Drugs : టాలీవుడ్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసు

Drugs

Drugs : టాలీవుడ్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసు

Drugs :  డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన సినీ నిర్మాత కేపీ చౌదరి పోలీసుల విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించినట్లు తెలిసింది.

ముఖ్యంగా 12 మందికి డ్రగ్స్‌ విక్రయించినట్లు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.

అంతే కాకుండా బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఒక హీరోయిన్‌తో పాటు టాలీవుడ్‌లో ఐటమ్‌ సాంగ్‌ చేసిన మరో హీరోయిన్‌ అలాగే నిర్మాత కేపీ చౌదరి చెప్పిన లిస్ట్‌లో

‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ హీరో సుశాంత్ రెడ్డి ఉండటం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఈవిషయం పై సుశాంత్ రెడ్డి స్పందించారు.  మీడియాతో మాట్లాడిన  సుశాంత్‌ ఈ ఆరోపణలను కొట్టిపడేశాడు. తనకు కేపీ చౌదరి ఒక ప్రొడ్యూసర్‌గా మాత్రమే తెలుసన్నాడు.

కేపీని  కొన్ని సార్లు కలిశానని.. అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని..డ్రగ్స్ సరఫరాతో ఎలాంటి  సంబంధం లేదని స్పష్టం చేశారు.

డ్రగ్స్ పరంగా కేపీ చౌదరితో ఎలాంటి సంబంధం లేదని  స్పష్టం చేస్తున్నారు.

అయితే తాను ఎలాంటి టెస్టులకు అయినా సిద్దమేనని సుశాంత్ రెడ్డి చెప్పారు. ఎలాంటి విచారణకైనా సిద్దమేనని తెలిపారు.

గోవాలో కేపీ చౌదరి చాలా మందికి తెలుసునని అన్నారు. కేపీ చౌదరిని ఈ మధ్య కలవలేదని చెప్పారు.

పోలీసులు రిమాండ్ రిపోర్టులో తన ఫోన్ నెంబర్ ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు.

అలాగే మరొనాటి  నటి సురేఖా వాణి, ఆమె కూతురితో కలిసి కేపీ చౌదరి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

డ్రగ్స్‌ కేసులో వీరి పేర్లు కూడా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేపీ చౌదరి11 మందితో అనుమానాస్పద బ్యాంక్‌ లావాదేవీలు జరిపాడు. ఆ లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఒక పబ్‌ యజమానితో కూడా ఎక్కువ సార్లు మాట్లాడినట్టు గుర్తించారు. రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్ తదితరులు తన వద్ద నుంచి డ్రగ్స్ కొనుగులో చేసినట్టుగా కేపీ చౌదరి చెప్పినట్టుగా కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

సినీ పరిశ్రమంతో పాటు కొందరు వ్యాపారులు, నాయకుల పిల్లలకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు కేపీ చౌదరి పోలీసు విచారణలో వెల్లడించినట్లు వస్తున్న వార్తలతో టాలీవుడ్‌లో కలకలం మొదలైంది

. డ్రగ్స్‌ కేసులో ఈనెల 14న అరెస్టయిన చౌదరిని ఈనెల 21న కోర్టు అనుమతితో రాజేంద్రనగర్‌ పోలీసులు కస్టడిలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

కస్టడీకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కేపీ చౌదరి పూర్తిస్థాయిలో దర్యాప్తుకు సహకరించడం లేదు.

పోలీసులు తన మీద ఫాల్స్ అలగేషన్స్ వేస్తున్నారని ఆయన అంటున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh