రోడ్డుకెక్కిన మంచు ఫ్యామిలీలో గొడవలు

Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డుకెక్కిన మంచు ఫ్యామిలీలో గొడవలు

మంచు ఫ్యామిలీలో గొడవలు రోడ్డు కెక్కాయి.డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు  మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ ఇంటిపై మంచు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మంచు మనోజ్‌కు సన్నిహితుడైన సారథి అనే వ్యక్తిపై మంచు విష్ణు చేయిజేసుకున్నట్టుగా తెలుస్తోంది. నిన్న రాత్రి ఆఫీసులో ఏవో చిన్న గొడవ అయ్యినట్టు తెలుస్తుంది. దానితో మోహన్ బాబుకు తమ్ముడు వరస అయ్యిన సారధి ఇంటికి మంచు మనోజ్ మంచు లక్ష్మీ వచ్చారు.  తరువాత  మంచు  విష్ణు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపద్యం జరిగిన సంఘటను ఈ మేరకు మంచు మనోజ్ ఓ వీడియోను షేర్ చేశాడు. ఇలా ఇంటి మీదకు వచ్చి దాడి చేస్తాడంటూ విష్ణు విజువల్స్‌ను మనోజ్ షేర్ చేశాడు. అయితే ఈ విజువల్స్‌లో మంచు విష్ణు కనిపించాడు. ఒరేయ్ అరేయ్ అని ఏదో అంటున్నాడు కదా? అని విష్ణు అరుస్తున్నాడు. విష్ణుని అందరూ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో అండి ఇలా ఇంటి మీదకు వచ్చి అందరినీ కొడుతుంటాడు అంటూ తన అన్న గురించి వీడియోను షేర్ చేశాడు మంచు మనోజ్.

అయితే మంచు వారింట్లో ఇలాంటి ఏదో జరుగుతోందనే రూమర్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి . మంచు సోదరుల మధ్య మంచి బంధాలు లేవనే టాక్ వస్తూనే ఉంది. మంచు మనోజ్ గురించి మాట్లాడను అది వాడి పర్సనల్ అంటూ ఆ మధ్య ఓ సారి మంచు విష్ణు అన్నాడు. ఎవ్వరికీ తాను సలహాలు ఇవ్వను అంటూ తన తమ్ముడి గురించి పరోక్షంగా స్పందించాడు విష్ణు.

మంచు మనోజ్  భూమా మౌనిక రెడ్డి పెళ్లి మనోజ్ అక్క లక్ష్మీ ఇంటిలో జరిగింది. అక్కడికి వచ్చి ఏదో గెస్ట్ హోదాలో  అలా వచ్చి వెలిపోయాడు. కానీ మంచు వారి సంబరాలు, వారి ఫోటోలు, వీడియోల్లో ఎక్కడా కూడా మంచు విష్ణు కనిపించలేదు. అప్పుడే అందరికీ కన్ఫామ్ అయింది. ఇలాంటి గొడవలేవో జరుగుతున్నాయని అంతా అనుకున్నారు. ఇప్పుడిలా వారంతటా వారే రోడ్డున పడ్డారు.

వీరిద్దరి మధ్య ఎంతో కాలం నుంచి గ్యాప్ మెయింటైన్ అవుతూనే ఉంది. మా ఎన్నికల్లోనూ ఎక్కువ యాక్టివ్‌గా లేడు. మంచు ఫ్యామిలీతో అంటీ అంటనట్టుగానే ఉంటున్నాడు మంచు మనోజ్. ఇక అక్క మంచు లక్ష్మీతో మాత్రం మనోజ్ బాగానే ఉంటున్నాడు. ఈ రెండో పెళ్లిని సైతం మంచు లక్ష్మే ముందుండి నడిపించినట్టు తెలుస్తోంది.

మంచు విష్ణు పవన్ కళ్యాణ్‌ మధ్య కోల్డ్ వార్ జరిగిన సమయంలోనూ మంచు మనోజ్ కొత్త స్టాండ్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ మీద మంచు విష్ణు కామెంట్లు చేయడం, ఆ టైంలో మంచు విష్ణుని తెగ ట్రోల్ చేయడం అందరికీ తెలిసిందే. గొడవ అలా పెరుగుతూ ఉంటే.. సద్దుమణిగేలా చేసేందుకు పవన్ కళ్యాణ్‌ను పర్సనల్‌గా వెళ్లి కలిశాడు మనోజ్. అయితే అప్పుడు అన్న కోసం వెళ్లాడా? లేదా ఇంకేదైనా కారణమై ఉంటుందా? అన్నది ఇప్పుడు చర్చకు వస్తోంది.

అయితే అసలు ఈ గొడవలు భూమా మౌనిక వల్లే ఏర్పడ్డాయా? లేదా మంచు వారి అంతర్గత విషయాలు, ఆస్తుల వల్ల జరిగిందా? అన్నది తెలియడం లేదు. అసలే మంచు విష్ణు భార్య విరానిక రెడ్డి జగన్ బంధువు. భూమా మౌనిక టీడీపీ వర్గానికి చెందిన వ్యక్తి. ఇలా ఇంట్లోనే రెండు ప్రధాన పార్టీలకు సంబంధించిన వ్యక్తులున్నారు. ఈ గొడవల్లో ఏమైనా రాజకీయ హస్తం ఉందా? అన్నది కూడా ఇంకా తెలియాలిసివుంది

 

Leave a Reply