కల్లుగీత కార్మికులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గీత కార్మికుల కోసం ఏపి ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది. 2022 నుంచి 2027 వరకు కల్లు గీత గీత పాలసీని తీసుకొచ్చింది. ఈవృత్తిపై ఆధారపడిన కార్మికుల సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022 నుంచి 2027 వరకు కాలానికి కల్లు మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల కోసం ఈ విధానాన్ని ప్రకటించారు. ఈపాలసీతో రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మిక కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. కల్లుగీత లైసెన్సింగ్ విధానం కూడా అత్యంత పారదర్శకంగా జరిగేలా పాలసీని రూపొందించారు.
అలాగే కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఇందులో రూ.5 లక్షలు వైఎస్సార్ బీమా ద్వారా.. మిగిలిన రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. కల్లు గీత కార్మికుడు సహజ మరణం చెందితే అతని కుటుంబానికి వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల పరిహారం అందుతుంది.
CM Revanth Reddy Government Given Responsibility Of Collecting Electricity Bills To Adani Group హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని అధికారులకు కరెంట్ ఛార్జీల వసూళ్లు…
ఒడిశాలో రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించిన , క్షతగాత్రులను పరామర్శించనున్నా: ప్రధాని మోదీ ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 238 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రధాని…