Rajanikanth: మీనా కూతురు మాటలకు తీవ్ర భావోద్వేగానికి

Rajanikanth

Rajanikanth: మీనా కూతురు మాటలకు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యిన

Rajanikanth: నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి మీనా. దక్షిణాది  చిత్రపరిశ్రమలో ఒకప్పుడు అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో మీనా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

తెలుగుతోపాటు తమిళంలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిoది  మీనా కెరియర్ పీక్స్ లో ఉండగానే 2009లో బెంగళూరుకి చెందిన విద్యాసాగర్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది మీనా. వీరికి ఒక పాప కూడా జన్మించింది. మీనా కూతురి పేరు నైనిక ఇక మీనా భర్త గతేడాది జూన్ లో మరణించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తుంది మీనా. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా నటిగా 40 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల చెన్నైలో మీనాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ వేడుకలకు తమిళ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ నటీనటులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ Rajanikanth ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకలో తన తల్లి గురించి మీనా కూతురు నైనిక మాటలకు Rajanikanth భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి మరణం తర్వాత అమ్మ మానసిక ఒత్తిడికి గురైందని.. అదొక పెయిన్ ఫుల్ టైమ్ అంటూ నైనిక మాట్లాడగా.. అక్కడే ఉన్న రజనీ తోపాటు ఇతర సినీ తారలు కన్నీళ్లు పెట్టుకున్నారు.

మీనా కూతురు నైనిక మాట్లాడుతూ.. “అమ్మా.. నువ్వు ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నాను. ఒక నటిగా నువ్వు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటావు. వర్క్ పరంగా నటివే అయినా ఇంటికి వచ్చాక అలా ఉండవు.

అయితే ఒక అమ్మగా నన్ను ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకుంటావు నా చిన్నప్పుడు మనమంతా ఓ మాల్ కు వెళ్లాం. మీతో చెప్పకుండా నేను వేరే షాపుకు వెళ్లి చాక్లెట్స్ తింటూ కూర్చున్నాను. చాలా సేపటి తర్వాత నువ్వు వచ్చి నాపై కోపడ్డావు. ఆరోజు నువ్వు ఎంతో కంగారుపడ్డావో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అప్పుడు నిన్ను కంగారు పెట్టినందుకు సారీ. నాన్న మరణంతో పరిస్థితులు చీకటిగా మారాయి. నువ్వు మానసిక కుంగుబాటుకు లోనయ్యావు. ఇకపై నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను  అన్ని విషయాల్లో సాయం చేస్తాను.

కానీ  ఈ మధ్య కాలంలో కొన్ని న్యూస్ ఛానల్ లో నీ గురించి ఫేక్ వార్తలు రాస్తున్నారు. మా అమ్మ కూడా మనిషే కదా. ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయి, కనీసం నా గురించి అయిన దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దు అంటూ భావోద్వేగానికి గురైంది నైనిక.  ఇక అక్కడే ఉన్న రజినీతోపాటు ఇతర సెలబ్రెటీలు కన్నీళ్లు పెట్టుకున్నారు.

 

Leave a Reply