kamal haasan: ఇండియన్ 2 లో విలన్‌ ఎవరో తెలుసా ?

kamal haasan

kamal haasan: ఇండియన్ 2 లో విలన్‌ ఎవరో తెలుసా ?

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో లోకనాయకుడు కమల్ హాసన్  ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్ గా వస్తుంది.

కమల్ ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమాలో తానే కథానాయకుడు, ప్రతినాయకుడు పాత్రలో కనిపించాడు.

దీంతో ఆ చిత్రం ఎండింగ్ లో నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చనిపోతుంది.

అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ లో విలన్ గా ఎవరు కనిపించబోతున్నారు అనే దాని పై ఎంతో ఆసక్తి నెలకొన్న  నేపధ్యంలో  తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా ఎస్‌.జె.సూర్య నటించనున్నట్లు తెలిసింది.

కమల్‌హాసన్‌తో పోటాపోటీగా ఆయన పాత్రసాగుతుందని, ఈ ఇద్దరి మధ్య వచ్చే ఎపిసోడ్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశలో ఉంది.

మరోవైపు శంకర్‌ డైరెక్షన్‌లో రాంచరణ్‌ హీరోగా వస్తున్న గేమ్‌ చేంజర్‌లో ఒక  రోల్ చేస్తున్నాడు.

ఇండియన్‌ 2 చిత్రంలో బాబీ సింహా, సిద్దార్థ్‌, స‌ముద్రఖని, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌ ఇత‌ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.   కాజల్ అగర్వాల్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది.

ఇండియన్‌ 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఇప్పటికే విడుదలైన ఇండియన్ 2 ఫస్ట్‌ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కమల్ హాసన్‌ మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో 234వ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇండియన్ 2 పూర్తయ్యాక ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు.

అయితే అనుకున్న విధంగా అన్ని జరిగితే మాత్రం సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఒకవేళ షూటింగ్ ఆ సమయానికి పూర్తి కాకపోతే మాత్రం మరింత ఆలస్యం కావచ్చును వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh