ఫ్రీ కరెంటు మేం ఇస్తున్నట్టు, నువ్వు కాదు – బండి సంజయ్‌

bandi sanjay comments on 24 hours power, ts bjp News, TS Politics, Political News, TS News Updates, Telugu News Updates, Telangana News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వ పై మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.  24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి తప్పకుంటానని ఇదివరకే అయన సంచలన ప్రకటన చేశారు. ఈ సారి మరో మారు మల్లీ అయన 24 గంటల ఉచిత విద్యుత్ పై కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేసారు. 24 గంటల కరెంటు ఇస్తానన్నవ్… కానీ డిస్కంలకు పైసలు కట్టవ్.. ప్రభుత్వ కార్యాలయం బిల్లులు చెల్లించడం లేదు.. డిస్కంలకు నువ్వు బకాయి పడ్డ పైసలు రాబోయే బిజెపి ప్రభుత్వం కట్టాల్సి వస్తది.. అంటే ఫ్రీ కరెంటు మేం ఇస్తున్నట్టు… నువ్వు కాదు… అంటు బండి సంజయ్ ట్విట్టర్ లో తెలిపారు.

https://mobile.twitter.com/bandisanjay_bjp/status/1616017468870512641

వారి ట్విట్ కు బదులుగా కొంతమంది బి.ఆర్.ఎస్ నాయకులు గటుగానే స్పందించారు. నోటికొచ్చినట్లు విమర్శించడం సరి కాదని హితవు పలికారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 24 గంటల్లో ఏదో ఒక గంట.. ఆయనకు ఇష్టమున్నప్పుడు కరెంటు తీగలు పట్టుకొని చెక్‌ చేసుకోవచ్చని  ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ సభకు అనూహ్య స్పందన రావడంతో జీర్ణించుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి:  

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh