుందో అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సినిమాలో కార్పొరేట్ వైద్యం సవాళ్ళను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారట. కార్పొరేట్ వైద్యం పేదల పాలిట అందని ద్రాక్షలా ఎందుకు మారింది? అందుకు గల కారణాలను డెప్త్ లోకి వెళ్లి చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట కొరటాల.

సినిమాలో ఓ సంపన్నుడి చివరి క్షణాలు ధీన పరిస్థితుల్లో ఎలా ముగిశాయి అనే పాయింట్ ను మెడికల్ మాఫియాకి అన్వయించి కొత్త మెసేజ్ ను ఇచ్చే విధంగా ఈ కథ ఉంటుందని టాక్. ఎమోషనల్ సీన్స్ తో మంచి మెసేజ్ ఇచ్చే విధంగా స్క్రిప్ట్ రాసుకోవడంలో కొరటాల రూటే సపరేటు. తన మార్క్ రైటింగ్ స్టైల్ తో కథను మరింత బలంగా తీర్చిదిద్దుతున్నారట కొరటాల. నిజానికి ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండనుందని అందరూ అనుకున్నారు. అందుకే ఫస్ట్ లుక్, టీజర్ ఆ లెవల్ లో విడుదల చేశారు.

ఇప్పుడీ కథకు మెడికల్ మాఫియా బ్యాగ్రౌండ్ కూడా తోడవడంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులకు ఎలాగో ఇంకో మూడు నెలలు పట్టడంతో వచ్చే ఏడాదిలో సినిమా పనులు ప్రారంభం అవుతాయని ఫిల్మ్ సర్కిల్ లో టాక్. వాస్తవంగా ఇలాంటి మెడికల్ బ్యాగ్రౌండ్ అంశాలు ఉన్న సినిమాలు గతంలోనూ వచ్చాయి.

చిరంజీవి ‘ఠాగూర్’ లాంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. అయితే ఆ సినిమాల్లో కొంత భాగం మాత్రమే మెడికల్ మాఫియాకు సంబంధించిన సీన్స్ ఉంటాయి. కానీ ఎన్టీఆర్ 30లో మూల కథే మెడికల్ మాఫియా కావడం, అదీ ఫుల్ లెన్త్ లో ఆ పాయింట్ ను లీడ్ చేస్తున్నారు కాబట్టి మెడికల్ రంగానికి సంబంధించిన ఎన్నో చీకటి కోణాలను సినిమాలో చూపించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే ఇంట్రెస్టింగ్ న్యూస్. ఒకవేళ ఇదే నిజం అయితే ఇండస్ట్రీలో మరో భారీ బ్లాక్ బస్టర్ ఖాయమని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఈ సినిమా రిలీజ్ టైమ్ కు ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో, ఎన్టీఆర్-కొరటాల కాంబో మళ్ళీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

శర్వానంద్ పై ఫైర్ అయిన బాలయ్య.

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, నందమూరి నటసింహం బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్త్ను టాక్‌ షో ‘‘ అన్‌స్టాపబుల్‌’. ఈ షో మొదటి సీజన్‌ దిగ్విజయంగా పూర్తయింది. ఎన్నో వండర్స్‌ను క్రియేట్‌ చేసింది. హోస్ట్‌గా బాలయ్య బాబు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. వన్‌ మ్యాన్‌ ఆర్మీగా మొదటి సీజన్‌ను పూర్తి చేశారు. తాజాగా, సీజన్‌ 2 స్టార్ట్‌ అయింది. సీజన్‌ 2 మొదటి ఎపిసోడ్‌ గెస్ట్‌లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ వచ్చారు. ఈ ఎపిసోడ్‌లో చంద్రబాబు ఎన్నో పర్సనల్‌ విషయాలను షేర్‌ చేసుకున్నారు. ఎంతో సరదాగా ఈ ఎపిసోడ్‌ ముగిసింది. ఎసిసోడ్‌ 2కు విశ్వక్‌ సేన్‌, సిద్ధూ జొన్నల గడ్డ వచ్చారు. తాజాగా, మూడో ఎపిసోడ్‌ గెస్ట్‌లుగా శర్వానంద్‌, అడవి శేషు వచ్చారు.

ఈ ఎపిసోడ్‌ నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిగితా ఎపిసోడ్‌ల కంటే మరింత ఫన్నీగా ఈ ఎపిసోడ్‌ సాగింది. గెస్ట్‌లను బాలయ్య అడుగుతున్న ప్రశ్నలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బాలయ్య శర్వానంద్‌ను ‘‘ మీ ఫోన్‌లో ఎన్ని వీడియోలు ఉన్నాయి’’ అని అడిగారు. అందుకు శర్వానంద్‌ సమాధానం ఇస్తూ ‘‘ సార్‌! మీ నాన్న గారి దగ్గర మా తాత అకౌంటెంట్‌గా పనిచేశాడు. మీకు సంబంధించిన అన్ని వివరాలు మా దగ్గరున్నాయి. వాటిని ఇప్పుడు చెప్పమంటారా?’’ అని అన్నాడు. దీంతో బాలయ్య బాబు కంగుతిన్నాడు.

వెంటనే ‘‘మీలాంటి వాళ్లను షోకు పిలవటమే తప్పు’’ అంటూ నవ్వేశారు.కాగా, బాలయ్య షోకు మున్ముందు స్టార్‌ హీరోలు, రాజకీయ నాయకులు వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఓ సారి షోలో బాలయ్య త్రివిక్రమ్‌కు ఫోన్‌ చేశారు. షోకు ఎప్పుడు వస్తున్నావని అడిగాడు. ‘నీతో పాటు ఎవరిని తీసుకురావాలో తెలుసు కదా’ అని అన్నారు.

అంటే త్రివిక్రమ్‌తో పాటు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కూడా షోకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కూడా గెస్ట్‌గా వచ్చే అవకాశం ఉందంట. అంతేకాదు! దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కూతురు వైఎస్‌ షర్మిల కూడా బాలయ్య టాక్‌ షోకు రాబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

టీజర్ పై డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ.. రీషూట్ చేయనున్న మేకర్స్ :

ప్రభాస్ సినిమా అంటే ఎన్నో అంచనాలు. ఒక్క అప్డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూసే ఫ్యాన్స్. ఇక మూవీ రిలీజ్ అంటే దేశవ్యాప్తంగా అభిమానులు చేసే రచ్చ గురించి తెలిసిందే. ప్రభాస్ సినిమాల కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‏ను బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ నిరాశపరిచాడు. ఆయన తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న క్రమంలో ఇటీవల విడుదలైన టీజర్‏పై దారుణంగా ట్రోల్స్ జరిగాయి. ఒకానొక సమయంలో సినీ విశ్లేషకులు సైతం ఈ టీజర్ పై మండిపడ్డారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో రాముడు.

రావణుడి లుక్స్ సరిగ్గా లేవని… హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఇప్పటికే ఢిల్లీలో ఆదిపురుష్ చిత్రయూనిట్ పై ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సినిమాకు గ్రాఫిక్స్ కూడా ఎక్కువైందంటూ నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ టీజర్ పై వస్తోన్న నెగిటివిటిని తగ్గించేందుకు మేకర్స్ అనుహ్య నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

ఆదిపురుష్ చిత్రంలోని పలు సన్నివేశాలను రీషూట్ చేయాలని భావిస్తున్నారట. దాదాపు రూ. 500 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని మళ్లీ రీషూట్ చేస్తే సినిమా బడ్జెట్ మరింత పెరుగుతుందని అంచనా. అంటే చిత్రబృందానికి ఇది పెద్ద దెబ్బే అనుకోవాలి. అంతేకాకుండా మరోసారి డార్లింగ్ అభిమానులకు షాక్ ఇవ్వనున్నారట. రీషూట్ కారణంగా ఈ సినిమా విడుదల తేదీని మార్చాలని భావిస్తున్నారట. కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్‌ఎక్స్‌ని రీవర్క్ చేయాలని టీమ్ నిర్ణయించుకుందట… జిల్టీ తరహాలో షూట్ చేసిన రావణుడి పాత్రను మార్చనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ క్యారెక్టర్ పూర్తిగా మారిస్తే బడ్జెట్ మరింత పెరగడం ఖాయం.అయితే ఈ చిత్రాన్ని ముందుగా 2023 జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు పలు సన్నివేశాలు రీషూట్ చేయాల్సి రావడంతో సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలనుకుంటున్నారట. సంక్రాంతికి పలు బడ్జెట్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా వెనకడుగు వేయనున్నట్లు టాక్. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం సంక్రాంతికి ఆదిపురుష్ రావడం మాత్రం అనుమానమే. ఈ వార్తలపై ఇప్పటివరకు చిత్రయూనిట్ అధికారిక ప్రకటించలేదు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh