కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న న్యూజిలాండ్‌

New Zealand won the match by just one run

 కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న న్యూజిలాండ్‌

మ్యాచ్‌ అంటే ఇదే అనేలా  అసలు సిసలైన క్రికెట్ మజా చూపించిన మ్యాచ్‌ ఇది. టెస్టు క్రికెట్‌లో ఉండే కిక్కును కళ్లకు కట్టిన మ్యాచ్‌లో న్యూజీలాండ్‌ గేమ్‌ను పట్టేసింది. రెండో టెస్టులో వెల్లింగ్టన్‌ వేదికగా ముగిసిన న్యూజిలాండ్‌ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్నిసొంతం చేసుకుంది.  258 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 256 పరుగులకు ఆలౌటైంది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన ఈ మ్యాచ్‌లోఒకసారి మ్యాచ్‌ ఇంగ్లండ్‌ వైపు మారితే మరోసారి న్యూజిలాండ్‌  చేతిలోకి వచ్చింది. చివరకు ఒకే ఒక్క పరుగుతో  ఇంగ్లండ్‌ను  ఓడిపోయాలే చేసింది. అయితే ఆ ఒక్క పరుగే న్యూజిలాండ్‌ పరువు నిలిపింది.

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకొని పరువు నిలుపుకుంది ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 435/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. హరీ బ్రూక్(176 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్స్‌లతో 186), జోరూట్(224 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 153 నాటౌట్) సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(4/100) నాలుగు వికెట్లు తీయగా  మైఖేల్ బ్రేస్‌వెల్(2/54) రెండు వికెట్లు పడగొట్టాడు. టీమ్ సౌథీ, నీల్ వాగ్నర్ తలో వికెట్ తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 209 పరుగులకు కుప్పకూలింది. దీంతో కివీస్‌ను ఇంగ్లండ్‌ ఫాలోఆన్‌ ఆడించింది అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ సెంచరీతో​ మెరవడంతో 483 పరుగులకు ఆలౌటైంది.

దీంతో ఇంగ్లండ్‌ ముందు 258 పరుగుల టార్గెట్‌ను సెట్ చేసింది. ఫాలో అన్ ఆడి న్యూజీలాండ్‌ గెలవడం ఈ మ్యాచ్‌లో అన్నిటికంటే హైలెట్  ఇలా జరగడం టెస్టు క్రికెట్‌లో ఇది నాలుగో సారి తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన జో రూట్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు  ఐదు పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్న రూట్‌ 95 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇదే మ్యాచ్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది  రూట్‌ ఉన్నంతవరకు ఇంగ్లండ్‌ విజయం దిశగానే నడిచింది. అయితే మధ్యలో కివీస్‌ బౌలర్లు ఫుంజుకొని వికెట్లు తీయడంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. ఇలా అటు ఇటు తిరిగి ఓవర్‌ ఓవర్‌కు గెలుపు దోబూచులాడింది. న్యూజీలాండ్‌ బౌలర్లు పట్టు కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు అనుకున్న రిజల్ట్ సాధించారు. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన దశలో అండర్స్‌ వాగ్నర్‌ బౌలింగ్‌లో టామ్‌ బ్లండెల్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఇంగ్లండ్‌ కథ ముగిసింది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh