కుష్బూకి కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యత రియాక్ట్ అయిన మెగాస్టార్

Megastar reacts to Khushboo

కుష్బూకి కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యత రియాక్ట్ అయిన మెగాస్టార్

టాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌ కి కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యత అప్పజెప్పింది. జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా కుష్బూని అప్పాయింట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప‌ద‌విలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు కుష్బూ. అయితే తనకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన కుష్బూ భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదికి స్పెషల్ ధన్యవాదాలు  చెప్పింది ఆమె అయితే కుష్బూకి ఈ బాధ్యత ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా చిరంజీవి రియాక్ట్ అయ్యారు ట్విట్ట‌ర్ వేదికగా ఖ‌ష్బూ  కంగ్రాట్స్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి క‌చ్చితంగా ఈ పదవికి మీరు అర్హురాలు అని అన్నారు.

నీ వల్ల జాతీయ మ‌హిళా క‌మీష‌న్ మరింత శక్తివంతం అవుతుందని, మ‌హిళ‌ల‌ స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెరిగి వాటి ప‌రిష్కారాలు కూడా స‌మ‌ర్ద‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారని పేర్కొంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ట్విట్ట‌ర్ వేదికగా ఖ‌ష్బూ సుంద‌ర్‌కి కంగ్రాట్స్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.  ఆయన  అభినందనలు చూసి కుష్బూ అదే సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయింది. థాంక్యూ వెరీ మచ్ సర్ మీరు మాట్లాడిన మాటలు నాకెంతో ఉత్తేజాన్ని ఉత్సహన్ని ఇచ్చాయి. నా శక్తికి మించి ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నా అంటూ రిప్లై ఇచ్చింది కుష్బూ. సినీ రంగంలో ఖుష్బూకి చిరంజీవికి మధ్య మంచి ఫ్రెండ్‌‌షిప్ ఉంది. వీరిద్దరూ క‌లిసి స్టాలిన్ సినిమాలో న‌టించారు. రీసెంట్‌గా ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లోనూ నటించారు. కుష్బూకి దక్కిన ఈ గౌరవం పట్ల మెగా ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. చివరగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కనిపించింది కుష్బూ. ఆ తర్వాత మరే సినిమా ఓకే చేయలేదని టాక్. అయితే ఇప్పుడు జాతీయ మ‌హిళా క‌మీష‌న్ లో ఈ కీలక బాధ్యత దక్కడంతో ఆమె ఇక పూర్తి సమయాన్ని అందుకే కేటాయిస్తుందని చెప్పుకోవచ్చు. కొంతకాలం రాజకీయ ప్రయాణం చేసిన చిరంజీవి ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh