Telangana Politics: భారీ చేరికలు దిశగా కాంగ్రెస్

Telangana Politics

Telangana Politics: భారీ చేరికలు దిశగా కాంగ్రెస్

Telangana Politics: రానున్న ఎన్నికల నేపధ్యం లో  తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆయా రాజకీయ పార్టీలు వారి బలాన్ని పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. భారీ చేరికల దిశగా ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్ , ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ టూర్ లో చేరికలు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ లో అసంతృప్తితో ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారు.

ఇప్పటికే ఇద్దరు కీలక నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరిక దాదాపు ఖాయం అయింది. ప్రియాంక గాంధీ Telangana Politics లో పర్యటన సమయంలో ఈ ఇద్దరితో పాటుగా మరి కొందరు చేరికలకు టీపీసీసీ నాయకత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

అయితే బీఆర్ఎస్ లో టిక్కెట్ దక్కని నేతలు, బీజేపీలోకి వెళ్లి అసంతృప్తిగా ఉన్న వారిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి భారీ చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో జనరల్ ఎలక్షన్స్ ఉండటంతో చేరికలతో ఉత్సాహం తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తోంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అక్కడ నాగం జనార్ధన్ రెడ్డి అంగీకరిస్తే దామోదర్ రెడ్డికి లైన్ క్లియర్ అవుతుంది. నిర్మల్ లో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ వీడటంతో ఆ గ్యాప్ పుల్ చేసుకునే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. నిర్మల్ లో బీఆర్ఎస్ నేత శ్రీహరి రావును చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఆ మేరకు శ్రీహరి రావుతో చర్చలు పూర్తి చేసింది.

కాంగ్రెస్ కు ప్రజల లో  అధిక సంఖ్య లో ఓటు బ్యాంకింగ్ వుడండంతో లీడల్లా కోసం వేట ప్రారంభిచింది. అయితే ఇప్పటికే ప్రముఖ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు గేలo  వేస్తున్నారు . అయితే ఎలాగైనా  ఈ సారి Telangana Politics లో అధికారం లోకి వచ్చే దిశగా పక్క వ్యూహ రచన చేస్తున్నాట్టు  సమాచారం.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh