ఆంద్ర,తెలంగాణ లలో రేపటి నుంచి ప్రారంభం కానున్న టెన్త్ క్లాస్ పరీక్షలు

AP & TS 10th PUBLICK Exams: ఆంద్ర,తెలంగాణ లలో రేపటి నుంచి ప్రారంభం కానున్న టెన్త్ క్లాస్ పరీక్షలు

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవారం (3-ఏప్రిల్-2023) నుంచి జరగనున్నాయి. అసలే కరోనా కేసులు పెరుగుతున్న సమయం కావడంతో అధికారులు ఈ పరీక్షలకు బాగా ఏర్పాట్లు చేశారు.  ఈసారి 4,94,620 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. వీరిలో 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులు. వీరంతా ఎగ్జామ్స్ రాసేందుకు మొత్తం 2,652 ఎగ్జామ్ హాల్స్ రెడీగా ఉన్నాయి. ఈసారి మొత్తం 6 పేపర్లు ఉండగా సిలబస్‌లో కోతలేవీ లేకుండా మొత్తం ఉంది.

ఈ పరీక్షల టైమ్ చూస్తే ఉదయం 9.30కి పరీక్ష మొదలవుతుంది. మధ్యాహ్నం 12.30కి ముగుస్తుంది. అంటే సంవత్సరమంతా చదివింది విద్యార్థులు ఆ 3 గంటల్లో పేపర్‌పై పెట్టాలి. ఇదే అసలు సవాలు. ఈ పరీక్షలు ఏప్రిల్ 13 వరకూ కొనసాగుతాయి. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి వెళ్లడం మేలు. ఒకవేళ రాంగ్ కేంద్రానికి వెళ్తే తిరిగి సరైన కేంద్రానికి వెళ్లేందుకు వీలవుతుంది. ఆలస్యంగా వెళ్లడం ప్రమాదకరం. 9.35 లోపు వచ్చిన వాళ్లనే ఎగ్జామ్ హాల్ లోకి పంపుతామని అధికారులు తెలిపారు.

అలాగే ఏపీలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు టెన్త్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో   ఆంద్రపదేశ్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్  (BSEAP) హాల్ టికెట్లను విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు http :www.bse.ap.gov.in    వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రాష్ట్రంలో 6,10,000 మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే విద్యార్దులు 9.35 లోపు వచ్చిన వాళ్లనే ఎగ్జామ్ హాల్ లోకి పంపుతామని అధికారులు తెలిపారు.

ఎండాకాలం కదా తాగునీటితోపాటూ ORS కూడా ఉంచారట. అలాగే వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ ఎంతో హాయిగా పరీక్షలు రాయవచ్చు.

టెన్త్ విద్యార్థుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం వారు తమ హాల్ టికెట్‌ను కండక్టర్‌కి చూపించాలి. అది వారికి టికెట్‌తో సమానం.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh