వైసీపీ నేతలకు బస్తీమే సవాల్ అంటున్న మేకపాటి

mekapati Chandrasekhar Reddy :వైసీపీ నేతలకు బస్తీమే సవాల్ అంటున్న మేకపాటి

ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పంచుమర్తి అనురాధకు ఆయన ఓటు వేశారనే వార్తలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారని, దీనికి అంగీకరించకపోవడం వల్లే క్రాస్ ఓటింగ్ చేశారనే వాదనలు వినిపిస్తోన్నాయి.
ఈ నేపద్యం లో వైసీపీ నుంచి సస్పెండైన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేడు హల్ చల్ చేశారు. వైసీపీ నేతలకు బస్తీమే సవాల్ అంటూ ఉదయగిరి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుకున్నారు. గత కొద్దిరోజులుగా వైసీపీ నేతలు విసురుతున్న సవాళ్లకు స్పందించిన మేకపాటి రండి చూసుకుందాం అంటూ ప్రతిసవాల్ విసిరారు.
ఉదయగిరికి చెందిన వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి గత కొన్ని రోజులుగా వరుసగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉదయగిరిలో వైసీపీ టికెట్ ఆశిస్తున్న ఆయన మేకపాటిని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. మేకపాటి ఉదయగిరి వస్తే తరిమి కొడతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో కొన్నిరోజులుగా వేచి చూసిన మేకపాటి.. ఇవాళ స్ధానిక బస్టాండ్ సెంటర్ కు వచ్చారు. అక్కడే కుర్చీ వేసుకుని కాసేపు కూర్చుకున్నారు. దమ్ముంటే రావాలని ప్రతిసవాల్ విసిరారు.

వైసీపీ నుంచి తాజాగా మేకపాటిని సస్పెన్షన్ చేయడంతో స్ధానికంగా పలువురు వైసీపీ నేతలు వరుసగా ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. దీంతో కొంతకాలంగా బెంగళూరులో ఉంటున్న మేకపాటి తాజాగా నిన్న ఉదయగిరి కి చేరుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరి కి రానివ్వమని, ఇక్కడి నుంచి తరుముతామన్న పలువురు నేతల ఛాలెంజ్ ను ఆయన స్వీకరించారు. ఉదయగిరి బస్టాండ్ వద్దకు వచ్చి గంటసేపు కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఎవరు వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే ఇక్కడికి వచ్చి దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని సవాల్ చేశారు. దీంతో బస్టాండ్ సెంటర్ వద్ద భారీగా పోలీసులు, మేకపాటి అభిమానులు చేరుకున్నారు

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh