ఫైర్‌బ్రాండ్‌‍ జగ్గారెడ్డి లవ్ స్టోరీ..

Valentine's day Special

ఫైర్‌బ్రాండ్‌‍ జగ్గారెడ్డి లవ్ స్టోరీ..

ఫైర్ నేతల్లో ఒకరు అయిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆయన ఏం చేసినా తన స్టైలే వేరంటారు ఆ ఎమ్మెల్యే. తన లవ్ స్టోరీని కూడా విద్యార్థులతో పంచుకున్నారు. ఆయనే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఫైర్‌బ్రాండ్‌‍గా పేరు తెచ్చుకున్న ఆయన లవ్ స్టోరీ ఎలా సాగిందో తెలుసుకుందాం.ఓ లవ్ స్టోరీ నడిపారంటే నమ్మడం కష్టమే. టీనేజ్‌లో ఉన్నప్పుడే ఆయన ప్రేమలో పడ్డారు. టెన్త్ పాసై  ఇంటర్ ఫెయిలైన జగ్గారెడ్డి 16 ఏళ్ల వయసులో చదువు ఆపేసి.. రాజకీయాల్లోకి వచ్చేశారు. 19 ఏళ్ల మున్సిపల్ కౌన్సిలర్ అయ్యారు. 31 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలిచారు. పైకి గంభీరంగా కనిపించే జగ్గారెడ్డిలో. ఓ లవర్‌బాయ్ ఉన్నాడు. పదో తరగతి చదివేటప్పుడే ఓ అమ్మాయి వెంటపడ్డారు. ప్రేమలో నిండా మునిగారు. ఓ రోజు తన మనసులో మాటను ఆమెకు చెప్పేశారు. అటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో  ఆయనలో ఏదో తెలియని విజయానందం.

ప్రేమ తో నిండిన ఆయన ప్రేమ వల్ల  ఆమె స్టడీస్‌కి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు   అనుకున్నారు. అందుకే ఆమెను బాగా చదువుకోనిచ్చారు. ఫలితంగా ఆమె ఇంటర్ బైపీసీ, డిగ్రీలో బీకామ్ చదివారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందారు. ఆమెను పెళ్లి చేసుకున్న జగ్గారెడ్డి  ఉద్యోగం మాన్పించేసి కుటుంబ బాధ్యతలు ఆమెకు అప్పగించారు.ఆయన సతీమణి  నిర్మల గారు. వీరికి ఇద్దరు సంతానం కూతురు జయారెడ్డి, కొడుకు భరత్ రెడ్డి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అంటే అత్యంత గౌరవం అని చెప్పిన సతీమణి నిర్మల ఆయన మాటే తన మాట అని తెలిపారు. ఏం చేసినా ప్రజా సేవకు కట్టుబడి ఉన్నారనీ. అందుకే ఈ స్థాయికి ఎదిగారని ఆమె తెలిపారు. తనకు ప్రపోజ్ చేసేనాటికే జగ్గారెడ్డి  మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్నారన్న ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కానీ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని తెలిపారు. ప్రస్తుతం నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి  మున్సిపాలిటీ పరిధిలో 7 వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh