హాస్యబ్రహ్మీకి మెగాస్టార్ బర్త్ డే విషెస్..
టాలీవుడ్ హాస్యబ్రహ్మా బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు హాస్య నటుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మానందం కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. “నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక లెక్చరర్. ఈరోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కెక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చెయ్యక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లి విరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మానందానికి హృదయ పూర్వక శుభాభినందనలు. బ్రహ్మనందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ.మరో పది మందిని నవ్విస్తూ ఉండాలని.. బ్రహ్మానందంకి మరింత బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండాలని..తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని మనస్పూర్తిగా ఆశిస్తూ. తనకి నా జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్.
తెలుగు చిత్రపరిశ్రమలో బ్రహ్మానందం గురించి ప్రత్యేక చెప్పక్కర్లేదు.కొన్ని వందల చిత్రాల్లో తన కామెడీతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. ప్రతి సినిమాలోనూ తన నటనతో,కామెడీతో ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. బ్రహ్మానందం ఒక్కరున్నారంటే సినిమాలో కామెడీకి కొదువుండదు అనే నమ్మకం దర్శకనిర్మాతలలో ఉండిపోయింది. ఆయన డేట్స్ కోసం స్టార్ హీరోస్ వెయిట్ చేసేవారు. కేవలం డైలాగ్స్ తోనే కాదు. తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కామెడీని పండించేవారు. దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరు లిఖించుకున్నాడు హాస్య నటుడు పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత బ్రహ్మానందం గారికి మరొక సారి మాతరుపున జన్మదిన శుభాకాంక్షలు.
ఇది కూడా చదవండి: