పాన్ ఇండియా స్టార్ తో సందడి చేయనున్న బాలయ్య..

బాలయ్య అన్‌స్టాపబుల్‌ విత్ NBKకి అద్భుతమైన స్పందన లభిస్తోంది మరియు ఈ షో రోజురోజుకు మరింత క్రేజ్ పొందుతోంది. సీజన్ 2లో సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి బాలయ్యతో సందడి చేస్తున్నారు. లాస్ట్ ఎపిసోడ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, విచ్చేసి సినిమాలు మరియు వ్యక్తి గత విషయాల గురించి కూడా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పటి వరకు టాప్ సెలబ్రిటీలు వచ్చి సందడి చేయడంతో తిరుగులేని అన్‌స్టాపబుల్‌ 2కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కానీ, అభిమానుల్లో ఎక్కడో ఓ చోట అసంతృప్తి నెలకొని ఉంది. సీజన్ 1లో చాలా మంది స్టార్ హీరోలు గెస్ట్ లుగా వచ్చారు.. కానీ సెకండ్ సీజన్ లో మాత్రం పొలిటికల్ మసాలా పెరిగిపోయిందని సినీ అభిమానులు ఫీలవుతున్నారు.

అలాంటి వారి కోసం బాలయ్య పాన్ ఇండియా హీరోని పట్టుకుంటున్నాడు. మరి హీరో ఎవరంటే.. ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది..? ఈషోలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోతున్నట్లు సమాచారం. ఒక్కడే కాదు.. అతనితో పాటు తన ప్రాణ స్నేహితుడు హీరో గోపీచంద్ కూడా రాబోతున్నాడు. ఈ ఎపిసోడ్ షూటింగ్ నవంబర్ 11న ప్రారంభం కానుంది. ప్రభాస్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వర్షం సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు. ఈ సినిమా తర్వాత కూడా వీరి స్నేహం కొనసాగింది. ప్రభాస్ తో తన అనుబంధం గురించి గోపీచంద్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. బాలయ్య తో కలిసి వీరిద్దరూ సందడి చెయ్యబోతున్నారు.

Dimple Hayathi In Shankars Movie keerthi suresh