ఎన్టీఆర్ కు మరో అరుదైన గౌరవం కేంద్రం నిర్ణయం

tr-honoured-by-central-govt-with-his-image-on-100-rupee-coin

ఏపీ లో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేసిన ప్రభుత్వం టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టింది. హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం వివాదాదస్పదంగా మారింది.అయితే ఇక, ఇప్పుడు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో  మరో సారి తెలుగు రాజకీయాల్లో చర్చకు కారణమవుతోంది.  ఎన్టీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.  కొద్ది నెలల క్రితం జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ ఇప్పుడు ఈ నిర్ణయంతో బీజేపీ రాజకీయ వ్యూహాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది.  తెలుగు రాజకీయాల్లో సంచలనంగా. ప్రజా సేవలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ కు గుర్తుగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్ ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. పూర్తిగా వెండితో రూ.100 కాయిన్ తయారు కానుంది.  ఈసందర్భంగా మింట్ అధికారులు దగ్గుబాటి పురందేశ్వరిని కలిశారు. నమూనాను చూపించి అధికారులు సలహా కోరారు.  పురందేశ్వరికి వారు ఈ వెండినాణేన్ని, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ను చూపించారు.  ఈ నమూనాకు పురందేశ్వరి ఓకే చెప్పారని సమాచారం. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ రూ.100 నాణెం బయటికి రానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి.  ఈ సందర్భంలో ఈ కాయిన్ విడుదల కానుంది.

తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ ఇమేజ్ చెక్కు చెదరని ముద్ర వేసుకుంది.  తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా బలోపేతం కావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ మునుగోడు ఉప ఎన్నిక వేళ హైదరాబాద్ కేంద్రంగా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు.  ఆ భేటీ రాజకీయంగానే జరిగిందని పలువురు బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దీని పైన స్పందించలేదు. ఇక మరోసారి బీజేపీతో పొత్తు దిశగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ నేతలు మాత్రం మరోసారి టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. అటు ఏపీలో టీడీపీ స్థానంలోకి ఎదగాలనేది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ సమయంలో బీజేపీ నేతలు సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త లెక్కలతో రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం అవుతోంది.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మతో వెండి కాయిన్ అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో కీలక ఘటనలు ప్రముఖుల గుర్తుగా ఈ నాణేలను విడుదల చేయటం 1964 నుంచి ఈ విధంగా నాణేల విడుదల ప్రారంభం అయింది. గతంలో దివంగత ప్రధాని వాజ్ పేయ్ బొమ్మతో ఇదే తరహాలో నాణెం విడుదల చేసారు.  ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మతో విడుదలకు రంగం సిద్దమవుతోంది.  గతంలోనే ఎన్టీఆర్ కు భారత రత్న ప్రకటన అంశంలోనూ నాటి వాజ్ పేయ్ ప్రభుత్వం ముందుకు వచ్చినా.  నాడు చంద్రబాబు కారణంగానే సాధ్యపడలేదని కొద్ది రోజుల క్రితం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల వేళ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తిసుకుంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh