థాక్రేకు తలనొప్పిగా మారిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రంలో ‘పొత్తులపై’ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని తేల్చి చెప్పిన ఆయన ఎన్నికల తరువాత పొత్తులుంటాయని.అది కూడా బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఉంటుందని ఆయన చెప్పడం విడురంగా వుంది. ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. అయితే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కు తలనొప్పిగా మారాయి. అయితే ఈ సమస్యను ఆయన ఎలా పరిష్కరిస్తారు. నేటి సమావేశంలో ఆయన ఏం చెప్పబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోమటిరెడ్డిపై ఈ సారైనా చర్యలు తీసుకుంటారా? లేక మరో ప్రత్యామ్నాయ మార్గం చూపుతారా అనేది నేటి సమావేశంలో తేలిపోనుందని సమాచారం.
అసలు కోమటిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో కూడా ఆయన తీరు సొంత పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక అప్పట్లో కాంగ్రెస్ కు నష్టం కలిగిస్తున్నాయి. అంతేకాదు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. గతంలోనే కోమటిరెడ్డిపై చర్యలు తీసుకుంటే ఇంతవరకు వచ్చేది కాదని, ఇప్పటికైనా ఆయనపై చర్యలు తీసుకోవాలని రేవంత్ వర్గం డిమాండ్ చేస్తుంది. కాగా ఉదయం ఢిల్లీలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ రాగానే మార్చేశారు. రాష్ట్రంలో హంగ్ వస్తుందని తాను అనలేదు. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పిందే తాను చెప్పానని అన్నారు. పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హంగ్ వస్తుందని, బీఆర్ఎస్ హోం కాంగ్రెస్ పొత్తు ఉంటుందని తాను అనలేదని తెలిపారు. నేను తప్పు చేయలేదు, రాద్ధాంతం చేయొద్దని అన్నారు. నేను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, సోషల్ మీడియాలో వచ్చిన సర్వేల ఆధారంగా ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఆయా పార్టీల బలాలు తెలుస్తాయి అని చెప్పాను.
నేను మార్నింగ్ చేసిన వ్యాఖ్యలు అర్ధం చూసుకునేదాన్ని బట్టి ఉంటుందన్నారు. నా వ్యాఖ్యలను బిజెపి నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఇక కోమటిరెడ్డి న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మాణిక్ రావు థాక్రే తెప్పించుకొని చూసినట్లు తెలుస్తుంది. అలాగే నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న మాణిక్ రావు థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే నేడు కాంగ్రెస్ నాయకులతో థాక్రే సమావేశం కానున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపైనే ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అయితే కోమటిరెడ్డి వివరణ తీసుకున్న తరువాత దానిని ఏఐసీసీకి పంపనున్నారు.
ఇది కూడా చదవండి :