తారకరత్న చికిత్స కోసం బాలయ్య కీలక నిర్ణయం

balakrishnas key decision for tarakaratna

తారకరత్న చికిత్స కోసం  బాలయ్య కీలక నిర్ణయం

తారకరత్న ఆరోగ్యం విషయంలో బాబాయ్ బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నందమూరి తారక రత్న బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా  విషయం  అందరకు తెలిసిందే. కుప్పం ఆస్పత్రిలో చికిత్స చేయించి అక్కడ నుంచి బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారక రత్న ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.

నందమూరి తారక రత్న ఆస్పత్రిలో విదేశీ వైద్యుల టీంతో చికిత్స అందిస్తున్నారు. కుప్పం నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన సమయం నుంచి ఆస్పత్రిలోని నిపుణుల టీం చికిత్స కొనసాగిస్తోంది. గుండె సంబంధింత సమస్య తగ్గిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మెదడు సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఇంకా కోమాలోనే ఉన్నారు. ఆయన వైద్యం గురించి నందమూరి బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అటు వైద్యులతో మాట్లాడుతూ చికిత్స విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. మెదడులో వాపు ఉన్నట్లు గుర్తించిన న్యూరో వైద్యులు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తరువాత న్యూరో చికిత్స మొదలు అవుతుందని చెబుతున్నారు. ప్రతీ క్షణం ప్రత్యేక వైద్యుల టీం తారకరత్న ఆరోగ్యం పైన సమీక్షీస్తోంది.

ఇప్పుడు తారకరత్న కోసం వైద్య రంగంలో ప్రముఖుల సూచనలు సలహాలు తీసుకుంటున్నారు. నారాయణ ఆస్పత్రి వైద్యులు అంకిత భావంతో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో తారకరత్న కోలుకోవాల ని బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అఖండ దీపానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బత్తలాపురంలో మృత్యుంజయస్వామి ఆలయంలో సుమారు 44 రోజుల పాటు ఈ అఖండ జ్యోతి వెలిగేంచేలా చేస్తున్నారు. ఓ పక్క ప్రత్యేక పూజలు చేస్తూనే ఆస్పత్రి వైద్యులతో నిరంరతం సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. తారకరత్న కోలుకొనే వరకూ షూటింగ్స్ కు దూరంగా ఉండాలని బాలయ్యనిర్ణయం  తిసుకున్నట్లు సమాచారం. ఎన్బీకే 108  సినిమా షూటింగ్ కూడా  ప్రారంభమైంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ, తారకరత్న హెల్త్ కండీషన్ కారణంగా బాలయ్య షూటింగ్ వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh