NTR తో నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను.

 NTR తో నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను.

NTR జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. శ్రీదేవి కూతురుగా అందరికీ పరిచయే అయినా..బాలీవుడ్లో జాన్వీ చేసినవి కొన్ని సినిమాలే. అయితే.. బీటౌన్లో ఈ సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.కానీ.. ఎప్పుడూ సోషల్మీడియాలో ఉండే జాన్వీ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

శ్రీదేవి తెలుగులో ఒక వెలుగు వెలిగిన తార. ఆమె కూతురు జాన్వీ కపూర్ను సైతం తెలుగులో తెరంగేట్రం చేయించాలని ఇప్పటికే చాలా మంది దర్శకులు కథలు వినపించారు. కానీ.. ఎవరి కథలు జాన్వీకి కనెక్ట్ కాకపోవడతో నో చెప్పింది.సౌత్ సినిమాలు చేయడానికి జాన్వీ ఆసక్తిని చూపిస్తోందని ఇటీవల బోనీ కపూర్ వెల్లడించారు. తాజాగా ఇదే విషయాన్ని జాన్వీ కూడా కన్ఫర్మ్ చేస్తూ.. సౌత్ సినిమాలను సైతం ఎంతో ఇష్టంగా చూస్తానని.. ఈ మధ్య రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాను చూశానని వివరిస్తూ..

అందులో రామ్ రామ్ చరణ్, భీమ్ గా ఎన్టీఆర్లు నటన ఎంతో బాగుందని తెలిపింది. తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అందరి యాక్టింగ్ నచ్చుతుందని, అయితే.. ఎన్టీఆర్తో నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.చూడాలి మరీ ఎన్టీఆర్ సరసన నటించి అవకాశం ఏ సినిమాలో జాన్వీని వరిస్తుందోనని.

డ్యాన్స్ మా రక్తంలోనే ఉంది’.

రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రం ప్రస్తుతం జపాన్ లో థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్, జక్కన్న, ఎన్టీఆర్ జపాన్‏లో సందడి చేస్తున్నారు. ఈ సినిమాకు అక్కడ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తారక్, చరణ్ లను చూసి జపనీస్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. వీరిద్దరికి విభిన్నంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

అక్టోబర్ 21న జపాన్ లో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది. అంతేకాకుండా ఈ చిత్రంలోనే పాటలకు జపనీస్ అందంగా స్టెప్పులేస్తున్నారు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ సిగ్నెచర్ స్టెప్పు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అయితే ఇటీవల జపాన్ లో ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తారక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.తారక్ మాట్లాడుతూ.. ” మేము భారతీయులం ఎప్పుడూ డ్యాన్స్ గురించి ఫిర్యాదు చేయము. డ్యాన్స్ మా రక్తంలోనే ఉంది. అందుకే భారతీయులు డ్యాన్స్ అంటే ఇష్టపడకుండా ఉండలేరు.

డ్యాన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలంటే.. ముందు డ్యాన్స్ ను ప్రేమించడం నేర్చుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది గొప్ప డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు ఉన్నారు. వారిలో ఒకరు ప్రభుదేవా.. అతడిని ఇప్పటికీ ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు. ” అంటూ చెప్పుకొచ్చారు.ఇటీవల అమెరికాలో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. ఇటీవల ఈ మూవీ 50వ సాటర్న్ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. అంతేకాకుండా ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్.. బెస్ట్ డైరెక్టర్ సహా పలు విభాగాల్లో నామినేటే చేయబడింది.

కాంతార చిత్రానికి బిగ్ షాకిచ్చిన కోర్టు.

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కాంతార చిత్రానికి కొద్ది రోజులుగా వివాదాలు చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. కేరళ ఆదివాసీల భూతకోల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీపై ఇప్పటికే కాపీరైట్ ఫిర్యాదు చేశారు. ఇందులోని వరాహ రూపం సాంగ్ కాపీ చేశారంటూ మలయాళ సంగీత బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ పాటను కాపీ చేశారంటూ కోజికోడ్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కోడికోడ్ కోర్టు.. థియేటర్లలో వరాహ రూపం సాంగ్ ప్లే చేయకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అన్ని ప్రధాన స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ నుంచి ఈ పాటను ప్లే చేయకూడదని ఆదేశించింది.

గతంలో తాము తెరకెక్కించిన నవరస సాంగ్ కాపీ చేసి కాంతార చిత్రంలో ఉపయోగించారని.. ఈ చిత్రయూనిట్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తైక్కుడం బ్రిడ్జ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాపీరైట్ ఉల్లంఘన చేశారని..దీంతో థియేటర్లలో ఈ సాంగ్ ప్లే చేయకూడదంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ టీమ్ అనుమతి లేకుండా కాంతార చిత్రంలో వరాహ రూపం సాంగ్ ప్లే చేయకూడదని.. నిర్మాత, దర్శకుడు.. సంగీత దర్శకుడి..

అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియోసావన్.. మరిన్ని స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ కు నిషేధం విధిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది కోజికోడ్ కోర్టు.కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించి.. స్వియ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. కేవలం కన్నడలో కాకుండా ఉత్తరాదిలోనూ భారీ వసూల్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈ ఏడాది విడుదలైన అతి పెద్ద విజయాలు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది కాంతార సినిమా. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా చేస్తుందని.. దైవం ఆవహించిన సమయంలో రిషబ్ నటన అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడియన్స్.

బ్రహ్మస్త్ర 2లో హీరో గా రాఖీభాయ్ యశ్ ?

డైరెక్టర్ ప్రశాంత్ నీ ల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ రాకింగ్ స్టార్ యశ్. ఈ మూవీ దేశవ్యాప్తంగా యశ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. రాఖీభాయ్‏గా దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఇటవల విడుదలైన కేజీఎఫ్ 2 కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కొల్లగొట్టింది.

భారీగా వసూల్లు రాబట్టి.. మరోసారి సత్తా చాటింది. ఇక ఈ మూవీ తర్వాత యశ్ నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. ప్రస్తుతం రాఖీభాయ్ తన ఫ్యామిలీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా యశ్ కు సంబంధించి కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి యశ్ ఎంట్రీ ఇస్తున్నారని.. ఇప్పటికే రెండు భారీ ప్రాజెక్ట్స్ ఆఫర్స్ వచ్చాయని టాక్ నడుస్తోంది.ఇవే కాకుండా..

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కోసం యశ్ ను ప్రొడ్యూసర్స్ సంప్రదించారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ నిర్మాత కరణ్ జోహార్. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. బ్రహ్మాస్త్ర 2లో దేవ్ పాత్రలో నటించడానికి హృతిక్ రోషన్ తన మొదటి ఎంపిక అని.. ప్రస్తుతం ఈ సినిమా గురించి వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవమన్నారు. ఆ పాత్ర కోసం ఎవరినీ సంప్రదించలేదని అన్నారు.అలాగే.. డైరెక్టర్ రాకేశ్ ఓంప్రకాష్ మెహ్రా మహాభారతం ఆధారంగా కర్ణ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీలో ప్రధాన పాత్ర కోసం యశ్ ను సంప్రదించారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh