Kalyan Ram లీకైన బింబిసార 2 స్టోరీ..వారియర్‌గా యంగ్ టైగర్.

Kalyan Ram లీకైన బింబిసార 2 స్టోరీ..వారియర్‌గా యంగ్ టైగర్.

బింబిసార’ క్రియేట్ చేసిన సెన్సేషన్‌ను మరిచిపోకముందే… ఈ సెన్సేషన్‌ను మరో సారి రిపీట్‌ చేసేందుకు రెడీ అయిపోతున్నారు హీరో కల్యాణ్ రామ్ అండ్ టీం. ఈ సారి తన తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కూడా… తనతో పాటు మన ముందుకు తీసుకురాబోతున్నారు. సూపర్ డూపర్ హిట్ బింబిసారకు సీక్వెల్‌ను అతి త్వరలో తీసుకువస్తున్నారు.

బింబిసార రిలీజ్ నుంచే చెబుతున్న ఈ మూవీకి సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు కళ్యాణ్ రామ్. మరింత భారీగా… మరింత లావిష్‌గా… పాన్‌ ఇండియన్ రేంజ్‌లో ఈ సారి తెరకెక్కించతోతున్నారు. దానికి తోడు నందమూరి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేలా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఈ సినిమాలో నటింపజేస్తున్నారు. ఎస్ ! అకార్డింగ్ టూ లేటెస్ట్ బజ్…

అండ్ ఇన్‌సైడర్ లీక్.. బింబిసార సీక్వెల్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ కీల్ రోల్ చేయబోతున్నారట. అందుకోసం డైరెక్టర్ అండ్ హీరో కళ్యాణ్ రామ్.. ఆల్‌రెడీ స్క్రిప్ల్ పై వర్క్ మొదలెట్టారట. ఇక ఇప్పుడిదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. నందమూరి యంగ్ హీరోలిద్దరినీ సిల్వర్ స్క్రీన్ పై చూడాలనే ఆశను… అందరిలో పెంచేస్తోంది.

బ్రాండ్ అంటే..ఇది..ఒరిజినల్.

ఏ హీరోకైనా ఓ బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండే… అందరూ ఆ హీరోను ఫాలో అయ్యేలా చేస్తుంది. ఆ హీరో ముందు సాగిలా పడేలా చేస్తుంది. చేతులెక్కి మొక్కేలా చేస్తుంది. అతడినే ఫాలో అయ్యేలా చేస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కింగ్ మేకర్ ను చేస్తుంది. ఇక అలాంటి బ్రాండే ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు హద్దులు చెరిపేసేలా అభిమానులను పట్టేసుకుంటున్నారు.

తన ఛరిష్మాను వరల్డ్ వైడ్ పాకేలా చేస్తున్నారు. ఎస్ ! అయితే ఫ్యాన్స్ హృదయాల్లో లేక.. ట్విట్టర్‌ ట్రెండింగ్లో ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్… మరో సారి ట్విట్టర్లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నారు. #ManOfMassesNTR అనే హ్యాష్ ట్యాగ్ తో ఎట్ ప్రజెంట్ ట్విట్టర్ నే షేక్ చేస్తున్నారు.

 

 

విజయ్ పెళ్లి అయిపోయిందా??..సీక్రెట్ ను లీక్ చేసిన జాన్వీ కపూర్.

శ్రీదేవి నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసింది జాన్వీ కాపూర్. ధఢక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. శ్రీదేవి నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ వరుస సినిమాలు చేస్తోంది. అందివచ్చిన ప్రతి అవాకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.ఇటీవల గుడ్ లక్ జెర్రీ అనే సినిమాతో నేరుగా ఓటీటీలో ఎంట్రీ కూడా ఇచ్చిన జాన్వీ కపూర్..

మరికొద్ది రోజుల్లో మిలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ చేపడుతున్న ఈ బ్యూటీ.. తాజాగా విజయ్ దేవరకొండ పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ రౌడీ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పెళ్లి మ్యాటర్ గత కొన్ని రోజులుగా డిస్కషన్ పాయింట్ అవుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడంతో ఆయన లవ్ ఎఫైర్స్, పెళ్లి సంగతులపై జనాల్లో ఓ రేంజ్ చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాన్వీ చేసిన కామెంట్స్ హాట్ ఇష్యూ అయ్యాయి.విజయ్ దేవరకొండ పెళ్లి గురించి షాకింగ్ విషయం చెప్పి ఆశ్చర్యపరిచింది జాన్వీ కపూర్.

ఒకవేళ మీ స్వయంవరం జరిగితే.. ఏయే హీరోలు ఉండాలని అనుకుంటున్నారు అనే ప్రశ్నకు బదులిస్తూ హృతిక్ రోషన్, రణ్ బీర్ కపూర్, టైగర్ ష్రాఫ్ అని చెప్పింది జాన్వీ. మరి విజయ్ దేవరకొండ అని హోస్ట్ అడగ్గానే షాకింగ్ సమాధానం ఇచ్చింది జాన్వీ.విజయ్ దేవరకొండతో స్వయంవరం, పెళ్లి విషయమై రియాక్ట్ అవుతూ.. హి ఈజ్ ప్రాక్టికల్లీ మ్యారీడ్ అనేసింది జాన్వీ. దీంతో అసలు ప్రాక్టీకల్లీ మ్యారేజ్ కావడం అంటే ఏంటి? జాన్వీ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి? అనేది జనాల్లో చర్చనీయాంశం అయింది.

గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ- రష్మిక మందన డేటింగ్ వ్యవహారం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూరేలా ఈ ఇద్దరూ కలిసి టూర్స్ వేస్తుండటం మరిన్ని అనుమానాలు లేవనెత్తింది. ఈ నేపథ్యంలో జాన్వీ చేసిన ఈ ప్రాక్టీకల్ మ్యారేజ్ కామెంట్ వీళ్ళ డేటింగ్ గురించే అని చెప్పుకుంటున్నారు జనం.

సోషల్ మీడియాలో మరో అరుదైన ఫీట్ సాధించిన సూపర్ స్టార్.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియాలోనే అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరో. ముఖ్యంగా మహేష్‏కు అమ్మాయిల్లో ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉండే సూపర్ స్టార్.. మరోవైపు యాడ్స్ షూటింగ్స్‏తో క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఇక ఇటీవలే బుల్లితెరపై సందడి చేసి ఫ్యామిలీ ఆడియన్స్‏ను ఆకట్టుకున్నారు. అయితే వరుస ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నా.. కాస్త సమయం దొరికినప్పుడల్లా నెట్టింట సందడి చేస్తూ ఫాలోవర్లతో టచ్‏లో ఉంటారు.

ఆయన చేసే ఒక్కో పోస్ట్‏కు భారీగా లైక్స్, షేర్స్, కామెంట్స్ వస్తుంటాయి. ఇక తన ఫ్యామిలీ విషయాలే కాకుండా మూవీ అప్డేట్స్ సైతం షేర్ చేస్తుంటారు మహేష్. తాజాగా సోషల్ మీడియాలో అరుదైన ఫీట్ సాధించారు.మహేష్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 13 మ మిలియన్లకు చేరువలో ఉంది. తాజా సమాచారంతో దక్షిణాదిలోనే ఎక్కువమంది ఫాలో అవుతున్న హీరోగా నిలిచాడు మహేష్.

ఇటీవలే తన కూతురు సితార క్లాసికల్ డ్యాన్స్ వీడియో షేర్ చేస్తూ తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేసిన ఒక్క పోస్టుకు లైక్స్, కామెంట్స్, షేర్స్ వర్షంలా కురిసాయి. ఇక మహేష్ ఖాతాలో అరుదైన రికార్డ్ జత కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.ఇదిలా ఉంటే. ప్రస్తుతం మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఇక ఈ సినిమా తర్వాత మహేష్… దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ ప్రాజెక్ట్ రానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh